AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: జలపాతంలో ఈత కొట్టేందుకు వెళ్లి అదృశ్యం.. కళ్లముందే కొట్టుకుపోయాడు! వీడియో

సరదాగా ఈతకు వెళ్లిన ఓ వ్యక్తి జలపాతంలో దూకి అదృశ్యమయ్యాడు. వరుసగా కురుస్తున్న వర్షాల ధాటికి జలపాతం ఉధృతుకి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. మహారాష్ట్రలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకెళ్తే.. స్వప్నిల్ ధావ్డే అనే వ్యక్తి మహారాష్ట్రలోని ఓ జిమ్‌ను నిర్వహిస్తున్నాడు. జిమ్‌కి వచ్చే మరో 32 మంది వ్యక్తులతో కలిసి స్వప్నిల్‌ శనివారం (జూన్‌ 29) విహారయాత్ర కోసం..

Watch Video: జలపాతంలో ఈత కొట్టేందుకు వెళ్లి అదృశ్యం.. కళ్లముందే కొట్టుకుపోయాడు! వీడియో
Pune Man Goes Missing In Waterfall Water
Srilakshmi C
|

Updated on: Jul 01, 2024 | 6:48 PM

Share

పూనె, జులై 1: సరదాగా ఈతకు వెళ్లిన ఓ వ్యక్తి జలపాతంలో దూకి అదృశ్యమయ్యాడు. వరుసగా కురుస్తున్న వర్షాల ధాటికి జలపాతం ఉధృతుకి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. మహారాష్ట్రలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకెళ్తే.. స్వప్నిల్ ధావ్డే అనే వ్యక్తి మహారాష్ట్రలోని ఓ జిమ్‌ను నిర్వహిస్తున్నాడు. జిమ్‌కి వచ్చే మరో 32 మంది వ్యక్తులతో కలిసి స్వప్నిల్‌ శనివారం (జూన్‌ 29) విహారయాత్ర కోసం తమ్హిని ఘాట్‌లోని ప్లస్ వ్యాలీ సందర్శనకు వెళ్లారు. అక్కడ కొండల మధ్య జలపాతాలు నీటితో కళకళలాడుతూ కనిపించాయి. ఇంతలో స్వప్నిల్ నీళ్లలో ఈత కొట్టేందుక సిద్ధమయ్యాడు. రాళ్లపై నిలబడి ఎత్తు నుంచి జలపాతంలోకి దూకడం వీడియోలో కనిపిస్తుంది.

అయితే స్వప్నిల్‌ దూకిన ప్రాంతంలో నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో ఈత కొట్టేందుకు ప్రయత్నించినప్పటికీ ప్రవాహాల ధాటికి అతను మునిగిపోతున్నట్లు వీడియోలో చూడొచ్చు. దీంతో అతను రాళ్లను పట్టుకుని పైకి వచ్చే ప్రయత్నం చేశాడు. కానీ సపోర్టు దొరకకపోవడంతో నీటి ప్రవాహంలో కొట్టుకుంటూ పై నుంచి కిందటకు పడిపోతాడు. పడిపోయే సమయంలో రాళ్లపై ఉన్న అతడి స్నేహితులు చూస్తూ ఉంటారే గానీ అతడిని కాపాడే ప్రయత్నం చేయకపోవడం కూడా వీడియోలో కనిపిస్తుంది. అదృశ్యమైన స్వప్నిక్‌ కోసం వెతుకులాట ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

కాగా ఆదివారం మధ్యాహ్నం జలపాతాలు వీక్షించేందుకు వెళ్లిన ఓ కుటుంబం నిట మునిగిపోయారు. పూణేలోని లోనావాలాలోని భూషి డ్యామ్ జలపాతం వద్ద భూషి డ్యామ్‌ చూసేందుకు వచ్చి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు జలపాతంలో కొట్టుకుపోయారు. వీరు వెళ్లిన సమయంలో నీటిమట్టం ఒక్కసారిగా పెరగడంతో ఐదుగురు కుటుంబ సభ్యులు నీళ్లలో కొట్టుకుపోయారు. ఓ మహిళ, నలుగురు పిల్లలు ప్రవాహంలో చిక్కుకున్నారు. స్థానికులు వారిని కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. లోనావాలాలోని భూషి డ్యామ్ బ్యాక్ వాటర్‌లో మూడు మృతదేహాలు లభ్యంకాగా.. మరో 2 మృతదేహాల కోసం అన్వేషణ కొనసాగుతోంది. కాగా గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు జలపాతం వద్ద నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.