AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI: రూ.2000 నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన.. మార్కెట్లో రూ.7,581 కోట్ల నోట్లు!

రూ.2000 నోట్లు ఇప్పుడు కనుమరుగైపోతున్నాయి. మార్కెట్లో చెలామణిలో ఉన్న ఈ నోట్లను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) గత ఏడాది మే 19వ తేదీన ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ నోట్లు ఇంకా బ్యాంకులకు చేరుకుంటూనే ఉన్నాయి. తాజాగా ఈ నోట్లపై రిజర్వ్‌ బ్యాంక్‌ కీలక నివేదికను విడుదల చేసింది..

RBI: రూ.2000 నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన.. మార్కెట్లో రూ.7,581 కోట్ల నోట్లు!
Rs 2000 Notes
Subhash Goud
|

Updated on: Jul 01, 2024 | 6:03 PM

Share

చెలామణి నుంచి తొలగించిన రూ.2000 నోట్లలో 97.87 శాతం తిరిగి బ్యాంకులకు చేరినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వెల్లడించింది. అయితే రూ.7,581 కోట్ల విలువైన నోట్లు ఇప్పటికీ ప్రజల వద్ద ఉన్నాయని ఆర్బీఐ తన డేటాలో వెల్లడించింది. 2023 మే 19న చలామణిలో ఉన్న రూ. 2000 నోట్లను ఉపసంహరించుకోవాలని ఆర్‌బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. మే 19, 2023న వ్యాపారం ముగిసే సమయానికి చెలామణిలో ఉన్న రూ.2000 డినామినేషన్ బ్యాంకు నోట్ల మొత్తం విలువ రూ.3.56 లక్షల కోట్లు. జూన్ 28, 2024న వ్యాపారం ముగిసే సమయానికి రూ.7,581 కోట్లకు తగ్గింది.

రూ.2000 నోట్లలో 97.87 శాతం జూన్ 28, 2024 నాటికి బ్యాంకులకు తిరిగి వచ్చినట్లు సెంట్రల్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలోని అన్ని బ్యాంకు శాఖలలో మార్పిడి సౌకర్యం అందుబాటులో ఉంది. మే 19, 2023 నుండి, రూ. 2000 బ్యాంకు నోట్లను మార్చుకునే సదుపాయం కూడా రిజర్వ్ బ్యాంక్ 19 ఇష్యూ కార్యాలయాల్లో అందుబాటులో ఉంది.

అక్టోబర్ 7, 2023 గడువు ముగిసిన తర్వాత రిజర్వ్‌ బ్యాంక్‌ ఇష్యూ కార్యాలయాలు అక్టోబర్ 9, 2023 నుండి వ్యక్తులు, సంస్థల నుండి రూ. 2000 నోట్లను వారి బ్యాంక్ ఖాతాలలో డిపాజిట్ చేయడానికి స్వీకరిస్తున్నాయి. ఇది కాకుండా, ప్రజలు తమ బ్యాంక్ ఖాతాలలో డిపాజిట్ చేయడానికి దేశంలోని ఏ పోస్టాఫీసు నుండి అయినా ఆర్బీఐ ఏదైనా ఇష్యూ కార్యాలయానికి 2000 రూపాయల బ్యాంకు నోట్లను పంపవచ్చు.

ఇవి కూడా చదవండి

బ్యాంకు నోట్ల డిపాజిట్/మార్పిడి కోసం 19 ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాలు అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్ము, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలో ఉన్నాయి. 2016 నవంబర్‌లో చలామణిలో ఉన్న పాత రూ.1000, రూ.500 నోట్లను తొలగించిన తర్వాత రూ.2000 నోట్లను ప్రవేశపెట్టారు.

ఇది కూడా చదవండి: Credit Card Rules: ఈ బ్యాంకు క్రెడిట్‌ కార్డులు వాడుతున్నారా? కొత్త నిబంధనలు

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మొన్నటివరకు ఫిజియో థెరపిస్ట్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
మొన్నటివరకు ఫిజియో థెరపిస్ట్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
తెలంగాణలో అత్యంత పేదరికంలో మగ్గుతున్నవారికి శుభవార్త..!
తెలంగాణలో అత్యంత పేదరికంలో మగ్గుతున్నవారికి శుభవార్త..!
Hyderabad: ఇబ్రహీంబాగ్ సరస్సులో హాట్ ఎయిర్ బెలూన్ అత్యవసర ల్యాండి
Hyderabad: ఇబ్రహీంబాగ్ సరస్సులో హాట్ ఎయిర్ బెలూన్ అత్యవసర ల్యాండి
ఐశ్వర్య రాజేష్ క్యూట్ ఫోటోలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
ఐశ్వర్య రాజేష్ క్యూట్ ఫోటోలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
కొత్త అజెండాతో పెట్టుబడులకు సీఎం రేవంత్ స్కెచ్..!
కొత్త అజెండాతో పెట్టుబడులకు సీఎం రేవంత్ స్కెచ్..!
తానాజీ పార్ట్‌ 2 హింట్ ఇచ్చిన అజయ్ దేవగన్‌.. సీక్వెలా.. ప్రీక్వెల
తానాజీ పార్ట్‌ 2 హింట్ ఇచ్చిన అజయ్ దేవగన్‌.. సీక్వెలా.. ప్రీక్వెల
పవన్ కళ్యాణ్ ప్లాన్ C.. ఫ్యూచర్ అదే..
పవన్ కళ్యాణ్ ప్లాన్ C.. ఫ్యూచర్ అదే..
తురిమిన కొబ్బరిని ఇలా నిల్వ చేస్తే నెలల తరబడి వాడుకోవచ్చు
తురిమిన కొబ్బరిని ఇలా నిల్వ చేస్తే నెలల తరబడి వాడుకోవచ్చు
హైదరాబాద్‌లో హాట్ ఎయిర్ బెలూన్స్ రైడ్‌.. ఇలా బుక్‌ చేసుకోండి!
హైదరాబాద్‌లో హాట్ ఎయిర్ బెలూన్స్ రైడ్‌.. ఇలా బుక్‌ చేసుకోండి!
ధనుష్- మృణాళ్ పెళ్లి రూమర్లు.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే?
ధనుష్- మృణాళ్ పెళ్లి రూమర్లు.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే?