AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cooler Tips: ఏసీలాగా కూలర్‌ కూడా పేలుతుందా? ఇలా చేస్తే ప్రమాదమేనంటున్న నిపుణులు

ACల వలె కూలర్‌లు కూడా పేలుడు జరుగుతాయా? ఏసీలు అంటే అందులో గ్యాస్‌తో కూడుకున్న కంప్రెసర్‌ ఉంటుంది. కానీ కూలర్లలో అలాంటిది ఉండదు. మరి కూలర్లు పేలుతాయని ఎందుకు అంటుంటారు నిపుణులు. ఇవి కూడా ప్రమాదకరమైనవి. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ఇక్కడ కొన్ని ముఖ్యమైన చిట్కాలు అందిస్తున్నాము..

Cooler Tips: ఏసీలాగా కూలర్‌ కూడా పేలుతుందా? ఇలా చేస్తే ప్రమాదమేనంటున్న నిపుణులు
Cooler Tips
Subhash Goud
|

Updated on: Jun 30, 2024 | 9:33 PM

Share

ACల వలె కూలర్‌లు కూడా పేలుడు జరుగుతాయా? ఏసీలు అంటే అందులో గ్యాస్‌తో కూడుకున్న కంప్రెసర్‌ ఉంటుంది. కానీ కూలర్లలో అలాంటిది ఉండదు. మరి కూలర్లు పేలుతాయని ఎందుకు అంటుంటారు నిపుణులు. ఇవి కూడా ప్రమాదకరమైనవి. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ఇక్కడ కొన్ని ముఖ్యమైన చిట్కాలు అందిస్తున్నాము. దీని ద్వారా మీరు కూలర్ పేలుడు ప్రమాదాన్ని తగ్గించవచ్చు. మీ భద్రతను పెంచుకోవచ్చు.

ఇది కూడా చదవండి: Phone Storage Tips: మీ ఫోన్‌ స్టోరేజీ నిండిపోయిందా? ఈ ట్రిక్స్‌ ఉపయోగిస్తే ఖాళీ అవుతుంది

మీరు కూడా ఇక్కడ చెప్పిన చిట్కాలను పాటిస్తే మీ కూలర్‌ పేలిపోయే అవకాశాలు తగ్గుతాయి. అలాగే, దాని మరమ్మతు ఖర్చు ఉండదు. మీరు కూడా ఎయిర్ కూలర్‌ని ఉపయోగిస్తుంటే, మీరు ఇక్కడ పేర్కొన్న చిట్కాలను అనుసరించాలి.

ఇవి కూడా చదవండి

నిజంగా కూలర్ పేలుతుందా?

ఏసీలలాగా కూలర్‌ పేలుతుందని భయాందోళన చెందుతుంటారు. ఏసీల వల్ల జరిగే ప్రమాదం కన్న కూలర్‌లలో చాలా తక్కువ. కానీ మీరు మీ కూలర్‌ను క్రమానుగతంగా శుభ్రం చేయకపోతే కూలర్ త్వరగా చెడిపోతుంది. దీని వల్ల కూలర్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా కూడా పేలుడు సంభవించవచ్చు. అవకాశం ఉంది. అంటే షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు అంటుకుని పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నట్లు. పేలడం అంటే ఏదో బాంబు పేలినట్లు కాదు.

ప్రమాదం నుండి కూలర్‌ను ఎలా రక్షించాలి?

మీ కూలర్ సజావుగా నడవాలంటే మీరు క్రమానుగతంగా కూలర్‌ను శుభ్రం చేయాలి. ఇది కాకుండా కూలర్ నిర్వహణ కూడా చేయాలి. అలాగే కూలర్ కిట్, పంప్ క్రమానుగతంగా సర్వీస్ చేయాలి. మీరు ఇలా చేస్తే, మీ కూలర్‌ వల్ల షార్ట్‌ సర్క్యూట్‌ జరిగే ప్రమాదం ఉండదు.

ఈ విషయాల పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం:

ప్రతి సీజన్ ప్రారంభంలో కూలర్‌లను చెక్‌ చేసి వాడాలి. ఏదైనా పనిచేయకపోవడం లేదా అసాధారణ ధ్వని విషయంలో వెంటనే టెక్నిషియన్‌ను పిలిపించి సరి చేయించాలి. ఈ జాగ్రత్తలను అనుసరించడం ద్వారా మీరు కూలర్ ప్రమాదం చాలా వరకు తగ్గించవచ్చు.

ఇది కూడా చదవండి:Mobile Tips: వర్షంలో మీ ఫోన్‌లోకి నీరు చేరిందా? ఈ తప్పులు చేయకుండా ఇలా చేయండి!

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి