Smartphone: కొత్త ఫోన్‌ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? ముందు ఈ విషయాలు తెలుసుకోండి

మార్కెట్లో వందల రకాల ఫోన్‌లు, కంపెనీలు ఉండగా ఏ ఫోన్‌ను కొనుగోలు చేయాలనే ఆలోచన వేధిస్తూనే ఉంటుంది. అయితే మీ బడ్జెట్‌పైనే మీ ఫోన్‌ ఆధారపడి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ స్మార్ట్‌ ఫోన్‌ కొనుగోలు చేసే సమయంలో కచ్చితంగా కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలని టెక్‌ నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ స్మార్ట్‌ ఫోన్‌ కొనుగోలు చేసే సమయంలో...

 Smartphone: కొత్త ఫోన్‌ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? ముందు ఈ విషయాలు తెలుసుకోండి
Smartphone
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 30, 2024 | 8:40 PM

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ వినియోగం అనివార్యంగా మారింది. కచ్చతంగా ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉండే పరిస్థితి వచ్చేసింది. ప్రతీ చిన్న పనికి స్మార్ట్‌ ఫోన్‌ అవసరం వస్తోంది. దీంతో ఫోన్‌లను కొనుగోలు చేసే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అయితే మనలో చాలా మంది స్మార్ట్ ఫోన్‌ కొనుగోలు చేసే సమయంలో చాలా కన్ఫ్యూజ్‌కు గురవుతుంటారు.

మార్కెట్లో వందల రకాల ఫోన్‌లు, కంపెనీలు ఉండగా ఏ ఫోన్‌ను కొనుగోలు చేయాలనే ఆలోచన వేధిస్తూనే ఉంటుంది. అయితే మీ బడ్జెట్‌పైనే మీ ఫోన్‌ ఆధారపడి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ స్మార్ట్‌ ఫోన్‌ కొనుగోలు చేసే సమయంలో కచ్చితంగా కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలని టెక్‌ నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ స్మార్ట్‌ ఫోన్‌ కొనుగోలు చేసే సమయంలో ఎలాంటివి చూడాలో ఇప్పుడు తెలుసుకుందాం..

* ప్రస్తుతం 5జీ నెట్‌వర్క్‌ విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని పట్టణాలకు 5జీ విస్తరించనుంది. ఇక 5జీ టెక్నాలజీతో ఎన్నో మార్పులు జరగనున్నాయి. కాబట్టి వీలైనంత వరకు ప్రస్తుతం 5జీ ఫోన్‌ను కొనుగోలు చేయడం బెటర్‌.

* ఎక్కువగా వీడియోలు చూడడానికి ఆసక్తి చూపించే వారు స్క్రీన్‌ను పరిగణలోకి తీసుకోవాలి. ముఖ్యంగా ఇలాంటి వారు అమోలెడ్‌ డిస్‌ప్లే, డ్యూయల్‌ స్పీకర్స్‌, 3.5 ఎమ్‌ఎమ్‌ జాక్‌ వంటి ఫీచర్లు ఉన్న ఫోన్‌ను సెలక్ట్ చేసుకోవాలి.

* ఇక మీరు గేమింగ్ లవర్స్‌ అయితే 90 హెర్జ్‌ లేదా 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తోపాటు 240 హెర్జ్‌ ఆపై టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ కలిగిన మోడల్స్‌ను ఎంచుకోవడం బెటర్‌. అలాగే ప్రాసెసర్‌కు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రాసెసర్‌ వేగంగా ఉంటేనే గేమ్స్ తేలకగా ఆడుకోవచ్చు.

* కెమెరాకు ప్రాధాన్యత ఇచ్చ వేరు ఎక్కువ మెగాపిక్సెల్స్‌ ఉన్న స్మార్ట్‌ ఫోన్‌ను ఎంచుకోవాలి. ప్రస్తుతం మార్కెట్లో తక్కువ ధరలో కూడా మంచి కెమెరా క్లారిటీతో ఉన్న ఫోన్‌లు అందుబాటులోకి వస్తున్నాయి.

* ఇక స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేసే సమయంలో చూడాల్సిన మరో అంశం ఆపరేటింగ్ సిస్టమ్‌. వీలైనంత వరకు లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్‌ ఉన్న ఫోన్‌ను కొనుగోలు చేయడానికి ప్రయత్నించాలి. దీనివల్ల అన్ని రకాల లేటెస్ట్‌ ఫీచర్లను పొందొచ్చు.

* అలాగే స్మార్ట్‌ ఫోన్‌ కొనుగోలు చేసే ముందు గుర్తుంచుకోవాల్సిన మరో అంశం సర్వీస్‌ ఎలా ఉంటుంది. మీకు దగ్గర్లో సర్వీస్ ఉందా.? లేదా.? అన్న విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి.

* కొన్ని స్మార్ట్‌ ఫోన్‌లు యూజర్లకు ఎక్కువ కాలం ఉచితంగా అప్‌డేట్స్‌ను అందిస్తుంటాయి. కాబట్టి ఎక్కువగా అప్‌డేట్స్‌ను అందించే ఫోన్‌లను కొనుగోలు చేయడానికి మొగ్గు చూపాలి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే