Free Wi-Fi: ఎయిర్‌పోర్ట్‌లో ఫ్రీ వైఫై వాడుతున్నారా..? అయితే మీరు తస్మాత్ జాగ్రత్త!
అత్యాధునిక సాంకేతికత మనిషికి ఎంత సౌలభ్యాన్ని అందిస్తోందో.. అంతే స్థాయిలో ప్రమాదాన్ని ముంగిట ఉంచుతోంది. ఏ మాత్రం ఏమరపాటుగా, నిర్లక్ష్యంగా వ్యవహరించినా కుచ్చుటోపీ పడటం ఖాయంగా పరిస్థితులు మారుతున్నాయి. మోసం ఏవిధంగా జరుగుతుందో.. అది జరిగే వరకూ అర్థంకానీ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా ఏకంగా ఎయిర్ పోర్టు నెట్ వర్క్ లలోనే పెద్ద స్కామ్ ఒకటి వెలుగుచూసింది.
సైబర్ నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. అందుబాటులోకి వస్తున్న అత్యాధునిక సాంకేతికత మనిషికి ఎంత సౌలభ్యాన్ని అందిస్తోందో.. అంతే స్థాయిలో ప్రమాదాన్ని ముంగిట ఉంచుతోంది. ఏ మాత్రం ఏమరపాటుగా, నిర్లక్ష్యంగా వ్యవహరించినా కుచ్చుటోపీ పడటం ఖాయంగా పరిస్థితులు మారుతున్నాయి. మోసం ఏవిధంగా జరుగుతుందో.. అది జరిగే వరకూ అర్థంకానీ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా ఏకంగా ఎయిర్ పోర్టు నెట్ వర్క్ లలోనే పెద్ద స్కామ్ ఒకటి వెలుగుచూసింది. ఆస్ట్రేలియాలోని ఎయిర్ పోర్టుల్లో ఒక ఫేక్ వైఫై తో ఓ వ్యక్తి మోసానికి పాల్పడినట్లు వెలుగుచూసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఇది విషయం..
పశ్చిమ ఆస్ట్రేలియాకు చెందిన 42 ఏళ్ల వ్యక్తి విమానాశ్రయాలు, దేశీయ విమానాల్లో మోసపూరిత వైఫై నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేశారనే ఆరోపణలపై ఆస్ట్రేలియా పోలీసులు అభియోగాలు మోపారు. ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీస్ (ఏఎఫ్పీ) ఈ మోసపూరిత నెట్‌వర్క్‌లు అప్రమత్తంగా లేని పర్యాటకుల నుంచి వ్యక్తిగత సమాచారాన్ని పొందడం కోసం నిజమైన నెట్‌వర్క్‌లు వలె నటించాయని పేర్కొంది. సైబర్ క్రైమ్‌కు సంబంధించిన తొమ్మిది ఆరోపణలను ఆ వ్యక్తిపై మోపారు.
ఆస్ట్రేలియాలోని ఓ వార్త పత్రిక కథనం ప్రకారం.. ఆ 42 ఏళ్ల వ్యక్తి, పెర్త్, మెల్‌బోర్న్, అడిలైడ్‌లోని విమానాశ్రయాలతో సహా అనేక ప్రదేశాలలో, దేశీయ విమానాలలో చట్టబద్ధమైన వై-ఫై నెట్‌వర్క్‌ల “ఈవిల్ ట్విన్” కాపీలను రూపొందించడానికి పరికరాన్ని ఉపయోగించినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. .
వినియోగదారులు తమ పరికరాలను నెట్‌వర్క్‌లకు కనెక్ట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు, వారు నకిలీ వెబ్ పేజీలోకి ఎంటర్ అవుతారు. అక్కడ వారి ఈ-మెయిల్ లేదా సోషల్ మీడియా లాగిన్‌లను ఉపయోగించి సైన్ ఇన్ చేయాల్సి వచ్చింది. అలా చేసిన వారికి పూర్తి వివరాలను నెట్ వర్క్ సేవ్ చేస్తున్నట్లు గుర్తించారు. వ్యక్తుల ఆన్‌లైన్ కమ్యూనికేషన్‌లు, స్టోర్ చేసిన చిత్రాలు, వీడియోలు లేదా బ్యాంక్ వివరాలతో సహా వ్యక్తిగత సమాచారాన్ని యాక్సెస్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గత ఏప్రిల్లో ఓ దేశీయ విమానంలో అనుమానాస్పద వై-ఫై నెట్‌వర్క్‌ను దాని ఉద్యోగులు గుర్తించడంతో తొలిసారి ఈ స్కామ్ వెలుగుచూసిందని పోలీసులు తెలిపారు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
ఈ సందర్భంగా ఆస్ట్రేలియా పోలీస్ అధికారులతో పాటు మన పోలీసులు కూడా కొన్ని జాగ్రత్తలు సూచించారు. ఏదైనా పబ్లిక్ వై-ఫై నెట్‌వర్క్‌లకు లాగిన్ చేసేటప్పుడు ఇంటర్నెట్ వినియోగదారులు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలని అన్నారు.
- ఉచిత వై-ఫై నెట్‌వర్క్‌కి కనెక్ట్ చేయడానికి, మీరు ఈ-మెయిల్ లేదా సోషల్ మీడియా ఖాతా ద్వారా లాగిన్ చేయడం వంటి వ్యక్తిగత వివరాలను నమోదు చేయవలసిన అవసరం ఉండదని గమనించాలని చెప్పారు.
- పబ్లిక్ హాట్‌స్పాట్‌లను ఉపయోగించే వారు తమ డేటాను ఎన్‌క్రిప్ట్ చేయడానికి,భద్రపరచడానికి వారి పరికరాలలో ప్రసిద్ధ వీపీఎన్ ను ఇన్‌స్టాల్ చేసుకోవాలని వివరించారు.
- పబ్లిక్ నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తున్నప్పుడు, ఫైల్ షేరింగ్‌ని నిలిపివేయాలని, బ్యాంకింగ్ కార్యకలాపాలు అస్సలు చేయకూడదని చెప్పారు.
- ఫ్రీ వైఫై కి కనెక్ట్ అయినప్పుడు, మీరు దాన్ని ఉపయోగించడం పూర్తి చేసిన తర్వాత, మీ పరికర సెట్టింగ్‌లను ‘ఫార్గెట్ నెట్ వర్క్’కి మార్చాలని సూచిస్తున్నారు.
- అలాగే బయటకు వెళ్తున్న సమయంలో మీ డివైజ్ వైఫై లను డిజేబుల్ చేయాలని, తద్వారా ఆటోమేటిక్ గా కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉండవను చెబుతున్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..