- Telugu News Photo Gallery Cinema photos Lokesh Kanagaraj gave an update to check the rumors about Coolie movie
Lokesh Kanagaraj: ఆ రూమర్స్‌కు చెక్ పెట్టిన లోకేష్.. ఇంతకీ ఏంటా పుకార్లు.?
లియో సినిమా అనుకున్న స్థాయిలో వర్కవుట్ కాకపోవటంతో లోకేష్ కనగరాజ్ అప్‌కమింగ్ సినిమాల మీద కన్‌ప్యూజన్ క్రియేట్ అయ్యింది. ముఖ్యంగా రజనీతో లోకేష్ చేయాల్సి కూలీ సినిమా మీద అనుమానాలు మొదలయ్యాయి. తాజాగా ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు కెప్టెన్ లోకేష్.
Updated on: Jul 01, 2024 | 4:05 PM

లియో సినిమా అనుకున్న స్థాయిలో వర్కవుట్ కాకపోవటంతో లోకేష్ కనగరాజ్ అప్‌కమింగ్ సినిమాల మీద కన్‌ప్యూజన్ క్రియేట్ అయ్యింది. ముఖ్యంగా రజనీతో లోకేష్ చేయాల్సి కూలీ సినిమా మీద అనుమానాలు మొదలయ్యాయి. తాజాగా ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు కెప్టెన్ లోకేష్.

వరుస సూపర్ హిట్స్‌తో కోలీవుడ్‌లో కొత్త ట్రెండ్ సెట్ చేసిన లోకేష్ కనగరాజ్, లియో విషయంలో మాత్రం కాస్త తడబడ్డారు. ఈ సినిమా సెట్స్ మీద ఉన్న టైమ్‌లోనే రజనీకాంత్ హీరోగా ఓ ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేశారు లోకేష్.

లియో రిలీజ్ అయిన కొద్ది రోజుల వరకు సైలెంట్‌గా ఉన్న లోకేష్, రీసెంట్‌గా టైటిల్ టీజర్‌తో రజనీ సినిమా థీమ్‌ను రివీల్ చేశారు. ఫస్ట్ గ్లింప్స్ వచ్చిన కొద్ది రోజుల్లోనే కూలీని పక్కన పెట్టేశారన్న ప్రచారం జరిగింది.

లోకేష్‌తో వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సెస్‌తో కూలీకి రజనీ బ్రేక్ వేశారని, ఆ డేట్స్‌ను అట్లీ, సల్మాన్ ప్రాజెక్ట్‌కు ఇచ్చారన్న న్యూస్ కోలీవుడ్‌లో తెగ వైరల్ అయ్యింది.తాజాగా రూమర్స్‌కు చెక్ పెట్టే అప్‌డేట్ ఇచ్చారు లోకేష్ కగనరాజ్.

కూలీ కోసం రెడీ అవుతున్న రజనీతో కలిసి దిగిన సెల్ఫీని సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేసిన లోకేష్, కూలీ ఆన్ కార్డ్స్ అన్న క్లారిటీ ఇచ్చేశారు. కాలా రజనీ లుక్‌ను గుర్తు చేసేలా ఉంది కూలీ గెటప్. ఈ అప్‌డేట్‌తో రజనీని యాక్షన్ మోడ్‌లో చూడాలనుకున్న ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.




