- Telugu News Photo Gallery Cinema photos Kriti Sanon is serious as to why there are so many people on the shooting set of the movie
Film News: ఓ ఆర్టిస్ట్ కోసం అంత మందీ అవసరమా? ఈ నటీమణులు ఏమ్మన్నారంటే.?
స్టార్స్ ని గుర్తుపట్టడం ఎలా? స్టార్ ఒక ప్రదేశంలో ఉన్నట్టు తెలిసేదెలా? ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేంటి? ఓ మేకప్ ఆర్టిస్ట్ ఉంటాడు. అతనికో అసిస్టెంట్, ఓ హెయిర్ డ్రెస్సర్, అతనికో అసిస్టెంట్, ఓ మేనేజర్, ఇంకో బోయ్... ఇలా జనాలు చుట్టుముట్టేస్తే అక్కడ స్టార్ ఉన్నట్టేకదా అని అంటారా? యాజ్ ఇట్ ఈజ్‌గా ఈ విషయం మీదే ఇండస్ట్రీలో డిస్కషన్ జరుగుతోంది. అసలు సెట్లో ఎంత మంది ఉండాలి? మన దగ్గర ఎంత మంది ఉంటున్నారు? పోనీ ఉన్నవారందరూ పనిచేస్తున్నారా? ఓ ఆర్టిస్ట్ మేకప్ కోసంగానీ, అసిస్టెన్స్ కోసంగానీ అంత మందీ అవసరమా?
Updated on: Jul 01, 2024 | 4:03 PM

ఆ మధ్య ఈ విషయాన్ని గురించి గట్టిగానే స్పందించారు నటి, నిర్మాత కృతి సనన్. అసలు అంత మంది ఎందుకు ఉంటారు? అంటూ కాస్త ఘాటుగానే ప్రశ్నించారు. ఆమె ఏమన్నారో తెలుసుకుందాం..

మనతో ఎంత మంది ఉండాలనే విషయం మీద నటీనటులు ఓ నిర్ణయానికి రావాలంటూ మాట్లాడారు. మన చర్యలు హాస్యాస్పదంగా ఉండకూడదన్నది ఈ టాపిక్ మీద స్పందిస్తున్న ఆర్టిస్టుల నోటి నుంచి వస్తున్న మాట.

''నటీనటులతో ఎంత మంది ఉంటున్నారన్న విషయం మీద ఓ అవగాహన ఉండాలి. నిర్మాతకు సెట్లో ఎంత ఖర్చవుతుందనే విషయం గురించి తెలిసి ఉండాలి. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే వృథాగా ఖర్చుపెట్టించిన వాళ్లమవుతాం. దాని వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు'' అని అన్నారు కృతి సనన్.

ఇదే విషయం మీద లేటెస్ట్ గా స్పందించారు నటి, నిర్మాత లక్ష్మీ మంచు. ఆమె మాట్లాడుతూ ''హాలీవుడ్ సెట్లో స్టార్లే కుర్చీలు లాక్కుంటారు. వారి పక్కన ఓ మేకప్ ఆర్టిస్ట్, ఓ హెయిర్ డ్రస్సర్ ఉంటారు. చాలా తక్కువ మందితో పని జరుగుతుంటుంది. కానీ మన దగ్గర సెట్ నిండా మనుషులు కనిపిస్తారు.

హెయిర్ డ్రస్సర్ ఉంటే, అతనికో అసిస్టెంట్, మేకప్ ఆర్టిస్టుకో అసిస్టెంట్, కొన్ని సార్లు స్పాట్ బోయ్స్ కి కూడా అసిస్టెంట్లుంటారు. ఇంతమంది ఎందుకు? ఏం పని చేస్తారు? అంటే సమాధానాలు ఉండవు. వర్క్ స్టైల్ ఎక్కడికక్కడ ప్రత్యేకంగా ఉండటాన్ని చాలా మంది గమనిస్తాం. కానీ వృథా ఖర్చు ఎందుకు'' అని అన్నారు. సెట్లో స్టార్ల పరివారం మీద నిదానంగా చర్చ ఊపందుకుంటోంది. దీని గురించి ఇంకెంత మంది స్పందిస్తారో వేచి చూడాల్సిందే.




