- Telugu News Photo Gallery Cinema photos Vijay Deverakonda Acted Arjun Role in Prabhas Kalki 2898 AD Movie
Vijay Devarakonda: తగ్గేదేలే అంటున్న విజయ్ దేవరకొండ.. కల్కితో మరోసారి ట్రెండ్ రౌడీ బాయ్
హీరోల క్రేజ్‌కు హిట్లే కొలమానం. కానీ అది అందరికీ కాదు.. కొందరికి అందులోంచి మినహాయింపు ఉంటుంది. ఈ లిస్టులో విజయ్ దేవరకొండ కూడా ఉన్నారు. అదేంటి అంత మోసేస్తున్నారు అనుకుంటున్నారా..? మరి ఏం చేస్తాం.. సోషల్ మీడియాలో విజయ్ రచ్చ చూస్తుంటే నిజమే అనిపిస్తుంది మరి. తాజాగా కల్కితో మరోసారి ట్రెండ్ అవుతున్నారు రౌడీ బాయ్. హిట్ ఫ్లాపులతో పనిలేదు.. చేసే సినిమాలతో సంబంధం లేదు.. వరసగా డిజాస్టర్స్ వచ్చినా కెరీర్‌పై ఎఫెక్ట్ పడదు..
Updated on: Jul 01, 2024 | 4:57 PM

అర్జున్‌రెడ్డి విడుదలై ఏడేళ్లయింది అనేది న్యూస్. నిన్న మొన్న షూటింగ్ చేసినట్టుంది.. అప్పుడే ఏడేళ్లు కావడం ఏంటంటూ విజయ్ దేవరకొండ పెట్టిన ట్వీట్ వైరల్ అవుతోంది.

హిట్ ఫ్లాపులతో పనిలేదు.. చేసే సినిమాలతో సంబంధం లేదు.. వరసగా డిజాస్టర్స్ వచ్చినా కెరీర్‌పై ఎఫెక్ట్ పడదు.. అబ్బా ఇలాంటి ఇమేజ్ కదా హీరోలు కోరుకునేది. అదే ఇప్పుడు విజయ్ దేవరకొండకు వచ్చింది. రౌడీ బాయ్ విషయంలో ఏదైనా ఎక్స్‌ట్రీమ్ ఉంటుంది.

సోషల్ మీడియాలో మనోడిపై ట్రోలింగ్, నెగిటివిటీ అలాగే ఉంటుంది.. అదే స్థాయిలో అభిమానం కూడా చూపిస్తుంటారు ఫ్యాన్స్. మామూలుగా అయితే వరసగా మూడు నాలుగు ఫ్లాపులు వచ్చినపుడు ఏ హీరోకైనా డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది.

కానీ విజయ్ దేవరకొండ మాత్రం ఫెయిల్యూర్స్ ఉన్నా.. ట్రెండింగ్ అవుతుంటారు. ఇప్పుడు కూడా అంతే. కల్కిలో అర్జునుడిగా మహా అయితే 5 నిమిషాలు కనిపించారు విజయ్ దేవరకొండ. నాగ్ అశ్విన్ గత సినిమాలు ఎవడే సుబ్రమణ్యం, మహానటిలోనూ నటించారు విజయ్.

అమ్మాయిలు, అబ్బాయిలన్న తేడా లేకుండా అందరికీ నచ్చేసింది ఈ సినిమా. అఫ్‌కోర్స్ కొందరికి నచ్చలేదనుకోండి.. నచ్చని వారు చేసిన కామెంట్లు కూడా పబ్లిసిటీకి ఉపయోగపడ్డాయని అనుకున్నారు కెప్టెన్ సందీప్‌రెడ్డి వంగా.




