Nellore: నెల్లూరు జిల్లాలో విషాదం.. ప్రభుత్వ ఆస్పత్రి భవనంపై నుంచి దూకి డాక్టర్ సూసైడ్!
నెల్లూరు జిల్లాలో విషాద ఘటన జరిగింది. ప్రభుత్వ వైద్య కళాశాల భవనం నుంచి దూకి ఓ వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలిని చేజర్ల మండలం చిత్తలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యురాలిగా పనిచేస్తున్న జ్యోతిగా గుర్తించారుఎ. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వైద్యులకు ఓ వైద్య కళాశాలలో క్యాన్సర్ స్క్రీనింగ్‌పై శిక్షణ కార్యక్రమం జరుగుతోంది. ఈ శిక్షణ కార్యక్రమానికి డాక్టర్ జ్యోతి కూడా హాజరైంది..
నెల్లూరు, జులై 1: నెల్లూరు జిల్లాలో విషాద ఘటన జరిగింది. ప్రభుత్వ వైద్య కళాశాల భవనం నుంచి దూకి ఓ వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలిని చేజర్ల మండలం చిత్తలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యురాలిగా పనిచేస్తున్న జ్యోతిగా గుర్తించారుఎ. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వైద్యులకు ఓ వైద్య కళాశాలలో క్యాన్సర్ స్క్రీనింగ్‌పై శిక్షణ కార్యక్రమం జరుగుతోంది. ఈ శిక్షణ కార్యక్రమానికి డాక్టర్ జ్యోతి కూడా హాజరైంది. ఆమెతో పాటూ 11 మంది వైద్యులు దీనిలో భాగంగా శిక్షణకు హాజరయ్యారు. అయితే ఏం జరిగిందో తెలియదు గానీ జ్యోతి హఠాత్తుగా ఆసుపత్రి భవనం పైనుంచి కింద పడిపోయింది. స
అక్కడ ఉన్న సిబ్బంది వెంటనే ఆమెను ఆసుపత్రిలోకి చేర్చి చికిత్స అందించే ప్రయత్నం చేశారు. కానీ ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. కాగా మృతురాలు జ్యోతి భర్త రవిబాబు కూడా ప్రభుత్వ వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు సమాచారం అందించడంతో.. పోలీసులు కేసు నమోదు చేసుకుని, విచారణ చేపట్టారు. జ్యోతి ఆత్మహత్య చేసుకుందా లేదా ప్రమాదవశాత్తు పడిందా లేదంటే ఎవరైనా ఆమెను భవనంపై నుంచి కిందకు తోసేశారా.. అనే కోణంలో పోలీసుల విచారణ చేస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో అసలు కారణం వెళ్లడవుతుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పెంచలయ్య మీడియాకు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.