TGRTC Job Notification: తెలంగాణ ఆర్టీసీలో 3035 కొలువులకు సర్కార్‌ గ్రీన్‌ సిగ్నల్‌! త్వరలో నోటిఫికేషన్‌

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ)లో ఖాళీగా ఉన్న 3,035 పోస్టుల భర్తీకి రేవంత్‌ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపిన అన్ని పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. మొత్తం పోస్టుల్లో 2000 డ్రైవర్‌ పోస్టులు, 743 శ్రామిక్‌ పోస్టులు, 114 డిప్యూటీ సూపరింటెండెంట్‌ (మెకానిక్‌) పోస్టులు, 84 డిప్యూటీ సూపరింటెండెంట్‌ (ట్రాఫిక్‌) పోస్టులు, 25 డిపో మేనేజర్‌/అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌..

TGRTC Job Notification: తెలంగాణ ఆర్టీసీలో 3035 కొలువులకు సర్కార్‌ గ్రీన్‌ సిగ్నల్‌! త్వరలో నోటిఫికేషన్‌
TGRTC Job Notification
Follow us

|

Updated on: Jul 02, 2024 | 2:11 PM

హైదరాబాద్‌, జులై 2: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ)లో ఖాళీగా ఉన్న 3,035 పోస్టుల భర్తీకి రేవంత్‌ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపిన అన్ని పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. మొత్తం పోస్టుల్లో 2000 డ్రైవర్‌ పోస్టులు, 743 శ్రామిక్‌ పోస్టులు, 114 డిప్యూటీ సూపరింటెండెంట్‌ (మెకానిక్‌) పోస్టులు, 84 డిప్యూటీ సూపరింటెండెంట్‌ (ట్రాఫిక్‌) పోస్టులు, 25 డిపో మేనేజర్‌/అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ పోస్టులు, 23 అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (సివిల్‌) పోస్టులు, 15 అసిస్టెంట్‌ మెకానికల్ ఇంజనీర్‌ పోస్టులు, 11 సెక్షన్‌ ఆఫీసర్‌ (సివిల్‌) పోస్టులు, 7 మెడికల్‌ ఆఫీసర్‌ (జనరల్‌) పోస్టులు, 7 మెడికల్‌ ఆఫీసర్‌ (స్పెషాలిస్ట్‌) కొలువులు ఉన్నాయి.

ఆర్టీసీలో వివిధ కేటగిరిల్లో ఖాళీగా ఉన్న 3035 పోస్టులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు టీజీఎస్‌ఆర్టీసీలో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్‌ కూడా ఇవ్వలేదని, ప్రజా రవాణా వ్యవస్థకు పెద్ద పీట వేస్తూ తమ ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేస్తోందని ఆయన అన్నారు.

ఈ కొత్త రక్తంతో రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింతగా బలోపేతం చేస్తామని ఆయన చెప్పారు. మహాలక్ష్మి పథకం అమలుతో పెరిగిన రద్దీకి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కొత్త బస్సులను సంస్థ కొనుగోలు చేస్తోందని తెలిపారు. ఈ కొత్త బస్సులకు అనుగుణంగా నియమకాలు చేపడుతున్నట్లు వివరించారు. 3035 పోస్టులను వీలైనంత త్వరగా భర్తీ చేస్తామని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

వర్షాకాలంలో ఈవీ స్కూటర్లకు గడ్డు కాలం.. ఈ టిప్స్‌తో సమస్యలు దూరం
వర్షాకాలంలో ఈవీ స్కూటర్లకు గడ్డు కాలం.. ఈ టిప్స్‌తో సమస్యలు దూరం
ప్రపంచకప్‌ను ముట్టుకోని ప్రధాని మోడీ.. కారణమేంటో తెలుసా?
ప్రపంచకప్‌ను ముట్టుకోని ప్రధాని మోడీ.. కారణమేంటో తెలుసా?
ట్రెండింగ్ అవుతున్న ఆప్టికల్ ఇల్యూషన్.. జవాబు కనిపెట్టండి చూద్దాం
ట్రెండింగ్ అవుతున్న ఆప్టికల్ ఇల్యూషన్.. జవాబు కనిపెట్టండి చూద్దాం
జూలైలో లాంచ్ కానున్న టాప్ స్మార్ట్ ఫోన్లు ఇవే.. జాబితా పెద్దదే..
జూలైలో లాంచ్ కానున్న టాప్ స్మార్ట్ ఫోన్లు ఇవే.. జాబితా పెద్దదే..
ఆశలన్నీ ఆమె పైనే.. బడ్జెట్‌లో ఆ విషయాలపై నిపుణుల కీలక సూచనలు
ఆశలన్నీ ఆమె పైనే.. బడ్జెట్‌లో ఆ విషయాలపై నిపుణుల కీలక సూచనలు
ఆ నగరాల్లోని ఈవీ ప్రియులకు గుడ్ న్యూస్..!
ఆ నగరాల్లోని ఈవీ ప్రియులకు గుడ్ న్యూస్..!
పొడవాటి కర్రను ఇంట్లోకి తెస్తున్న వ్యక్తి క్షణాల్లో మృతి.. వీడియో
పొడవాటి కర్రను ఇంట్లోకి తెస్తున్న వ్యక్తి క్షణాల్లో మృతి.. వీడియో
పాదాలు, చేతి వేళ్ల మధ్యలో దురద పెడుతోందా.. వీటితో చెక్ పెట్టొచ్చు
పాదాలు, చేతి వేళ్ల మధ్యలో దురద పెడుతోందా.. వీటితో చెక్ పెట్టొచ్చు
హీరోయిన్ అతుల్య రవి ఇంట్లో చోరీ..
హీరోయిన్ అతుల్య రవి ఇంట్లో చోరీ..
కలలో చనిపోయిన పేరెంట్స్‌ కనిపిస్తున్నారా.? దీని అర్థం ఏంటంటే..
కలలో చనిపోయిన పేరెంట్స్‌ కనిపిస్తున్నారా.? దీని అర్థం ఏంటంటే..