Hyderabad: ‘మా బిడ్డలను కాపాడండి సార్’..! కాంచన్‌బాగ్‌లో చిన్నారిపై వీధికుక్కల దాడి.. పరిస్థితి విషమం..
వీధి కుక్కల బారి నుంచి మా బిడ్డలను కాపాడండి సార్..! వాటిని పట్టుకోవడానికి ఏం కావాలన్న మేం ఇస్తాం..! ఎంత ఖర్చైనా భరిస్తాం...! కానీ మా పిల్లల ప్రాణాలు కాపాడండి ప్లీజ్...! ఇది ఓ తండ్రి ఆవేదన.. కుక్కల దాడితో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ బిడ్డ తండ్రి వేదన.. ఈ మాటలు విన్న ఎవరికైనా కంటనీరు ఆగదు..

వీధి కుక్కల బారి నుంచి మా బిడ్డలను కాపాడండి సార్..! వాటిని పట్టుకోవడానికి ఏం కావాలన్న మేం ఇస్తాం..! ఎంత ఖర్చైనా భరిస్తాం…! కానీ మా పిల్లల ప్రాణాలు కాపాడండి ప్లీజ్…! ఇది ఓ తండ్రి ఆవేదన.. కుక్కల దాడితో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ బిడ్డ తండ్రి వేదన.. ఈ మాటలు విన్న ఎవరికైనా కంటనీరు ఆగదు..
తెలంగాణలో గత కొన్ని రోజులుగా వీధికుక్కలు హడలెత్తిస్తున్నాయి. కనిపించిన వారినల్లా కాటేస్తూ.. ఆస్పత్రి పాలుచేస్తున్నాయి. ముఖ్యంగా చిన్నారులపై కుక్కల దాడులు ఎక్కువైపోయాయి. విచక్షణ రహితంగా పిల్లలను కరిచి, గాయపరచడమే కాకుండా ప్రాణాలు సైతం తీస్తున్నాయి. దీంతో రోడ్లపైకి వెళ్లాలంటే ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. కుక్కల స్వైర విహారంతో ఇంటి నుంచి అడుగు బయట పెట్టాలంటే జనం జంకుతున్నారు. తాజాగా, హైదరాబాద్ నగరంలో వీధి కుక్కలు మరో చిన్నారిపై దాడి చేశాయి.
కాంచన్‌బాగ్‌లో వీధికుక్కలు రెచ్చిపోయాయి. DRDO టౌన్‌షిప్‌లో మూడేళ్ల బాలుడిపై ఐదు కుక్కల దాడి చేశాయి. ట్యూషన్ నుంచి వస్తుండగా ఒక్కసారిగా కుక్కలు విరుచుకుపడ్డాయి. తీవంగ్రా గాయపడ్డ బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.




టౌన్‌షిప్‌లో సుమారు 100 కుక్కలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. 15 సార్లు టౌన్‌షిప్‌లో ఇలాంటి ఘటనలు జరిగాయని… ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుక్కలను పట్టుకోవడానికి డబ్బులు ఇస్తామని చెప్పినా… అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి తమ ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..