Hyderabad: ప్రతిభ కనబర్చిన పోలీసులకు కమిషనర్ చౌహాన్ సత్కారం.. విధి నిర్వహణలో రాజీ పడొద్దంటూ..
Hyderabad: ఎల్బీనగర్‌లో మధ్య రాత్రి మహిళపై ప్రయోగించిన థర్డ్ డిగ్రీ లాంటి సంఘటనలు పోలీసు వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లెలా చేశాయి. మరోపక్క తమ పోలీసు ఉద్యోగాన్ని జీతం కోసం కాకుండా బాధ్యతగా తీసుకొని సమాజానికి తమ వంతు సేవ చేస్తున్న అధికారులు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి వారిని గుర్తించి ప్రోత్సహిస్తే సమాజానికి వాళ్లు ఆదర్శప్రాయంగా నిలుస్తారు. మహిళపై మధ్యరాత్రి పోలీస్ స్టేషన్లో డిగ్రీ ప్రయోగించిన పోలీసులను సస్పెండ్ చేసిన రాచకొండ కమిషనర్ చౌహన్ ఉత్తమ ప్రతిభ కనపరచిన పోలీస్..
హైదరాబాద్, ఆగస్టు 27: ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం అమల్లోకి రావడంతో పోలీసుల పైన ప్రజలకు నమ్మకం, విశ్వాసం పెరిగింది. తమ సమస్యలు పోలీసులకు చెప్పకుంటే తీరుతాయని, పరిష్కారం లభిస్తుందని నమ్ముతున్నారు. అయితే కొంతమంది పోలీసు అధికారుల అత్యాశ, దుర్బుద్ధి వల్ల పోలీస్ వ్యవస్థపై అప్పుడప్పుడు మచ్చలు ఏర్పడుతున్నాయి. మాజీ ఐఆర్ఎస్ సామ్యూల్‌ని హత్య చేసి అతని ఆస్తిని కొట్టేసేందుకు బాచుపల్లి ఎస్సై కృష్ణ ప్రయత్నించినలాంటి ఉదంతాలు.. మొన్న ఎల్బీనగర్‌లో మధ్య రాత్రి మహిళపై ప్రయోగించిన థర్డ్ డిగ్రీ లాంటి సంఘటనలు పోలీసు వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లెలా చేశాయి. మరోపక్క తమ పోలీసు ఉద్యోగాన్ని జీతం కోసం కాకుండా బాధ్యతగా తీసుకొని సమాజానికి తమ వంతు సేవ చేస్తున్న అధికారులు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి వారిని గుర్తించి ప్రోత్సహిస్తే సమాజానికి వాళ్లు ఆదర్శప్రాయంగా నిలుస్తారు. మహిళపై మధ్యరాత్రి పోలీస్ స్టేషన్లో డిగ్రీ ప్రయోగించిన పోలీసులను సస్పెండ్ చేసిన రాచకొండ కమిషనర్ దేవేంద్రసింగ్ చౌహన్ ఉత్తమ ప్రతిభ కనపరచిన మంది పోలీస్ అధికారులను గుర్తించి సత్కరించారు.
ప్రజలకి సేవలు అందించే విషయంలో రాజీ పడని, విధుల నిర్వహణలో సాంకేతికతను ఉపయోగించిన అధికారులకి రివార్డ్ అందించారు. సామాజిక భాగస్వామ్య కార్యక్రమాల ద్వారా ప్రజలతో మమేకం కావాలని ప్రజాసహకారం, సమర్థవంతమైన పని తీరు ద్వారా మాత్రమే శాంతి భద్రతలను అదుపులో ఉంచడం సాధ్యం అవుతుందని కమిషనర్ చౌహన్ తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణ, అత్యవసర ప్రతిస్పందన, పౌర ఫిర్యాదుల సత్వర పరిష్కారం, మహిళల భద్రత, ట్రాఫిక్ నిర్వహణ వంటి వాటి గూరించి వివరించారు. వినూత్నమైన విధానాలు, సురక్షితమైన కమ్యూనిటీల ఏర్పాటు కోసం కావలసిన లక్ష్యాలను సాధించడంలో విజయవంతమైనవిగా గుర్తించిన విధానాలను పాటించాలని సూచించారు. ఇంకా అధికారులు అందరూ తమ విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ చూపించాలని ప్రోత్సహించారు.
అందులో టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్, నోడల్ ఆఫిసర్లు పోలీసు డిపార్ట్‌మెంటుకు అందింస్తున్న సేవలు కేసులు చేధించటంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని వారిని సత్కరించారు. విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన వివిధ ర్యాంకుల్లో ఉన్న మొత్తం 105 మంది సిబ్బందిని సత్కరించారు. మే 2023 నుండి జూలై 2023 వరకు రాచకొండ కమీషనరేట్ పరిధిలో పేరు మోసిన నేరస్థుల, అంతర్రాష్ట్ర నేరగాళ్లు, చైన్ స్నాచర్లు, ప్రాపర్టీ నేరస్థులు, డ్రగ్స్ సరఫరా చేసేవారు, సైబర్ నేరస్థులు, వైట్ కాలర్ కేటుగాళ్లను అరెస్టు చేసి, వారికి జ్యుడీషియల్ కస్టడీ విధించి, PD యాక్ట్ ప్రయోగిస్తున్నామని అన్నారు.