Health Tips: డయాబెటిక్ పేషంట్లకి పుచ్చకాయ మంచిదేనా..? తింటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయా..? తెలుసుకుందాం రండి..

Health Tips: నేచురల్ షుగర్‌ని కలిగిన పుచ్చకాయ మధుమేహం ఉన్నవారి ఆరోగ్యానికి మంచిదేనా..? తింటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయా..? అనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. ఈ క్రమంలో పుచ్చకాయ ఆరోగ్యానికి మంచిదేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పుచ్చకాయలో ఉండే విటమిన్లు, పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ బి, విటమిన్ సి, కాల్షియం, సోడియం, మెగ్నీషియం, పొటాషియం, క్లోరిన్, జిటాకేరోటిన్లు, ఆల్కలైన్, విటమిన్ ఏ, విటమిన్ బి6, సుక్రోజ్ , ఫ్రక్టోజ్, గ్లూకోజ్, ఎలక్ట్రోలైట్లు సహా ఎన్నో..

Health Tips: డయాబెటిక్ పేషంట్లకి పుచ్చకాయ మంచిదేనా..? తింటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయా..? తెలుసుకుందాం రండి..
Watermelon And Diabetes
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Aug 26, 2023 | 7:53 AM

Health Tips: పుచ్చకాయ పండ్లు ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరమైనవి. అధిక పరిమాణంలో నీటిని కలిగిన పుచ్చకాయలను తింటే అన్ని రకాల ఆరోగ్య సమస్యలను నివారించడంతో పాటు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. అయితే అధిక మొత్తంలో నీటిని, నేచురల్ షుగర్‌ని కలిగిన పుచ్చకాయ మధుమేహం ఉన్నవారి ఆరోగ్యానికి మంచిదేనా..? తింటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయా..? అనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. ఈ క్రమంలో పుచ్చకాయ ఆరోగ్యానికి మంచిదేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పుచ్చకాయలో ఉండే విటమిన్లు, పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ బి, విటమిన్ సి, కాల్షియం, సోడియం, మెగ్నీషియం, పొటాషియం, క్లోరిన్, జిటాకేరోటిన్లు, ఆల్కలైన్, విటమిన్ ఏ, విటమిన్ బి6, సుక్రోజ్ , ఫ్రక్టోజ్, గ్లూకోజ్, ఎలక్ట్రోలైట్లు సహా ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఈ కారణంగా పుచ్చకాయ షుగర్ లెవెల్స్‌ను నియంత్రిచండంలో సమర్థవంతంగా పనిచేయగలదని నిపుణులు చెబుతున్నారు.

పుచ్చకాయ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

గుండె ఆరోగ్యం: పుచ్చకాయలోని లైకోపీన్, సిట్రులిన్ సమ్మేళనాలు గుండె మంటను తగ్గించడంతో పాటు రక్తపోటును తగ్గిస్తాయి. ఫలితంగా గుండె ఆరోగ్యం మెరుగుపరచడంలో పాటు గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది.

రోగ నిరోధక శక్తి: పుచ్చకాయలో విటమిన్ సి, లైకోపీన్ సహా అనేక యాంటీయాక్సెండ్లు పుష్కలంగా ఉంటాయి. ఈ శరీర రోగ నిరోధక శక్తి పెరిగి సీజనల్ వ్యాధులతో పాటు దీర్థకాలిక వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

జీర్ణక్రియ: పుచ్చకాయలో ఫైబర్, వాటర్ కంటెంట్ పుష్కలంగా ఉన్నందున, ఇది జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. ఇంకా జీర్ణ సమస్యలకు చెక్ పెడుతుంది.

చర్మ సంరక్షణ: ముందుగా చెప్పుకున్నట్లుగా పుచ్చకాయలో వాటర్ కంటెంట్, విటమిన్ సి అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి ముఖంపై మచ్చలు, మొటిమలను తగ్గించడంతో పాటు చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది.

కండరాల నొప్పి: పుచ్చకాయలో సిట్రులిన్ అనే అమైనో యాసిడ్ కండరాల నొప్పిని తగ్గించడంలో సహాయ పడుతుంది. ఇంకా కండరాలను బలోపేతం చేస్తుంది.

బరువు తగ్గడం: పుచ్చకాయలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాదు, ఫలితంగా బరువు తగ్గడంలో కూడా మెరుగ్గా పనిచేస్తుంది. పుచ్చకాయలోని పోషకాల కారణంగా కడుపు నిండుగా ఉన్న అనుభూతి కలుగుతుంది. ఫలితంగా పెద్ద మొత్తంలో ఆహారం తీసుకోలేరు.

(నోట్‌: ఈ ఆర్టికల్‌లోని సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరిగింది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం