కాంగ్రెస్ టికెట్ కోసం 1020 అప్లికేషన్లు.. కానీ సూపర్‌ సీనియర్స్‌కి ఏమైంది..? వేరే ప్లాన్స్‌ ఏమైనా ఉన్నాయా..?

Telangana: అప్లికేషన్‌ పెట్టుకోండి చాలు.. వెరిఫై చేసి టికెట్‌ ఇచ్చేస్తాం అనగానే వెయ్యి మంది దరఖాస్తు చేశారు. బహుశా గాంధీ భవన్‌లో అడుగుపెట్టని వాళ్లు కూడా అప్లికేషన్ ఫిల్‌ చేసి థర్డ్‌ పర్సన్‌తో పంపించి ఉంటారు. కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌కు వచ్చిన క్రేజ్‌ అది. ఒక్క టికెట్ కోసం ఇంతలా పోటీపడుతుంటే.. వాళ్లేంటి 'మాకేం వద్దు, మేం ఏ అప్లికేషన్ పెట్టుకోం' అని దూరంగా ఉన్నారు. అది కూడా కాంగ్రెస్‌ సీనియర్లు. టికెట్ వద్దనుకున్నారా, అడిగినా రాదనుకున్నారా? లేదా ఇంకేమైనా ప్లాన్ చేశారా? సూపర్‌ సీనియర్స్‌ మదిలో ఉన్నదేంటి..?

కాంగ్రెస్ టికెట్ కోసం 1020 అప్లికేషన్లు.. కానీ సూపర్‌ సీనియర్స్‌కి ఏమైంది..? వేరే ప్లాన్స్‌ ఏమైనా ఉన్నాయా..?
Telangana Congress
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Aug 27, 2023 | 5:00 AM

తెలంగాణ, ఆగస్టు 27: తుమ్మల నాగేశ్వరరావు, మైనంపల్లి హనుమంతరావు, టి.రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి.. ఇలా లిస్ట్ చెబుతూపోతే చాలా మంది ఉన్నారు. వీళ్లంతా అధికార పార్టీ టికెట్ కోసం ఎడతెగని పోరాటం చేస్తున్నారు. ఇంకా ఛాన్స్ ఉందేమోనని లాబీయింగ్ చేయిస్తూ, బల ప్రదర్శన చేస్తూ, రిమెండేషన్స్ పెట్టుకుంటూ ఎవరి ప్లాన్‌లో వాళ్లున్నారు. బీఆర్ఎస్‌లో పరిస్థితి ఇలా ఉంటే.. కాంగ్రెస్‌లో మాత్రం ఎలాంటి కొట్లాటలూ లేవు. మొత్తం పిన్ డ్రాప్ సైలెన్స్. టికెట్‌పై ఆశలు పెట్టుకున్న వాళ్లందరూ చాలా హ్యాపీగా అప్లై చేసుకున్నారు. టికెట్ వస్తుందా రాదా అన్నది తరువాత సంగతి. ముందైతే దరఖాస్తు పెట్టుకున్నారు. అభ్యర్ధుల లిస్ట్ ప్రకటించిన తరువాత ఏదైనా గొడవ ఉండొచ్చేమో గానీ ఇప్పటి వరకైతే అంతా ప్రశాంతం. ఇదే షాకింగ్ అనుకుంటే.. కొందరు కాంగ్రెస్ సీనియర్లు అసలు పోటీకే దూరంగా ఉన్నారు.

అయితే కాంగ్రెస్‌ అంటేనే టికెట్ల కోసం పంచాయితీలు, గొడవలు, ఆధిపత్య పోరు అనే బ్రాండ్ ఉండేది. టికెట్‌ కోసం గాంధీ భవన్‌లో ఫర్నిచర్‌ ధ్వంసం చేసిన రోజులు కూడా చూశాం. అలాంటిది అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో నేతలంతా ఐక్యంగా ఉన్నారు. సహజంగా కాంగ్రెస్ పార్టీలో సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ అనే రగడ జరుగుతుంటుంది. తమను కాదని నిన్న గాక మొన్న వచ్చిన వారికి ప్రాధాన్యం ఏంటని ప్రశ్నిస్తుంటారు. అప్పట్లో గ్రూప్-9 పేరుతో తెలంగాణలోనూ కొందరు సీనియర్లు రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాంటిది టికెట్ల విషయంలో అదే సీనియర్లలోని కొందరు సైలెంట్‌గా ఉండడం రాజకీయవర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.

కాంగ్రెస్‌కే షాక్‌ ఇచ్చిన సీనియర్లు..!

జానారెడ్డి.. మాజీ పీసీసీ చీఫ్‌. వి.హనుమంతరావు.. పార్టీలో పార్టీలో సీనియర్ లీడర్. గీతారెడ్డి.. వైఎస్, రోశయ్య హయాంలో మంత్రి. రేణుకాచౌదరి.. ఒకప్పటి కేంద్ర మంత్రి. మల్లు రవి.. పార్టీ వైస్ ప్రెసిడెంట్. అయితే వీళ్లెవరూ కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం అప్లై చేయలేదు. గతంలో ఎంపీగా గెలిచిన వాళ్లు కూడా ఈసారి అసెంబ్లీ టికెట్ కోసం ప్రయత్నించారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అసెంబ్లీ సీటుపై కర్చీఫ్ వేశారు. ప్రస్తుతం ఎంపీలుగా ఉన్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కూడా అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. గాంధీ భవన్ అంటే తెలియని వ్యక్తులు కూడా దరఖాస్తులు పెట్టుకున్నారు. అలాంటిది కాంగ్రెస్ పార్టీలో సీనియర్లుగా ఉన్న ఈ లీడర్లు ఎందుకని అసెంబ్లీకి పోటీ చేయడం లేదు? అధిష్టానం తమకు మినహా మరెవరికీ సీట్లు ఇవ్వదనే దరఖాస్తు చేసుకోలేదా? అప్లై చేసుకున్నా టికెట్ రాదని అప్లై చేయలేదా? పోటీ చేయడం ఇష్టం లేకనా? ఇంకా ఏమైనా ఇతరత్రా కారణాలు ఉన్నాయా? జానారెడ్డి, గీతారెడ్డి, వీహెచ్, రేణుకా చౌదరి, మల్లు రవితో పాటు నిరంజన్, కోదండరెడ్డి కూడా టికెట్‌ కోసం అప్లై చేయలేదు.

ఇవి కూడా చదవండి

కొంత మంది సీనియర్లు పోటీ చేయకపోవడానికి ప్రధాన కారణం.. వయసు మీద పడడం. పైగా బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్ధులతో పోటీ పడాలంటే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాస్త ఎక్కువ డబ్బే ఖర్చుపెట్టాల్సి రావొచ్చు. ఆర్థికంగా బలం లేని వాళ్లు పోటీకి దూరంగా ఉన్నారు. కేవలం పోటీ చేస్తానంటే సరిపోదుగా.. క్యాడర్‌ కూడా బలంగా ఉండాలి. సో, బలమైన క్యాడర్‌ లేని వాళ్లు కూడా ఈసారి దూరంగా ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఫేమస్‌ అయినా.. నియోజకవర్గాల్లో బలం లేకపోతే కష్టం. అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉండడానికి ఇదీ ఓ కారణమే. అయితే, సీనియర్లలో కొంతమందిని లోక్‌సభకు పంపే అవకాశం ఉండడం వల్లే అసెంబ్లీ టికెట్‌కు దరఖాస్తు చేయలేదనే టాక్ నడుస్తోంది. మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. ఆల్రడీ ఖమ్మం నియోజకవర్గంలో ప్రచారం కూడా మొదలుపెట్టారు. ఇక మాజీ మంత్రి గీతారెడ్డి.. ఆరోగ్యం సహకరించక పోటీకి దూరంగా ఉంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఒకవేళ పోటీ చేయాలనుకుంటే.. వచ్చే మార్చి, ఏప్రిల్‌లో ఎంపీ టికెట్‌ కోసం ప్రయత్నించొచ్చులే అని ఇప్పుడు సైలెంట్‌గా ఉన్నారని కూడా చెప్పుకుంటున్నారు. ఇక సీనియర్ నేత వి.హనుమంతరావు విషయమే కాస్త హాట్‌ టాపిక్‌గా కనిపిస్తోంది. వీహెచ్‌ ఈసారి రాజ్యసభకు వెళ్లాలనుకుంటున్నారని లేదా నామినేటెడ్‌ పదవి ఇచ్చినా చాలనే భావనతో ఉన్నారని అనుకున్నారు. పైగా వయసు మీదపడడంతో ఎన్నికల పోటీకి దూరంగా ఉంటారని భావించారు. కాని, వీహెచ్ అసెంబ్లీ టికెట్‌కు అప్లై చేయకపోవడానికి కారణం ఎంపీ సీటు ఆశిస్తుండడమే అని పార్టీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. అది కూడా వీహెచ్‌ ఖమ్మం పార్లమెంట్‌ సీటు ఆశిస్తున్నారట. ఆల్రడీ ఖమ్మం లోక్‌సభ సీటు కోసం రేణుకా చౌదరి ప్రయత్నిస్తున్నారు. ఆమెను కాదని వీహెచ్‌కు టికెట్‌ ఇస్తారా అనేది డౌట్.

ఏదేమైనా ఖమ్మం ఎంపీ టికెట్‌ కోసం వీహెచ్ పోటీపడితే మాత్రం అది కచ్చితంగా సెన్సేషనే అవుతుంది. ఇక జానారెడ్డి కూడా పోటీకి దూరంగా ఉండడం కొంత ఆశ్చర్యపరిచింది. జానారెడ్డి పోటీకి దూరంగా ఉండడానికి కారణం తన ఇద్దరు కుమారులకు అసెంబ్లీ టికెట్ ఇప్పించుకోవడానికే. ఒక కుటుంబం నుంచి ఒక్కరికే అనే రూల్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. అలాంటిది ఒకే కుటుంబం నుంచి ఇద్దరు పోటీ చేస్తున్నారు. మిర్యాలగూడ నుంచి రఘువీర్‌రెడ్డి, నాగార్జున సాగర్ నుంచి జయవీర్‌ రెడ్డి పోటీ చేసేందుకు అప్లికేషన్ పెట్టుకున్నారు. సో, ఈ ఇద్దరూ పోటీ చేస్తున్నప్పుడు తను రెస్ట్‌ తీసుకోవడమే మంచిదనుకున్నారు జానారెడ్డి. ఇక పార్టీ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి ఈసారి కచ్చితంగా జడ్చర్ల అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారనుకున్నారు. కాని అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకున్నారు. నాగర్‌ కర్నూల్‌ నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నందునే అసెంబ్లీ టికెట్‌కు పోటీ చేయలేదని చెప్పుకొచ్చారు.

సరే.. ఒకవేళ అప్లై చేసుకోకపోయినా టికెట్‌ వస్తుందా అంటే.. కండీషన్స్ అప్లై అని చెబుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరికలకు పుల్‌స్టాప్ పడలేదు. బీఆర్ఎస్‌ అసంతృప్త నేతల్లో కొందరు కాంగ్రెస్‌వైపు చూస్తున్నారు. అయితే, ఇలాంటి వాళ్లను చేర్చుకోడానికి ఏ ప్రాసెస్‌లో వెళ్లాలో పొలిటికల్ అఫైర్స్ కమిటీలో చర్చిస్తామని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. వాళ్లకు అప్లికేషన్స్‌ నుంచి మినహాయింపు ఇవ్వడమా లేదా గడువుతో సంబంధం లేకుండా అప్లై చేయించడమా అనేది తరువాత డిసైడ్ చేస్తామని చెబుతున్నారు. అయితే.. టికెట్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నా సరే.. రికమెండేషన్లు కచ్చితంగా నడుస్తాయంటున్నారు. సపోజ్.. తాండూరు టికెట్ అడుగుతున్న రమేష్‌ మహారాజ్‌కు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రికమండేషన్‌ ఉందని, రఘువీర్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, కిచ్చన్నగారి లక్ష్మారెడ్డికి రేవంత్‌రెడ్డి రికమండేషన్‌, మాజీ క్రికెటర్‌ అజహారుద్దీన్‌కు కాంగ్రెస్‌ పెద్దల అండదండలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు.

పైగా కాంగ్రెస్ నుంచి పోటీచేసేందుకు ఈసారి ఎక్కువ మంది ఎన్నారైలు ఆసక్తి చూపించారు. మొన్నీమధ్యే అమెరికాలో జరిగిన తానా సభలకు వెళ్లొచ్చారు రేవంత్‌ రెడ్డి. సో, ఎన్నారైలలో కొందరికి టికెట్ ఇచ్చేందుకు అధిష్టానం రెడీగా ఉందన్న చర్చ కూడా జరుగుతోంది. పాలకుర్తి నుంచి డాక్టర్ ఎర్రం రెడ్డి తిరుపతి రెడ్డి, అనుమాండ్ల ఝాన్సీ రెడ్డి.. మక్తల్ టికెట్ కోసం పోలీస్ చంద్రారెడ్డి.. కొల్లాపూర్ టికెట్‌ను అభిలాష్ రావు, కల్వకుర్తి నుంచి రఘు సుంకిరెడ్డి, ఎల్లారెడ్డి నుంచి మదన్ మోహన్ రెడ్డి, ఆదిలాబాద్ నుంచి కంది శ్రీనివాస్ రెడ్డి, జడ్చర్ల టికెట్‌ను మన్యం రాజశేఖర్ రెడ్డి ఆశిస్తున్నారు.

మొత్తానికి కాంగ్రెస్ టికెట్ నుంచి లోకల్ నుంచి ఎన్నారైల వరకు పోటీ చేస్తుంటే.. కొందరు సీనియర్లు మాత్రం పోటీకి దూరంగా ఉన్నారు. సరే.. వాళ్ల రీజన్స్ వాళ్లకు ఉన్నాయనుకోండి. కాకపోతే.. తెలంగాణలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి జరగవు కాబట్టి సీనియర్లు అసెంబ్లీకి పోటీ చేసుంటే బాగుండేదన్న టాక్ వినిపిస్తోంది.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే