Yadadri Pavithrotsavam: యాదాద్రి ఆలయంలో ప్రారంభమైన పవిత్రోత్సవాలు.. ఏ రోజున ఏ కార్యక్రమం ఉంటుందంటే..
యాదాద్రి క్షేత్రంలో ప్రతి ఏటా శ్రావణ శుద్ధ దశమి నుంచి ద్వాదశి వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. రెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు నిర్విఘ్నంగా కొనసాగాలని పాంచరాత్రాగమ శాస్త్ర పద్ధతిలో విశ్వక్సేనుడికి తొలిపూజలు చేశారు. స్వామివారి ఆలయంలో సాయంత్రం స్వస్తిపుణ్య హవాచనం చేశారు. అనంతరం పవిత్ర మంత్ర జలాలతో ఆలయం, పరిసరాలను అర్చకులు వేదమంత్రాలతో శుద్ధి చేశారు. అనంతరం ఉత్సవమర్తులకు స్నపన తిరుమంజనాలు నిర్వహించి దివ్య మనోహరంగా అలంకరించారు. అంతర్ ఆలయంలో..
ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకున్న యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి పుణ్యక్షేత్రంలో ఆలయ వార్షిక పవిత్రోత్సవాలు నేడు శ్రీకారం చుట్టారు. ఆలయంలో నిత్యవిధి కైంకర్యాల్లో దొర్లిన పొరపాట్ల నివారణ, క్షేత్ర ప్రాశస్త్యాన్ని మరింత ఇనుమడింపజేసేందుకు శ్రీవైష్ణవ దేవాలయాల్లో పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.
యాదాద్రి క్షేత్రంలో ప్రతి ఏటా శ్రావణ శుద్ధ దశమి నుంచి ద్వాదశి వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. రెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు నిర్విఘ్నంగా కొనసాగాలని పాంచరాత్రాగమ శాస్త్ర పద్ధతిలో విశ్వక్సేనుడికి తొలిపూజలు చేశారు. స్వామివారి ఆలయంలో సాయంత్రం స్వస్తిపుణ్య హవాచనం చేశారు. అనంతరం పవిత్ర మంత్ర జలాలతో ఆలయం, పరిసరాలను అర్చకులు వేదమంత్రాలతో శుద్ధి చేశారు. అనంతరం ఉత్సవమర్తులకు స్నపన తిరుమంజనాలు నిర్వహించి దివ్య మనోహరంగా అలంకరించారు. అంతర్ ఆలయంలో ప్రత్యేక వేదికపై అధిష్ఠింపజేసి స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవ ముఖ్యఘట్టమైన అంకు రారోపణ పర్వాలు సంప్రదాయరీతిలో నిర్వహించారు. ముందుగా ప్రధానాలయంలో స్వయంభువులను ఆరాధించి కవచమూర్తు లను కొలిచారు.
ఏడాది పాటు స్వామివారి కైకర్యాలు ఆలయంలో పూజల్లో, భక్తుల నుంచి తెలిసి తెలియక జరిగిన తప్పులు, దోషాలను నివారణకు ప్రతి ఏటా పవిత్ర ఉత్సవాలను లోకకల్యాణం.. దోష నివారణకు నిర్వహించడం ఆనవాయితీ. పంచ నారసింహ రూపాల్లో తన భక్తులకు దర్శనం ఇస్తున్న యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామికి నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుని పూజలు చేస్తుంటారు.
భక్తులు చేసే పూజల్లో తప్పులు దోషాలు దొర్లినా క్షమించి.. తనను నమ్మిన భక్తుల వెన్నంటి ఉండి అనునిత్యం వారి యోగక్షేమాలు స్వామి వారు చూస్తుంటారని భక్తుల విశ్వాసం. పవిత్ర ఉత్సవాలు (ఆదివారం) రెండవ రోజు పారాయణం, హవనం, మూలమంత్ర జపం, చక్రాబ్ది మండల ఆరాధన నిర్వహిస్తారు. మూడవ రోజు మహా పూర్ణాహుతి, శ్రీసుదర్శన ఆళ్వారుడు, స్వయంభువులు, ఉప ఆలయాల్లోని దేవతా మూర్తులకు పవిత్ర మాలల పర్వం చేపడుతారు. ఆలయ అర్చకులు, అధికారులు, సిబ్బందికి పవిత్ర మాలలను అందజేస్తారు.
ఈ పూజా పర్వాలను ప్రధానార్చకులు నల్లన్‌థిఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, ఆధ్వర్యంలో అర్చక బృందం, వేద పండితులు నిర్వహించారు. ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, దేవస్థాన ఈవో గీతా రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. విత్రోత్సవాలు జరిగే రేపు, ఎల్లుండి శ్రీ స్వామి వారి నిత్య కల్యాణం, నిత్య బ్రహ్మోత్సవం, శ్రీ సుదర్శన నారసింహ హోమాలను రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో గీతా రెడ్డి చెప్పారు. 29వ తేదీ నుంచి యథావిధిగా శ్రీ స్వామి వారి నిత్య కైంకర్యాలు జరుగుతాయని ఆమె తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..