Gayatri Jayanti 2023: ఈ ఏడాది గాయత్రీ జయంతిని ఎప్పుడు జరుపుకోవాలి.. గాయత్రీ మంత్రం ప్రాముఖ్యత ఏమిటో తెలుసా

గాయత్రీ జయంతి రోజున గాయత్రిదేవిని ఆరాధించడానికి సూర్యోదయానికి ముందు ఉదయాన్నే లేచి, స్నానం, ధ్యానం చేసిన తర్వాత.. ముందుగా ఉదయించే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి. దీని తరువాత, ఒక పీఠంపై పసుపు వస్త్రాన్ని పరచి, తల్లి గాయత్రి దేవి ఫోటో లేదా విగ్రహాన్ని ఉంచండి. ఆ తర్వాత అమ్మవారి విగ్రహాన్ని గంగాజలంతో శుద్ధి చేసేందుకు పూలు, ధూప, దీపాలు తదితరాలను సమర్పించాలి.

Gayatri Jayanti 2023: ఈ ఏడాది గాయత్రీ జయంతిని ఎప్పుడు జరుపుకోవాలి.. గాయత్రీ మంత్రం ప్రాముఖ్యత ఏమిటో తెలుసా
Gayatri Jayanti 2023
Follow us
Surya Kala

|

Updated on: Aug 26, 2023 | 7:57 AM

మానవ జీవితంలోని అన్ని రకాల కోరికలను నెరవేర్చడానికి, బాధలను తొలగించడానికి హిందూ మతంలో వేదమాత గాయత్రీ ఆరాధన ఉత్తమంగా పరిగణించబడుతుంది. హిందూ విశ్వాసం ప్రకారం అన్ని వేదాలకు తల్లిగా పరిగణించబడే గాయత్రీ దేవి జన్మదినాన్ని ప్రతి సంవత్సరం శ్రావణ మాసం పౌర్ణమి రోజున  జరుపుకుంటారు. గాయత్రీ దేవి ఈ రోజున జన్మించిందని నమ్ముతారు. హంసను వాహనంగా కలిగి ఉన్న గాయత్రిదేవి ఒక చేతిలో నాలుగు వేదాలు, మరో చేతిలో కమండలం ఉంటుంది. వేదమాత గాయత్రి జననానికి సంబంధించిన పవిత్ర పండుగ గాయత్రీ జయంతి పూజా విధానం.. మతపరమైన ప్రాముఖ్యతను వివరంగా తెలుసుకుందాం.

గాయత్రి జయంతి ఎప్పుడు

పంచాంగం ప్రకారం శ్రావణ పూర్ణిమ రోజున గాయత్రీ జయంతిని జరుపుకుంటారు. ఈ సంవత్సరం 31 ఆగస్టు 2023, గురువారం గాయత్రీ జయంతిని జరుపుకుంటారు. పంచాంగం ప్రకారం ఈ ఏడాది శ్రావణ మాసం పౌర్ణమి తిధి ఆగస్టు 30, 2023 ఉదయం 10:58 నుండి ప్రారంభమై.. ఆగస్టు 31, 2023 ఉదయం 07:05 వరకు ఉంటుంది.

దుఃఖాలను దూరం చేసే గాయత్రీ దేవి ..

సనాతన హిందూ సంప్రదాయంలో గాయత్రి దేవిని త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు అది దేవతగా పూజిస్తారు. గాయత్రీ దేవి సరస్వతీ దేవి, లక్ష్మీ దేవి, పార్వతి దేవిల అవతారమని .. కనుక గాయత్రీ దేవిని పూజిస్తే.. అన్ని రకాల ఆనందాలు, అదృష్టాలు లభిస్తాయని నమ్ముతారు. గాయత్రీ దేవి ఆరాధనలో జపించే మంత్రం జీవితానికి సంబంధించిన సమస్యలను తొలగిస్తుంది. ఆశించిన ఫలితాలను ఇస్తుందని విశ్వాసం.

ఇవి కూడా చదవండి

గాయత్రీ జయంతి పూజా విధానం

గాయత్రీ జయంతి రోజున గాయత్రిదేవిని ఆరాధించడానికి సూర్యోదయానికి ముందు ఉదయాన్నే లేచి, స్నానం, ధ్యానం చేసిన తర్వాత.. ముందుగా ఉదయించే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి. దీని తరువాత, ఒక పీఠంపై పసుపు వస్త్రాన్ని పరచి, తల్లి గాయత్రి దేవి ఫోటో లేదా విగ్రహాన్ని ఉంచండి. ఆ తర్వాత అమ్మవారి విగ్రహాన్ని గంగాజలంతో శుద్ధి చేసేందుకు పూలు, ధూప, దీపాలు తదితరాలను సమర్పించాలి. గాయత్రీ జయంతి నాడు వేదమాత అనుగ్రహం పొందడానికి గాయత్రీ మంత్రాన్ని 108 లేదా 1008 సార్లు జపించండి. గాయత్రీ మాతను ఆరాధించిన తరువాత, చివరిలో హారతి ఇచ్చి అందరికీ ప్రసాదం పంచిపెట్టి, అనంతరం మీరు తీసుకోండి..

గాయత్రీ మంత్రాన్ని జపించే పద్దతి..

హిందూమతంలో గాయత్రీ మంత్రం అన్ని రకాల కోరికలను నెరవేర్చడానికి ఉత్తమంగా పరిగణించబడుతుంది. ఎవరైనా నిర్మలమైన మనస్సుతో నిర్ణీత సమయంలో 108 సార్లు ఈ మంత్రాన్ని జపిస్తే సుఖ సంతోషాలు, అదృష్టాలు, ఆరోగ్యం లభిస్తాయని నమ్ముతారు. ఈ మంత్రం ప్రతిరోజూ మూడు నెలల పాటు నిరంతరం జపించే భక్తుడు లక్ష్మీ దేవి విశేష ఆశీర్వాదాన్ని పొందుతాడని .. ధన ధాన్యాలకు కొరత  ఎదుర్కోదని కూడా నమ్ముతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!