AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: భార్యాభర్తల మధ్య సఖ్యత, కుటుంబంలో బలమైన బంధాల కోసం ఈ వాస్తు టిప్స్ పాటించించి చూడండి..

. కొన్నిసార్లు కుటుంబ జీవితంలో ఎదురయ్యే అవాంతరాలకు ఇంట్లో వాస్తు దోషం కారణమని వాస్తు నిపుణులు చెబుతూ ఉంటారు. అంతేకాదు కుటుంబంలో బలమైన బంధాన్ని కొనసాగించడానికి కొన్ని చిట్కాలను సూచించారు. బలమైన కుటుంబ సంబంధాల కోసం ఈ  వాస్తు చిట్కాలను పాటించి చూడండి. వాస్తు ప్రకారం భార్యాభర్తలు ఆగ్నేయ దిశకు ఎదురుగా ఉన్న గదిలో నివసించకూడదు. ఇది భార్యాభర్తల మధ్య సంబంధానికి హాని కలిగించవచ్చు. 

Vastu Tips: భార్యాభర్తల మధ్య సఖ్యత, కుటుంబంలో బలమైన బంధాల కోసం ఈ వాస్తు టిప్స్ పాటించించి చూడండి..
ఉత్తర దిశ: వాస్తు ప్రకారం ఉత్తర దిశ కుబేరునికి అంకితం చేసిన దిశ. ఈ కారణంగా దీన్ని డబ్బు, శ్రేయస్సుకు మూలంగా భావిస్తారు. ఇక ఈ దిశలో సింక్, బాత్రూమ్ వంటివి నిర్మించడం నిషిద్ధం.
Surya Kala
|

Updated on: Aug 24, 2023 | 10:55 AM

Share

కుటుంబంలోని సభ్యుల మధ్య రకరకాల సంబంధాలుంటాయి. భార్యాభర్తలు, తోబుట్టువులు సహా ఇతర కుటుంబ సభ్యుల మధ్య బంధాలుంటాయి. అయితే భార్యాభర్తల బంధంతో సహా ప్రతి బంధంలో హెచ్చు తగ్గులుంటాయి. వాస్తవానికి కుటుంబంలో భిన్నాభిప్రాయాలు సహజమే అయినప్పటికీ.. అభిప్రాయ భేదాలు సర్వసాధారణంగా చోటు చేసుకుంటాయి. కొన్నిసార్లు కుటుంబ జీవితంలో ఎదురయ్యే అవాంతరాలకు ఇంట్లో వాస్తు దోషం కారణమని వాస్తు నిపుణులు చెబుతూ ఉంటారు. అంతేకాదు కుటుంబంలో బలమైన బంధాన్ని కొనసాగించడానికి కొన్ని చిట్కాలను సూచించారు. బలమైన కుటుంబ సంబంధాల కోసం ఈ  వాస్తు చిట్కాలను పాటించి చూడండి..

  1. వాస్తు ప్రకారం భార్యాభర్తలు ఆగ్నేయ దిశకు ఎదురుగా ఉన్న గదిలో నివసించకూడదు. ఇది భార్యాభర్తల మధ్య సంబంధానికి హాని కలిగించవచ్చు.
  2.  బెడ్‌రూమ్‌లో ఎప్పుడూ లేత రంగులు వాడటం మంచిది. మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తాయి.
  3.  మీ ఇంటి లోపల చిందరవందరగా ఉండకూడదు. అస్తవ్యస్తగాం లేదా చిందరవందరగా ఉన్న ఇల్లు  ప్రతికూల శక్తిని ఆహ్వానిస్తుంది. అంతేకాదు ఇంట్లోని వ్యక్తుల మధ్య అసమ్మతి కలగడమే కాదు వివాదాలు ఏర్పడతాయి.
  4. దంపతులు తాము బెడ్ రూమ్ లో నిద్రిస్తున్న సమయంలో ఆ గది తలపులు మూసి ఉంచాలి.
  5. ఇవి కూడా చదవండి
  6. వాస్తు ప్రకారం భార్యాభర్తల మధ్య ప్రేమ,మృదువైన సంబంధం నెలకొనాలంటే.. మంచానికి భర్త కుడి వైపున పడుకుంటే, భార్య మంచం ఎడమ వైపున పడుకోవడం అనువైనది.
  7. ఫ్యామిలీ ఫోటోను గది నైరుతి దిశలో ఉంచాలి.
  8. కుటుంబ సభ్యులు పొరపాటున కూడా మంచం మీద కూర్చుని భోజనం చేయకూడదని సిఫార్సు చేయబడింది. ఇది మంచి అలవాటు కాదు.  డైనింగ్ టేబుల్‌పై భోజనం చేయడం కుటుంబ సభ్యులందరినీ ఒకరికొకరు దగ్గర చేస్తుంది.
  9. ఇంటి గోడలలో ఏవైనా పగుళ్లు ఉంటే, మీరు వాటిని వీలైనంత త్వరగా సరిచేయాలి. గోడల పగుళ్లు తోబుట్టువుల మధ్య కమ్యూనికేషన్ దెబ్బతిని సమస్యలకు దారితీయవచ్చు.
  10. ఇంట్లో ఎక్కువ మొక్కలు ఉండటం వల్ల చాలా సానుకూల శక్తి లభిస్తుంది. ఇది సంబంధాలు, కుటుంబ బంధాలు వృద్ధి చెందడానికి చాలా మంచిది. ఇంటి ఉత్తర ప్రాంతంలో పచ్చని చెట్లను, మొక్కలను నాటడం శ్రేయస్కరం. మొక్కలు కుటుంబంలో విశ్వాసం, ప్రేమను పెంపొందించడానికి సహాయపడుతుంది.
  11. బెడ్ రూమ్ లో అద్దం ఉంటే, పడుకునేటప్పుడు అందులో భర్త లేదా భార్య కనిపించని విధంగా ఉంచాలి. మీరు నిద్రిస్తున్నప్పుడు ఎదురుగా ఉన్న అద్దం భార్యాభర్తల మధ్య తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అద్దం ఉన్న ప్రదేశంలో మార్పు సాధ్యం కాకపోతే, మీరు నిద్రిస్తున్నప్పుడు ఆ అద్దాన్ని క్లాత్ తో కప్పాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)