Chilli Powder Bath: గ్రామదేవత కరుణ కోసం 108 కేజీల కారం నీటితో స్నానం..మద్యం, సిగరెట్ల నైవేద్యం.. దుష్టశక్తులు తొలగిపోతాయని నమ్మకం..

ఏటా ఆది అమావాస్య రోజున గ్రామ దైవం పెరియ కరుప్పసామికి కారం, పాలతో అభిషేకం చేస్తారు. ఈ క్రమంలో భక్తులు.. పూజారికి కారం నీళ్లతో స్నానం చేయిస్తారు. అలా చేస్తే దుష్టశక్తులు తొలగిపోయి అందరికీ మేలు జరుగుతుందని నమ్మకం. ముందుగా పూజారి గోవిందం రెండు కొడవళ్లపై నిలబడి భక్తుల సమస్యలను విన్నాడు. ఆ తర్వాత కారం అభిషేకంలో పాల్గొన్నాడు.

Chilli Powder Bath: గ్రామదేవత కరుణ కోసం 108 కేజీల కారం నీటితో స్నానం..మద్యం, సిగరెట్ల నైవేద్యం.. దుష్టశక్తులు తొలగిపోతాయని నమ్మకం..
Chilli Powder Bath
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Aug 24, 2023 | 11:38 AM

కాలంతో పోటీపడుతూ మనిషి పయనిస్తున్నాడు. సముద్రం లోతులను కొలుస్తున్నాడు.. అంబరాన్ని చుంబిస్తున్నాడు.. తాజాగా చంద్రుడిపై మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. అయినప్పటికీ దేశంలో అనేక వింత ఆచారాలున్నాయి. అవి వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. దేవుళ్లకి అభిషేకాలు.. అభిమాన నేతలకు పాలాభిషేకాలు.. హీరోలకు రక్తాభిషేకాలు ఇంతవరకు మనం చూసి ఉంటాం. అయితే వీటన్నిటికీ భిన్నంగా కారంతో స్నానం చేస్తూ దేవుడిని పూజించే ఆచారం ఇంకా కొనసాగుతుంది. ప్రస్తుతం చిల్లీ బాత్‌ ఒకటి తెరపైకి వచ్చింది. కారంతో నోరు మాత్రమే కాదు.. శరీరం కూడా మంటపుడుతుంది. అలాంటిది.. కారం నీళ్లతో స్నానం చేయడమంటే మాటలా? ఇవేవీ లెక్కచేయకుండా తమిళనాడుకు చెందిన ఓ పూజారి ఈ సాహసాన్ని చేసి అందర్నీ అశ్చర్యంలో ముంచెత్తాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ధర్మపురి జిల్లాలోని నడపనహళ్లీ గ్రామానికి చెందిన గోవిందం అనే పూజారి కారం నీళ్లతో స్నానం చేయడం హాట్‌ టాపిక్‌గా మారింది. ఏటా ఆది అమావాస్య రోజున గ్రామ దైవం పెరియ కరుప్పసామికి కారం, పాలతో అభిషేకం చేస్తారు. ఈ క్రమంలో భక్తులు.. పూజారికి కారం నీళ్లతో స్నానం చేయిస్తారు. అలా చేస్తే దుష్టశక్తులు తొలగిపోయి అందరికీ మేలు జరుగుతుందని నమ్మకం. ముందుగా పూజారి గోవిందం రెండు కొడవళ్లపై నిలబడి భక్తుల సమస్యలను విన్నాడు. ఆ తర్వాత కారం అభిషేకంలో పాల్గొన్నాడు. ఆ కారం ఘాటుకి భక్తులు అక్కడ నిలుచోడానికి ఇబ్బంది పడ్డారు.

ఇవి కూడా చదవండి

పూజారి మాత్రం కదలకుండా కారం స్నానమాచరించాడు. 108 కేజీల కారం నీళ్లను పూజారిపై కుమ్మరించారు. ఆ నీళ్లు కళ్లలోకి వెళ్తున్నా సరే.. ఆ మంటను భరిస్తూ విజయవంతంగా సాంప్రదాయాన్ని పూర్తిచేశాడు పూజారి. కారం నీళ్లను చల్లిన తర్వాత భక్తులు మళ్లీ ఆయనపై నీళ్లు పోశారు. కారం ఘాటు పోయేంత వరకు స్నానం చేయించారు. ఈ సంప్రదాయం ఎన్నో ఏళ్ల నుంచి వస్తుందట. విచిత్రమేమిటంటే చిల్లీ బాత్‌ సమయంలో పూజారికి ఎలాంటి మంట పుట్టదట. ఈ ఆలయంలో మరో విశేషం ఏమిటంటే.. పెరియ కురుప్పస్వామికి భక్తులు మద్యం, సిగరెట్లను సైతం కానుకగా సమర్పిస్తారు. ఇదొక్కటే కాదూ.. తమిళనాడులో వేర్వేరు చోట్ల వింత ఆచారాలు అందర్నీ ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పడి లేచిన బంగారం ధర.. మరింత పెరుగుతుందా..?
పడి లేచిన బంగారం ధర.. మరింత పెరుగుతుందా..?
అమరులైన సైనికుల కుటుంబాలకు అండగా నిలిచిన నాగ బాబు .. వీడియో
అమరులైన సైనికుల కుటుంబాలకు అండగా నిలిచిన నాగ బాబు .. వీడియో
దేశంలో 8 కొత్త జాతీయ రహదారులు.. 6 లైన్‌ల రోడ్డు.. కేంద్రం ఆమోదం
దేశంలో 8 కొత్త జాతీయ రహదారులు.. 6 లైన్‌ల రోడ్డు.. కేంద్రం ఆమోదం
వన్డే కెరీర్‌లో బ్యాడ్ లక్ ప్లేయర్లు వీరే.. లిస్టులో మనోడే టాప్..
వన్డే కెరీర్‌లో బ్యాడ్ లక్ ప్లేయర్లు వీరే.. లిస్టులో మనోడే టాప్..
ఆ జాగ్రత్తలతో బోలెడంత డబ్బు మీ వెంటే..ఆర్థిక నిపుణుల సూచనలేంటంటే?
ఆ జాగ్రత్తలతో బోలెడంత డబ్బు మీ వెంటే..ఆర్థిక నిపుణుల సూచనలేంటంటే?
సెల్‌ఫోన్ చీకటి సామ్రాజ్యంలో విచ్చలవిడి దోపిడీ..!
సెల్‌ఫోన్ చీకటి సామ్రాజ్యంలో విచ్చలవిడి దోపిడీ..!
దీర్ఘాయువు, ఆరోగ్యకర జీవితానికి సీక్రెట్స్ ఇవే..!
దీర్ఘాయువు, ఆరోగ్యకర జీవితానికి సీక్రెట్స్ ఇవే..!
'సింగిల్ హ్యాండ్'తో నవీన్ పొలిశెట్టి కష్టాలు.. వీడియో చూశారా?
'సింగిల్ హ్యాండ్'తో నవీన్ పొలిశెట్టి కష్టాలు.. వీడియో చూశారా?
భార్యలో ఈ లక్షణాలు ఉంటే భర్త ధనవంతుడు అవుతాడట.. ఇల్లు స్వర్గమే..
భార్యలో ఈ లక్షణాలు ఉంటే భర్త ధనవంతుడు అవుతాడట.. ఇల్లు స్వర్గమే..
హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌కి 2 కోట్ల జరిమానా.. కారణం ఏంటో తెలుసా?
హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌కి 2 కోట్ల జరిమానా.. కారణం ఏంటో తెలుసా?