Rakhi Festival: ఫ్యాషన్ పేరుతో రాఖీని కొంటున్నారా.. రాఖీని కొనేటప్పుడు ఈ నియమాలు గుర్తించుకోండి.. సోదరుడికి శుభ ఫలితాలనిస్తాయి..

రక్ష కట్టడం ఒక వేడుక మాత్రమే కాదు.. సోదరి తన సోదరుడిపై చూపించే ప్రేమ, నమ్మకానికి చిహ్నం. సోదరుడు తనను జీవితాంతం రక్షిస్తాడని.. ఎటువంటి పరిస్థితి ఎదురైనా అండగా ఉంటాడని నమ్మకం. రాఖీలు సోదరుడి జీవితంపై కూడా గొప్ప ప్రభావాన్ని చూపుతాయి. సోదరుడి మణికట్టుకు పట్టు దారంతో కట్టే రాఖీలు కూడా చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. ఫ్యాషన్ పేరుతో అన్ని రకాల రాఖీలను సోదరుడి మణికట్టుకు కట్టడం శ్రేయస్కరం కాదని గుర్తుంచుకోవాలి.

Rakhi Festival: ఫ్యాషన్ పేరుతో రాఖీని కొంటున్నారా.. రాఖీని కొనేటప్పుడు ఈ నియమాలు గుర్తించుకోండి.. సోదరుడికి శుభ ఫలితాలనిస్తాయి..
Rakhi Festival
Follow us
Surya Kala

|

Updated on: Aug 24, 2023 | 7:59 AM

హిందువులు జరుపుకునే పండగల్లో రాఖీ పండగ ఒకటి. ప్రతి ఏడాది శ్రావణ మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ ఏడాది శ్రావణ పౌర్ణమి రోజున అంటే ఆగస్టు 30న రక్షాబంధన్ పండుగను అత్యంత వైభవంగా జరుపుకోనున్నారు. దీంతో ఇప్పటికే మార్కెట్‌ల్లో రకరకాల రాఖీలు కొలువుదీరాయి. మార్కెట్‌లో అన్ని రకాల రాఖీలు అందుబాటులో ఉన్నాయి. రాఖీల విషయంలో పెద్దల నుంచి పిల్లల వరకు భిన్నమైన ఆలోచనలతో ఎంపిక చేసుకుంటారు.. నేటి ఆధునిక కాలాన్ని దృష్టిలో ఉంచుకుని.. రాఖీలను ఎంపిక చేసుకునే విషయంలో పిల్లలు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. కార్టూన్ల నుండి అనేక రకాల ఫ్యాషన్ రాఖీలను ఎంపిక చేసుకుంటున్నారు. అయితే రాఖీ కొనే సమయంలో సోదరీమణులు కొన్ని రకాల నిబంధనలను గుర్తు పెట్టుకోవాలి. అయితే ఫ్యాషన్ పేరుతో అన్ని రకాల రాఖీలను సోదరుడి మణికట్టుకు కట్టడం శ్రేయస్కరం కాదని గుర్తుంచుకోవాలి. రాఖీ కొనే విషయంలో కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి. సోదరుడి కోసం రాఖీలను ఎన్నుకునేటప్పుడు ఏ దారంతో తయారు చేసిన రాఖీలను కొనుగోలు చేయాలి..  దాని ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాన్ని తెలుసుకొని ఎంపిక చేసుకోవాలి.

ఎర్ర రంగు దారంతో చేసిన రాఖీ సోదరుడికి శుభప్రదం.

రాఖీ సోదరుడి జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. ఎర్ర రంగు దారంతో చేసిన రాఖీని సోదరుడి మణికట్టుకు కట్టడం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రాఖీ సోదరుడి జీవితంలో సానుకూలతను తెస్తుంది. అలాగే పువ్వులు, ముత్యాలతో చేసిన రాఖీలు కూడా సానుకూలతకు చిహ్నం. అందుకే రాఖీని ఎన్నుకునేటప్పుడు ఎక్కువగా థ్రెడ్‌పై శ్రద్ధ పెట్టాలి.

పట్టు దారంతో తయారు చేసిన రాఖీ

రక్ష కట్టడం ఒక వేడుక మాత్రమే కాదు.. సోదరి తన సోదరుడిపై చూపించే ప్రేమ, నమ్మకానికి చిహ్నం. సోదరుడు తనను జీవితాంతం రక్షిస్తాడని.. ఎటువంటి పరిస్థితి ఎదురైనా అండగా ఉంటాడని నమ్మకం. రాఖీలు సోదరుడి జీవితంపై కూడా గొప్ప ప్రభావాన్ని చూపుతాయి. సోదరుడి మణికట్టుకు పట్టు దారంతో కట్టే రాఖీలు కూడా చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. రక్షా బంధన్ రోజున సోదరునికి పట్టు దారంతో చేసిన రాఖీని ఎంచుకోవడం బెస్ట్.

ఇవి కూడా చదవండి

ఎటువంటి రాఖీలు అశుభం అంటే..

రక్షాబంధన్ రోజున సోదరుడి మణికట్టుకు కట్టడానికి ఎంచుకునే రాఖీల్లో నీలం లేదా నలుపు దారంతో ఉండకూడదు. నలుపు రంగు అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. నలుపు రంగు ప్రతికూలతకు చిహ్నం.. అందుకే నీలం రంగు కూడా కొన్ని సందర్భాల్లో అశుభంగా పరిగణిస్తారు. అందుకే సోదరీమణులు ఎప్పుడూ సోదరుడి కోసం నలుపు రంగు, నీలం రంగు రాఖీని ఎంచుకోకూడదు. రాఖీని ఎప్పుడూ ఎరుపు లేదా పసుపు దారంతో ఉన్నవి ఎంచుకోవాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!