Thursday Puja Tips: జాతకంలో గురు బలం పెరగాలంటే గురువారం రోజున ఈ నివారణ చర్యలు చేసి చూడండి.. శుభఫలితం మీ సొంతం..

హిందూ విశ్వాసం ప్రకారం విష్ణువు, గురువు అనుగ్రహం పొందడానికి గురువారం పూజ, పారాయణం, విష్ణువు అనుగ్రహం కోసం మంత్రాలను పఠించడం.. ఉపవాసంతో పాటు ఈ రోజు చేసే దానాలతో పాటు కొన్ని ప్రత్యేక నియమాలను అనుసరించడం అవసరమని పేర్కొన్నారు. గురువారం రోజున చేయాల్సిన పూజ, నియమాలు, చర్యల గురించి తెలుసుకుందాం..

Thursday Puja Tips: జాతకంలో గురు బలం పెరగాలంటే గురువారం రోజున ఈ నివారణ చర్యలు చేసి చూడండి.. శుభఫలితం మీ సొంతం..
Thursday Puja Tips
Follow us
Surya Kala

|

Updated on: Aug 24, 2023 | 8:29 AM

హిందూ మతంలో గురువారం శ్రీ మహా విష్ణువు,  దేవగురు బృహస్పతి ఆరాధనకు చాలా పవిత్రమైనది..  ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. గురువారం రోజున ఈ దేవతలకు చేసే పూజలు అత్యంత ఫలవంతం అని నమ్మకం. వ్యక్తి ఆనందాన్ని, అదృష్టాన్ని పెంచడంతో పాటు జీవితంలోని అన్ని కోరికలు నెరవేరతాయని విశ్వాసం. హిందూ విశ్వాసం ప్రకారం విష్ణువు, గురువు అనుగ్రహం పొందడానికి గురువారం పూజ, పారాయణం, విష్ణువు అనుగ్రహం కోసం మంత్రాలను పఠించడం.. ఉపవాసంతో పాటు ఈ రోజు చేసే దానాలతో పాటు కొన్ని ప్రత్యేక నియమాలను అనుసరించడం అవసరమని పేర్కొన్నారు. గురువారం రోజున చేయాల్సిన పూజ, నియమాలు, చర్యల గురించి తెలుసుకుందాం.. ఇలా చేసిన వ్యక్తులు పట్టిందల్లా బంగారం అని.. అదృష్టం వీరి సొంతం అని నమ్మకం.

అదృష్టాన్ని పెంచే పరిహారం..

హిందూ విశ్వాసం ప్రకారం మీరు బృహస్పతి అనుగ్రహాన్ని పొందాలంటే.. ముందుగా గురువారం సూర్యోదయానికి ముందే మేల్కొనాలి. గురువారం సూర్యోదయానికి ముందు లేచి, స్నానం చేసి ధ్యానం చేసిన తర్వాత సూర్యనారాయణుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఇలా చేయడం వలన అదృష్టం కలిసి వస్తుందని చేపట్టిన పనులు సక్సెస్ అవుతాయని విశ్వాసం.

విష్ణువును ఎలా పూజించాలంటే..

శ్రీ మహా విష్ణువు ఆరాధనకు గురువారం అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితిలో శ్రీ హరి అనుగ్రహం పొందడానికి మీరు గురువారం రోజున శ్రీ మహా విష్ణువుకు పసుపు పుష్పాలు, పసుపు, గంధం, పసుపు పండ్లు, పసుపు వస్త్రాలు మొదలైన వాటిని సమర్పించి, ‘ఓం నమో భగవతే వాసుదేవాయ నమః’ అని జపించాలి. శరీరం, మనస్సు పవిత్రంగా ఉండాలి. తులసి మాలతో ‘ఓం నమో భగవతే వాసుదేవాయ నమః’ మంత్రం విశ్వాసంతో జపించడం అత్యంత ఫలవంతం.

ఇవి కూడా చదవండి

గొప్ప పరిహారం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరి జాతకంలోనైనా బృహస్పతి బలహీనంగా ఉన్నవారు ఐశ్వర్యాన్ని పొందడానికి, జాతక బలం కోసం గురువారం స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు వేసి స్నానం చేయాలి. ఈ జ్యోతిష్య పరిహారాన్ని చేయడం ద్వారా.. వ్యక్తికి శుభ ఫలితాలు లభిస్తాయని.. అతని జీవితం ఆనందం, అదృష్టంతో నిండి ఉంటుందని నమ్మకం.

కోరిన కోరికలు నెరవేరడానికి చేయాల్సిన పూజ

హిందూ విశ్వాసం ప్రకారం శ్రీ మహా విష్ణువు, దేవగురు బృహస్పతి అరటి చెట్టుపై నివసిస్తారని నమ్మకం. గురువారం రోజున అరటి చెట్టును పూజించడం చాలా పవిత్రమైనది.. ఫలవంతమైనదిగా పరిగణించబడటానికి కారణం ఇదే. శ్రీ హరి అనుగ్రహం పొందడానికి, గురువారం ఉపవాసం ఉండాలి. ఈ రోజున సత్య నారాయణుని కథ చదవడంతో పాటు.. సత్యనారాయణ స్వామిని ఆరాదించడం.. శ్రీ మహా  విష్ణువు అనుగ్రహం కోసం మంత్రాన్ని జపించాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!