- Telugu News Photo Gallery Cricket photos Cricket related question appears on Amitabh Bachchan's KBC for Rs 25 lakh, do you know its answer?
Kaun Banega Crorepati: రూ.25 లక్షల ప్రశ్న.. తండ్రీకొడుకులను ఔట్ చేసిన ఏకైక క్రికెటర్ ఎవరో మీకు తెలుసా..?
Kaun Banega Crorepati: ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ ప్రోగ్రామ్ 15వ సీజన్ ఇటీవలే ప్రారంభమైంది. ఇక ఈ రియాలిటీ షో ద్వారా అమితాబ్ ఎంతో మందిని ప్రశ్నలు ఆడిగి, వారిలో కొందరిని కోటీశ్వరుడిని చేశారు. ఈ క్రమంలో అమితాబ్ క్రికెట్ ప్రశ్నలను కూడా అడిగేవారు. ఇదే తరహాలో తాజాగా అమితాబ్ ఆడిగిన ఓ ప్రశ్న నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ ప్రశ్నకు సమధానం మీకు తెలుసేమో ఓ లుక్ వేయండి..
Updated on: Aug 26, 2023 | 7:31 AM

Kaun Banega Crorepati: కౌన్ బనేగా కరోడ్‌పతి షో ద్వారా అమితాబ్ క్రికెట్ ఆటకు సంబంధించిన ఎన్నో ప్రశ్నలు అడిగారు. ఈ క్రమంలోనే తాజాగా గురువారం కూడా అమితాబ్ బచ్చన్ ఓ కంటెస్టెంట్‌ని క్రికెట్‌కి సంబంధించిన ఓ ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్న ఏమిటంటే..?

‘అంతర్జాతీయ క్రికెట్‌లో తండ్రీకొడుకుల వికెట్లు తీసిన ఏకైక భారత క్రికెటర్ ఎవరు..?’ ఇదే అమితాబ్ తన కంటెస్టెంట్‌ని అడిగిన ప్రశ్న. ఇక ఈ ప్రశ్నకు సమాధానం విలువ ఏకంగా రూ.25 లక్షలు.

అమితాబ్ అడిగిన ఈ ప్రశ్నకు అన్సర్ తెలియని చాలా మంది క్రికెట్ అభిమానులు, నెటిజన్లు సమాధానం కోసం గూగుల్‌ని ఆశ్రయిస్తున్నారు. ఇంతకీ ఆ ప్రశ్నకి సమాధానం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

2011లో వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు శివనారాయణ చంద్రపాల్ వికెట్‌ను టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పడగొట్టాడు. అలాగే అది జరిగిన 12 సంవత్సరాల తర్వాత అంటే ఇటీవలే జరిగిన వెస్టిండీస్ టెస్ట్ సిరీస్‌లో చంద్రపాల్ కొడుగు తేజ్‌నారాయణ్ స్వయంగా అశ్విన్‌కి వికెట్ ఇచ్చుకుని పెవిలియన్ చేరాడు.

తద్వారా తండ్రీకొడుకులను ఔట్ చేసిన ఏకైక భారతీయుడిగా, అలాగే ప్రపంచ క్రికెట్‌లో 5వ క్రికెటర్‌గా అశ్విన్ అవతరించాడు. అశ్విన్ కంటే ముందు ఈ ఫీట్‌ను వసీమ్ అక్రమ్, మిచెల్ స్టార్క్, సీమ్ హార్మర్, ఇయాన్ బోథమ్ సాధించారు.





























