- Telugu News Photo Gallery Cricket photos Men's ODI Team Rankings Pakistan and Australia teams Same rating 118 In ICC ODI Ranking
ICC ODI Ranking: ఉత్కంఠ విజయంతో ఆసీస్‌కు షాకిచ్చిన పాకిస్థాన్.. టీమిండియా ప్లేస్ ఎక్కడుందంటే?
ICC ODI Ranking: పాకిస్థాన్ ప్రస్తుతం 118 రేటింగ్ పాయింట్లతో ICC ODI ర్యాంకింగ్‌లో 2వ స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా కూడా ఇదే సంఖ్యలో రేటింగ్ పాయింట్లను కలిగి ఉంది. అయితే పాయింట్ల పరంగా మాత్రం ముందుంది. ఇప్పుడు అఫ్గానిస్థాన్‌తో జరిగే ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ గెలిస్తే ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి నెం.1 స్థానానికి చేరుకుంటుంది.
Updated on: Aug 26, 2023 | 9:27 AM

ICC ODI Ranking: ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకున్న పాకిస్థాన్ పురుషుల క్రికెట్ జట్టు ICC వన్డే టీమ్ ర్యాంకింగ్స్‌లో No.1 స్థానానికి మరో అడుగు దూరంలో నిలిచింది.

ఐసీసీ కొత్త వన్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ ప్రస్తుతం 118 రేటింగ్ పాయింట్లతో 2వ స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా కూడా ఇదే సంఖ్యలో రేటింగ్ పాయింట్లను కలిగి ఉంది. అయితే పాయింట్ల పరంగా మాత్రం ముందుంది.

ఇప్పుడు అఫ్గానిస్థాన్‌తో జరిగే ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ గెలిస్తే ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి నెం.1 స్థానానికి చేరుకుంటుంది.

అయితే వన్డే ప్రపంచకప్‌నకు సన్నద్ధం కావడానికి సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియా మొత్తం ఎనిమిది వన్డేలు ఆడనుండడంతో త్వరలో మళ్లీ అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉంది. ఈ ఎనిమిది మ్యాచ్‌లలో ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికాకు వెళుతుంది. ఆ తర్వాత భారత్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది.

మూడో స్థానంలో ఉన్న టీమ్ ఇండియా.. రేటింగ్స్ పరంగా పాకిస్థాన్, ఆస్ట్రేలియా కంటే ఐదు పాయింట్లు వెనుకబడి ఉంది.

న్యూజిలాండ్ 104 రేటింగ్స్‌తో నాలుగో స్థానంలో నిలిచింది.

ప్రస్తుతం ప్రపంచ ఛాంపియన్ ఇంగ్లండ్ 101 రేటింగ్స్‌తో ఐదో స్థానంలో ఉంది.

దక్షిణాఫ్రికా ఆరో స్థానంలో ఉంది. భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో వెస్టిండీస్ 1-2 తేడాతో ఓడి 7వ స్థానంలో నిలిచింది.

ఆ తర్వాత బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్ జట్లు వరుసగా 8, 9, 10 స్థానాల్లో నిలిచాయి.





























