Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirupati: టీటీడీ పాలకమండలి ప్రకటన.. తెలంగాణ నుంచి అమెకు అవకాశం.. లిస్టులో ఇంకా ఎవరెవరు ఉన్నారంటే..?

Tirupati: టీటీడీ పాలకమండలి సభ్యులుగా ఎమ్మెల్యే కోటాలో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన సామినేని ఉదయభాను, పొన్నాడ సతీష్‌ కుమార్‌, తిప్పేస్వామికి అవకాశం అభించింది. అలాగే ఈ లిస్టులో కడప నుంచి మాసీమా బాబు, యానాదాయ్య, ప్రకాశం జిల్లా నుంచి మాజీ మంత్రి శిద్దా రాఘవరావు కుమారుడు శిద్ధా సుధీర్‌,గోదావరి జిల్లా నుంచి గడిరాజు వెంకట సుబ్బరాజు, నాగ సత్యం యాదవ్(ఏలూరు), కర్నూలు నుంచి సీతారామిరెడ్డి పేర్లు కూడా ఉన్నాయి. ఇంకా అశ్వత్థ నాయక్‌, నాగసత్యం యాదవ్‌ సహా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్..

Tirupati: టీటీడీ పాలకమండలి ప్రకటన.. తెలంగాణ నుంచి అమెకు అవకాశం.. లిస్టులో ఇంకా ఎవరెవరు ఉన్నారంటే..?
Tirumala Tirupati Devasthanam
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Aug 25, 2023 | 11:11 PM

తిరుపతి, ఆగస్టు 25: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుల పేర్లను ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. శుక్రవారం ప్రకటించిన ఈ లిస్టులో మొత్తం 24 మందికి బోర్డు మెంబర్లుగా అవకాశం దక్కిండి. ఈ క్రమంలో టీటీడీ పాలకమండలి సభ్యులుగా ఎమ్మెల్యే కోటాలో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన సామినేని ఉదయభాను (జగ్గయ్య పేట నియోజకవర్గం), పొన్నాడ సతీష్‌ కుమార్‌ (ముమ్మిడివరం), తిప్పేస్వామి (మడకశిర)కి అవకాశం అభించింది. అలాగే ఈ లిస్టులో కడప నుంచి మాసీమా బాబు, యానాదాయ్య, ప్రకాశం జిల్లా నుంచి మాజీ మంత్రి శిద్దా రాఘవరావు కుమారుడు శిద్ధా సుధీర్‌,గోదావరి జిల్లా నుంచి గడిరాజు వెంకట సుబ్బరాజు, నాగ సత్యం యాదవ్(ఏలూరు), కర్నూలు నుంచి సీతారామిరెడ్డి పేర్లు కూడా ఉన్నాయి. ఇంకా అశ్వత్థ నాయక్‌, నాగసత్యం యాదవ్‌ సహా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు చెందినవారికి కూడా టీటీడీ మెంబర్లుగా అవకాశం కల్పించింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు జగన్ ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులను జారీ చేసింది.

ఇదిలా ఉండగా.. టీటీడీ ఛైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే నియమించిన విషయం తెలిసిందే. తాజాగా 24 మందితో కూడిన టీటీడీ పాలకమండలి సభ్యుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. ఇంకా దీనిపై ప్రభుత్వం జీవోను విడుదల చేయడమే మిగిలి ఉంది.

ఇవి కూడా చదవండి

టీటీడీ పాలక మండలి సభ్యులు..

  1. పొన్నాడ సతీశ్‌ కుమార్‌ (ముమ్మిడివరం ఎమ్మెల్యే)
  2. ఉదయభాను సామినేని (జగ్గయ్య పేట ఎమ్మెల్యే)
  3. ఎమ్. తిప్పేస్వామి (మడకశిర ఎమ్మెల్యే)
  4. సిద్దవటం యండయ్య
  5. చిందె అశ్వర్థనాయక్‌
  6. మేకా శేషుబాబు
  7. ఆర్‌. వెంకటసుబ్బారెడ్డి
  8. ఎల్లారెడ్డిగారి సీతారామరెడ్డి
  9. గడిరాజు వెంకట సుబ్బరాజు
  10. పెనక శరత్‌చంద్రారెడ్డి
  11. రామ్‌రెడ్డి సాముల
  12. బాలసుబ్రమణియన్‌ పళనిస్వామి (తమిళనాడు)
  13. ఎస్‌.ఆర్‌. విశ్వనాథ్ రెడ్డి
  14. గడ్డం సీతారెడ్డి(తెలంగాణ)
  15. కృష్ణమూర్తి వైద్యనాథన్‌ (తమిళనాడు)
  16. సిద్దా వీర వెంకట సుధీర్‌ కుమార్‌
  17. సుదర్శన్‌ వేణు
  18. నెరుసు నాగ సత్యం
  19. ఆర్‌.వి.దేశ్‌పాండే (కర్ణాటక)
  20. అమోల్‌ కాలె ( మహారాష్ట్ర, ముంబై క్రికెట్‌ అసోసియేషన్ ప్రెసిడెంట్)
  21. డా.ఎస్‌.శంకర్‌ ( మహారాష్ట్ర)
  22. మిలింద్‌ కేశవ్‌ నర్వేకర్‌ (మహారాష్ట్ర, ముంబై క్రికెట్‌ అసోసియేషన్ మెంబర్)
  23. డా కేతన్‌ దేశాయ్‌ (గుజరాత్‌)
  24. బోరా సౌరభ్‌