Chandrayaan-3: ఈ రోజే చంద్రయాన్‌-3 సాఫ్ట్‌ ల్యాండింగ్‌.. జాబిల్లికి అత్యంత చేరువలో విక్రమ్‌ ల్యాండర్‌.. ఆ 15 నిమిషాలే టెర్రర్‌గా..!

Chandrayaan-3: ఆకాశంలో అద్భుత ఘట్టం. భారత్‌కి చందమామ ఇంకెంతో దూరంలో లేదు. చుక్కల్లో చంద్రుడిని ఒడిసి పట్టుకునే అత్యంత అరుదైన ఘటన ఈ రోజు చోటు చేసుకోబోతోంది. ‘చంద్రయాన్ 3’ మిషన్‌లో భాగంగా విక్రమ్ ల్యాండర్ ఆర్బిట్‌ నుంచి విడిపోయి.. జాబిల్లిపై దిగబోతోంది. గతంలో లాగా కాకుండా.. ఈ సారి కచ్చితంగా సక్సెస్‌ అవుతామని ఓవైపు ఇస్రో చెబుతోంటే.. మరోవైపు ఎలాంటి ఆటంకాలు కలుగకూడదని సర్వమత ప్రార్ధనలు దేశవ్యాప్తంగా సాగుతున్నాయి.

Chandrayaan-3: ఈ రోజే చంద్రయాన్‌-3 సాఫ్ట్‌ ల్యాండింగ్‌.. జాబిల్లికి అత్యంత చేరువలో విక్రమ్‌ ల్యాండర్‌.. ఆ 15 నిమిషాలే టెర్రర్‌గా..!
Chandrayaan 3
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Aug 23, 2023 | 5:38 AM

Chandrayaan 3: ఇప్పుడు అందరి దృష్టి చంద్రయాన్ 3 మీదే.. చంద్రయాన్‌ 3 ప్రయోగం అత్యంత కీలక దశకు చేరుకుంది. చంద్రుడిపై పరిశోధనల కోసం రోదసిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్‌ 3 లక్ష్యం దిశగా చివరి అంకానికి చేరుకుంది. జాబిల్లికి కూతవేటు దూరంలోనే ఉన్న చంద్రయాన్‌ విక్రమ్ ల్యాండర్‌.. మరికొద్ది గంటల్లో చంద్రుడిపై ల్యాండ్‌ కాబోతోంది. అపరూప ఘట్టాన్ని ఆవిష్కరించేందుకు ఇస్రో ఏర్పాట్లు చేసింది. దానిలో భాగంగా.. విక్రమ్‌ ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌తో కూడిన ల్యాండింగ్‌ మాడ్యూల్‌ చంద్రుడికి మరింత చేరువైంది. అయితే.. జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్‌ సాఫ్ట్‌ ల్యాండింగ్‌ అయ్యే క్రమంలో చివరి 15 నిమిషాలు అత్యంత కీలకం అంటున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. ప్రస్తుతం ల్యాండింగ్‌ మాడ్యూల్‌ను నిరంతరం తనిఖీ చేస్తూ.. నిర్దేశిత ల్యాండింగ్‌ ప్రదేశంలో దిగేందుకు సూర్యోదయం కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఇస్రో తెలిపింది. ఈ మేరకు సూర్యుడి వెలుగు రాగానే సాఫ్ట్‌ ల్యాండింగ్‌ ప్రక్రియను చేపట్టనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఈ క్రమంలోనే ఈ రోజు సుమారు 5:45 గంటల తర్వాత ల్యాండింగ్‌ ప్రక్రియ మొదలు కానున్నట్లు అంచనా వేస్తున్నారు.

ఇక.. అంతా అనుకున్నట్లు జరిగితే.. విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రునిపై ల్యాండ్‌ కానుంది. ఆ వెంటనే.. ల్యాండర్‌ కాళ్లకు అమర్చిన సెన్సార్లు.. జాబిల్లి ఉపరితలాన్ని నిర్ధారించుకున్న తర్వాత ఇంజిన్లు ఆఫ్ అవుతాయి. ఆపై 15 నిమిషాల టెన్షన్‌కు తెరపడి ప్రయోగం విజయవంతం అవుతుంది. కానీ.. ఈ ప్రక్రియ పూర్తిగా స్వతంత్రమైనది కావడంతో ఇస్రో శాస్త్రవేత్తల్లో కొంత సందిగ్దం నెలకొంది. సురక్షిత ల్యాండింగ్‌ కోసం సొంతంగా ఇంధనాన్ని మండించుకుని.. సరైన ప్రదేశాన్ని ల్యాండర్‌ స్కాన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా ల్యాండర్‌ స్వయంగా చేసుకోవాల్సి ప్రక్రియ అయినందున సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏదేమైనా.. ల్యాండర్‌ తప్పకుండా సేఫ్‌గా ల్యాండవుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ల్యాండర్ ఇమేజర్ కెమెరా నుంచి చంద్రుని వీడియో..

ఇదిలావుంటే.. జాబిల్లిపై ల్యాండర్‌ అడుగుపెట్టే చారిత్రక క్షణాల కోసం యావత్‌ ప్రపంచం వేయి కళ్లతో ఎదురు చూస్తోంది. చంద్రయాన్‌ 3 ప్రయోగం సక్సెస్‌ కావాలని దేశమంతా సర్వమత ప్రార్ధనలు కొనసాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో సాధువులు యాగం చేపట్టారు. చంద్రయాన్‌ 3 మిషన్‌ విజయవంతం కావాలని హోమం నిర్వహించారు. అటు.. వారణాసిలోనూ చంద్రయాన్‌ 3 సక్సెస్‌ కావాలని పలువురు ప్రత్యేక పూజలు చేశారు. ఈ యాగంలో సాధువులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విక్రమ్ ల్యాండర్‌ చంద్రుడిపై సేఫ్‌గా ల్యాండ్‌ కావాలని లక్నోలోని మసీదులో ముస్లింలు కూడా నమాజ్‌ చేశారు. మొత్తంగా.. చంద్రయాన్‌ 3 ప్రయోగం సక్సెస్‌ కావాలని.. అంతరిక్ష రంగంలో భారత్‌ చరిత్ర సృష్టించాలని అందరూ ఒక్కటై కోరుకుంటున్నారు.

మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈడో జాతిరత్నం.. ఆణిముత్యం.. డాక్టర్ అంటే ఇతనట.. చదివితే మీరూ
ఈడో జాతిరత్నం.. ఆణిముత్యం.. డాక్టర్ అంటే ఇతనట.. చదివితే మీరూ
ఖేల్ రత్న నామినేషన్లపై స్పందించిన మను భాకర్
ఖేల్ రత్న నామినేషన్లపై స్పందించిన మను భాకర్