EV Battery Rate: ఓలా, ఏథర్ ఈవీ బ్యాటరీలు అంత రేటా? ఎంతో తెలిస్తే షాకవుతారు
ఇప్పుడు ఆటోమొబైల్ రంగంలో ఈవీ వాహనాల ట్రెండ్ నడుస్తుంది. ముఖ్యంగా ఈ వాహనాల నిర్వహణ అనేది తక్కువ ఖర్చుతో అయ్యిపోతుండడంతో మధ్యతరగతి ప్రజలు వీటి వినియోగానికి ముందుకు వస్తున్నారు. అయితే ఈ వాహనాలు ప్రస్తుతం వాడుకోవడానికి బాగానే ఉన్నా ఏళ్లు గడిచే కొద్దీ వచ్చే కొన్ని సమస్యలు వినియోగదారుల జేబులకు చిల్లులు పెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈవీ వాహనాలు అనేవి బ్యాటరీ సాయంతో పని చేస్తాయి. ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో మన వాహన బ్యాటరీ పాడైనా లేకపోతే వారెంటీ క్లెయిమ్ కాకపోయినా కొత్త బ్యాటరీ కొనాల్సిన పరిస్థితి నెలకొంటుంది.
సాధారణంగా ఏ వస్తువైనా వాడే కొద్దీ దాని మన్నిక అనేది తగ్గుతూ వస్తుంది. ముఖ్యంగా ఆటోమొబైల్ రంగంలోని ఏ వస్తువైనా వాడే కొద్దీ చాలా త్వరగా పాడైపోతుంది. దాన్ని మనం వెంటనే మార్చి ఆ ప్లేస్‌లో కొత్త వస్తువు ఏర్పాటు చేసుకుంటాం. అయితే ఇప్పుడు ఆటోమొబైల్ రంగంలో ఈవీ వాహనాల ట్రెండ్ నడుస్తుంది. ముఖ్యంగా ఈ వాహనాల నిర్వహణ అనేది తక్కువ ఖర్చుతో అయ్యిపోతుండడంతో మధ్యతరగతి ప్రజలు వీటి వినియోగానికి ముందుకు వస్తున్నారు. అయితే ఈ వాహనాలు ప్రస్తుతం వాడుకోవడానికి బాగానే ఉన్నా ఏళ్లు గడిచే కొద్దీ వచ్చే కొన్ని సమస్యలు వినియోగదారుల జేబులకు చిల్లులు పెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈవీ వాహనాలు అనేవి బ్యాటరీ సాయంతో పని చేస్తాయి. ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో మన వాహన బ్యాటరీ పాడైనా లేకపోతే వారెంటీ క్లెయిమ్ కాకపోయినా కొత్త బ్యాటరీ కొనాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఈ నేపథ్యంలో వాటి ధరలకు వినియోగదారులకు షాక్ ఇస్తున్నాయి. ఈవీ బ్యాటరీల ధర రూ. 50 వేల కంటే ఎక్కువగానే ఉన్నాయి. కాబట్టి మార్కెట్‌లో ఎక్కువ ప్రజాదరణ పొందిన ఈవీ వాహనాల బ్యాటరీ రేట్లు ఎలా ఉన్నాయో? ఓ సారి తెలుసుకుందాం.
ఓలా ఎస్1 ప్రో బ్యాటరీ ధర
ఓలా ఎస్1 ప్రో స్కూటర్ కోసం ఎల్‌జీ కెమ్ (దక్షిణ కొరియా) నుంచి ఎన్‌ఎంసీ ఆధారిత ఎల్‌ఐ ఐఓఎన్ బ్యాటరీలను దిగుమతి చేస్తోంది . దీని 4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ మొత్తం 224 సెల్స్‌తో తయారు చేస్తారు. అలాగే ఈ బ్యాటరీ ఐపీ 67 ప్రొటెక్షన్ (దుమ్ము, నీరు) రెసిస్టెంట్స్‌తో వస్తుంది. అలాగే ఓలా స్కూటర్ బ్యాటరీ మూడు సంవత్సరాల వారెంటీతో పని చేస్తుంది. ఈ కాలంలో బ్యాటరీలో ఏదైనా తయారీ లోపాలు ఉంటే దానిని ఓలా ఉచితంగా చూసుకుంటుంది. ఐచ్ఛిక వారంటీ ప్యాకేజీని ఉపయోగించడం ద్వారా ఈ వారంటీని మరో రెండు సంవత్సరాలకు పొడిగించవచ్చు. అయితే దాని బ్యాటరీ ప్యాక్ 7 సంవత్సరాల వరకు సవాళ్లను ఎదుర్కోదని ఓలా నమ్మకంగా పని చేస్తుందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. తప్పని పరిస్థితుల్లో బ్యాటరీ మార్చాల్సి వస్తే ఓలా బ్యాటరీ ధర రూ.87,298గా ఉంది. అయితే టెక్నాలజీని మెరుగుపరచడం వల్ల రాబోయే సంవత్సరాల్లో బ్యాటరీ ప్యాక్‌ల ధర తగ్గుతుందని ఓలా అంచనా వేస్తోంది.
టీవీఎస్ ఐక్యూబ్ బ్యాటరీ
టీవీఎస్ బ్యాటరీ ప్యాక్ నాన్ రిమూవబుల్‌గా ఉంటుంది. ఈ బ్యాటరీ ఐపీ 67 రక్షణ రేటింగ్‌తో 3.4 కేడబ్ల్యూహెచ్ అని కంపెనీ పేర్కొంటుంది. ఈ బ్యాటరీపై కంపెనీ 3 సంవత్సరాలు లేదా 50,000 కిమీలు ఏది ముందైతే అది లెక్కన వారంటీని అందిస్తుంది. బ్యాటరీ ప్యాక్ ఎన్‌ఎంసీ ఆధారిత ఎల్‌ఐఐఓఎన్ బ్యాటరీతో తయారు చేశారు. అయితే బ్యాటరీ భర్తీ ఖర్చు కంపెనీ ఇప్పటికీ అధికారికంగా తెలపలేదు. అయితే స్కూటర్ ధరలో బ్యాటరీ ధర దాదాపు 40 శాతం నుంచి 50 శాతం వరకూ ఉంటుందని మీడియా వర్గాల అంచనా. అంటే ఈ బ్యాటరీ ప్యాక్ ధ రూ.56,613 నుంచి రూ.70,766 మధ్య ఉంటుంది.
ఏథర్ 450 ఎక్స్
ఏథర్ 450 ఎక్స్ బ్యాటరీ ప్యాక్ 3.7 కేడబ్ల్యూహెచ్ సామర్థ్యంతో పని చేస్తుంది. ఈ బ్యాటరీ ఐపీ 67 ప్రొటెక్షన్ రేటింగ్‌తో వస్తుంది. దీని బ్యాటరీ ప్యాక్ ఎన్‌ఎంసీ ఆధారిత ఎల్‌ఐఐఓఎన్ కణాలతో తయారు చేశారు. అలాగే బ్యాటరీ ప్యాక్‌లో మొత్తం సెల్‌ల సంఖ్య 168గా ఉన్నాయి. బ్యాటరీ ప్యాక్‌ను ఏథర్ స్వయంగా తయారు చేసింది. ఏథర్ దాని బ్యాటరీపై 70 శాతం పనితీరు హామీతో మూడు సంవత్సరాలు లేదా 30,000 కిమీల వారెంటీను అందిస్తుంది. అలాగే ఏథర్ ప్రో ప్యాకేజీకి సబ్‌స్క్రైబ్ చేయడం ద్వారా ఈ వారెంటీ ఐదు సంవత్సరాలు లేదా 60,000 కిమీ వరకు పొడిగించవచ్చు. ఏథర్ 450 ఎక్స్ బ్యాటరీ రీప్లేస్‌మెంట్ ధర రూ. 60,000గా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..