Removable Battery EV Scooters: రిమూవబుల్ బ్యాటరీతో వచ్చే టాప్ ఈవీ స్కూటర్లు ఇవే.. ఇక స్కూటర్ల చార్జింగ్ సమస్య ఫసక్..

ప్రస్తుతం భారత్‌లో ఈవీ స్కూటర్ల హవా నడుస్తుంది. ముఖ్యంగా ద్విచక్ర వాహనాల విషయంలో వినియోగదారులు వీటిని అమితంగా ఇష్టపడుతున్నారు. పెరుగుతున్న పెట్రోట్ ఖర్చుల నుంచి రక్షణకు వీటిని ప్రత్యామ్నాయంగా చాలా మంది భావిస్తున్నారు.

Removable Battery EV Scooters: రిమూవబుల్ బ్యాటరీతో వచ్చే టాప్ ఈవీ స్కూటర్లు ఇవే.. ఇక స్కూటర్ల చార్జింగ్ సమస్య ఫసక్..
New E Scooter
Follow us
Srinu

| Edited By: seoteam.veegam

Updated on: May 11, 2023 | 6:59 PM

ప్రస్తుతం భారత్‌లో ఈవీ స్కూటర్ల హవా నడుస్తుంది. ముఖ్యంగా ద్విచక్ర వాహనాల విషయంలో వినియోగదారులు వీటిని అమితంగా ఇష్టపడుతున్నారు. పెరుగుతున్న పెట్రోట్ ఖర్చుల నుంచి రక్షణకు వీటిని ప్రత్యామ్నాయంగా చాలా మంది భావిస్తున్నారు. అయితే పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు ఇప్పటికే చాలా శాతం ఈవీ వైపు మళ్లినా గ్రామీణ ప్రాంత ప్రజలు మాత్రం ఇప్పటికీ పెట్రో వాహనాల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా చార్జింగ్ విషయంలో సమస్యలే ఈవీ వైపు వెళ్లడానికి ప్రజలను నిరోధిస్తున్నాయి. ముఖ్యంగా రిమూవబుల్ బ్యాటరీ లేకుండా డైరెక్ట్‌గా చార్జ్ చేసుకునేలా కొన్ని స్కూటర్లు రావడంతో చార్జింగ్ చేసుకునే విషయంలో సమస్యలు ఎదురవుతాయని కొంతమంది ఈవీ వాహనాలను కొనుగోలు చేయడం లేదు. అలాగే దూరప్రాంతాలకు వెళ్లినప్పుడు చార్జ్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడాలని పలువురి వాదన. అయితే మార్కెట్‌లో రిమూవబుల్ బ్యాటరీలతో కూడా కొన్ని స్కూటర్లు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా చార్జింగ్ సమస్యల నుంచి రక్షణగా రావడంతో ఇవి వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. కాబట్టి మార్కెట్ రిమూవబుల్ బ్యాటరీలతో అందుబాటులో ఉన్న టాప్ 5 ఈవీ స్కూటర్లపై ఓ లుక్కేద్దాం.

హీరో వీడా

హీరో మోటోకార్ప్ కొత్త ఇ-స్కూటర్ – విడాను ప్రారంభించడంతో ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలోకి ప్రవేశించింది. ఈ బ్రాండ్2కు సంబంధించిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే. విడా వీ1 భారతదేశంలో రూ. 1.45 లక్షలకు అందుబాటులో ఉంది. ఈ స్కూటర్2కు ఒక్కసారి చార్జ్ చేస్తే 165 కిమీ వరకు మైలేజ్ అందిస్తుంది. అలాగే గంటకు 80 కిలో మీటర్ల వేగంతో దూసుకుపోతుంది. 

బౌన్స్ ఇన్‌ఫినిటీ

బౌన్స్ ఇన్ఫినిటీ 2కేడబ్ల్యూహెచ్ 48 వీ 39 ఏహెచ్ మార్చుకునే అవకాశం ఉన్న బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తెంది. ఇన్ఫినిటీ ఐపీ 67 రేటెడ్ లిథియం-అయాన్ బ్యాటరీని ఉపయోగిస్తుంది, ఇది ఛార్జ్ చేయడానికి నాలుగు-ఐదు గంటల సమయం పడుది. ఈ స్కూటర్‌లో ఎకో, స్పోర్ట్ అనే రెండు రైడ్ మోడ్‌లు ఉంటాయి.

ఇవి కూడా చదవండి

ఆప్టిమా సీఎక్స్

ఆప్టిమా సీఎక్స్ 550 వాట్స్ బీఎల్‌డీసీ మోటార్ నుంచి శక్తిని తీసుకుంటుంది. ఇది 52.2వీ, 30ఏహెచ్ లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీతో జత చేస్తే 1.2 బీహెచ్‌పీ గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్ ఛార్జ్ చేయడానికి 4-5 గంటలు పడుతుంది. అలాగే ఓ చార్జ్ పై 140 కిమీల రేంజ్‌ వస్తుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. అలాగే ఈ స్కూటర్ గంటకు 45 కిలో మీటర్ల వేగంతో దూసుకుపోతుంది. 

సింపుల్ ఎనర్జీ వన్

బెంగుళూరుకు చెందిన సింపుల్ ఎనర్జీ వన్ స్కూటర్ యువతను ఎక్కువగా ఆకట్టుకుంటుంది. ఈ స్కూటర్ 4.8 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో పని చేస్తుంది. ఇది పూర్తి ఛార్జ్‌పై 236కిమీ పరిధిని అందిస్తుంది. అలాగే ఈ స్కూటర్ 2.7 సెకన్లలో 0 నుంచి 40కిమీల వేగాన్ని అందుకుంటుంది. అందువల్ల పట్టణ ప్రాంత ప్రజలు ఈ స్కూటర్‌ను అధికంగా ఇష్టపడుతున్నారు. 

ఒకినావా ఐ ప్రైజ్ ప్లస్

ఒకినావా ఐ ప్రైజ్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ 3.3 కేడబ్ల్యూహెచ్ లిథియం-అయాన్ తొలగించగల బ్యాటరీ ప్యాక్‌‌తో వస్తుంది. ఈ స్కూటర్ ఓ చార్జ్‌పై 139 కిలోమీటర్ల పరిధిని ఇస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లోని బ్యాటరీ మైక్రో-ఛార్జర్, ఆటో-కట్ ఫీచర్‌తో 4-5 గంటల్లో ఛార్జ్ అవుతుంది. స్కూటర్‌కు 3 సంవత్సరాల బ్యాటరీ గ్యారెంటీ, 3 సంవత్సరాలు లేదా 30,000 కి.మీ (ఏది ముందుగా వచ్చినా) ఎలక్ట్రిక్ మోటార్ వారెంటీతో వస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?