Electric Scooter: హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్.. యునిక్ ఫీచర్లతోపాటు అధిక రేంజ్..

కొన్ని స్కూటర్లను మాత్రం ప్రజల్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది. వాటిల్లో రోవెట్ జెపాప్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకటి. ఇది మార్కెట్లో లాంచ్ అయిన దగ్గర నుంచి హాట్ కేక్ లా అమ్ముడవుతోంది. నెలల వ్యవధిలోనే వేలాది స్కూటర్ల అమ్మకాలు జరిగాయి.

Electric Scooter: హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్.. యునిక్ ఫీచర్లతోపాటు అధిక రేంజ్..
Rowwet Zepop Electric Scooter
Follow us
Madhu

|

Updated on: May 07, 2023 | 5:00 PM

భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల పరంపర కొనసాగుతోంది. ముఖ్యంగా స్కూటర్లకు డిమాండ్ నేపథ్యంలో దీనిని అందిపుచ్చుకునేందుకు ప్రతి కంపెనీ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ప్రతి రోజూ ఏదో ఒక ఓ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదలవుతూనే ఉంది. కొన్ని స్కూటర్లను మాత్రం ప్రజల్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది. వాటిల్లో రోవెట్ జెపాప్(Rowwet Zepop) ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకటి. ఇది మార్కెట్లో లాంచ్ అయిన దగ్గర నుంచి హాట్ కేక్ లా అమ్ముడవుతోంది. నెలల వ్యవధిలోనే వేలాది స్కూటర్ల అమ్మకాలు జరిగాయి. ఈ స్కూటర్లో అత్యధిక రేంజ్, యూనిక్ ఫీచర్లు ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

స్పెసిఫికేషన్లు ఇవే.. రోవెట్ జెపాప్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 72V, 30Ah సామర్థ్యంతో కూడిన లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఫుల్ చార్జ్ అవడానికి మూడు గంటల సమయం పడుతుంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 145 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. మోటార్ 2000వాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీనిలో డబుల్ డిస్క్ బ్రేకులు ఉంటాయి. ట్యూబ్ లెస్ టైర్లను ఇచ్చారు. ఇది గరిష్టంగా గంటకు 65 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుతుంది.

ఫీచర్లు ఇలా.. రోవెట్ జెపాప్ ఎలక్ట్రిక్ స్కూటర్లో పుష్ బటన్, పెద్ద స్క్రీన్, డిజిటల్ ఓడోమీటర్, స్పీడోమీటర్, ట్రిప్ మీటర్, యూఎస్బీ కనెక్టర్, ఎల్ఈడీ లైటింగ్, ఎల్ఈడీ టెయిల్ లైట్, ఎల్ఈడీ టర్న్ లైట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ స్కూటర్లో నార్మల్ మోడ్ తో పాటు ఎకో మోడ్ అనే ఆప్షన్లు ఉన్నాయి.

ధర ఎంతంటే.. రోవెట్ జెపాప్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర మన ఇండియాలో రూ. 61,770 నుంచి 78,500 వరకూ ఉంటుంది. దీనిలో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..