AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యాపిల్ దిగుమతులపై కేంద్రం నిషేధం..! అసలు కారణం ఇదే..

విదేశాల నుంచి దిగుమతి చేసుకునే యాపిల్స్‌ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. దేశంలో పండించే యాపిల్స్‌ కంటే విదేశాలనుంచి దిగుమతి చేసుకున్న యాపిల్స్‌నే దేశ వ్యాప్తంగా ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నందున స్వదేశంలోని యాపిల్‌ రైతులు..

యాపిల్ దిగుమతులపై కేంద్రం నిషేధం..! అసలు కారణం ఇదే..
India Bans Apple Imports
Srilakshmi C
|

Updated on: May 11, 2023 | 5:10 PM

Share

విదేశాల నుంచి దిగుమతి చేసుకునే యాపిల్స్‌ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. దేశంలో పండించే యాపిల్స్‌ కంటే విదేశాలనుంచి దిగుమతి చేసుకున్న యాపిల్స్‌నే దేశ వ్యాప్తంగా ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నందున స్వదేశంలోని యాపిల్‌ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విదేశాలనుంచి వచ్చే యాపిల్స్‌ తక్కువ ధరకు లభ్యంకావడంతో వాటికి డిమాండ్‌ అధికంగా ఉంటోంది. దీంతో దేశీయంగా యాపిల్స్‌ పండిస్తున్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

ఈ నేపథ్యంలో కశ్మీర్, హిమాచల్​ప్రదేశ్‌లలోని యాపిల్‌లకు విదేశీ యాపిల్​పండ్లతో పోటీ పెరిగినందున, కిలోకు రూ.50 కంటే తక్కువ ఉన్న పండ్ల దిగుమతిని భారత్​ నిషేధించింది. యాపిల్ సీఐఎఫ్​(ధర, బీమా, సరకు) ధర రూ.50 కంటే ఎక్కువగా ఉంటే దిగుమతి చేసుకోవచ్చని, ఐతే భూటాన్​ నుంచి వచ్చే పండ్లకు దిగుమతి ధర వర్తించదని డైరెక్టరేట్​జనరల్​ ఆఫ్ ఫారిన్ ట్రేడ్​(డీజీఎఫ్​టీ) విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది.

కాగా భారత్‌కు యాపిల్స్‌ను ఎగుమతి చేస్తున్న దేశాల్లో టర్కీ, ఇటలీ, ఇరాన్, చిలీ అగ్రస్థానంలో ఉన్నాయి. దక్షిణాఫ్రికా, పోలాండ్‌, అమెరికా, బ్రెజిల్‌, యూఏఈ, అఫ్ఘానిస్తాన్‌, ఫ్రాన్స్‌, బెల్జియం, న్యూజిలాండ్‌ వంటి దేశాల నుంచి కూడా యాపిల్‌ పండ్లు దిగుమతి చేసుకుంటున్నాం. కేంద్రం తాజా నిర్ణయంతో ఈ దేశాలన్నింటిపై ఈ నిషేదం వర్తిస్తుంది. ఈ నిర్ణయం పట్ల యాపిల్ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
సాధారణ కాఫీకి బదులుగా.. ఇలా వాల్‌నట్ మిల్క్ కాఫీని ట్రై చేయండి..
సాధారణ కాఫీకి బదులుగా.. ఇలా వాల్‌నట్ మిల్క్ కాఫీని ట్రై చేయండి..
బాలయ్యకు ఒక్క మెసేజ్ చేశా.. ఆరోజు ఆయనలో నాకు దేవుడు కనిపించాడు
బాలయ్యకు ఒక్క మెసేజ్ చేశా.. ఆరోజు ఆయనలో నాకు దేవుడు కనిపించాడు
హోటల్ స్టైల్ రవ్వ ఉప్మా రహస్యం..ఇలా చేస్తే అందరూ ఇష్టంగా తింటారు!
హోటల్ స్టైల్ రవ్వ ఉప్మా రహస్యం..ఇలా చేస్తే అందరూ ఇష్టంగా తింటారు!
ఇల్లు వదిలి వెళ్లిన బాలుడు బురద గుంటలో ఇలా.. క్లైమాక్స్ ఊహించలేరు
ఇల్లు వదిలి వెళ్లిన బాలుడు బురద గుంటలో ఇలా.. క్లైమాక్స్ ఊహించలేరు
ఇష్టమైన వాళ్ళు దూరమైన తర్వాతే విలువ ఎందుకు తెలుస్తుంది?
ఇష్టమైన వాళ్ళు దూరమైన తర్వాతే విలువ ఎందుకు తెలుస్తుంది?
ఇది పండుకానీ పండు.. కనిపిస్తే వదలకండి.. ఆ రోగాలకు సూపర్ మెడిసిన్!
ఇది పండుకానీ పండు.. కనిపిస్తే వదలకండి.. ఆ రోగాలకు సూపర్ మెడిసిన్!
ఆవును వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు..! తర్వాత..
ఆవును వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు..! తర్వాత..
బాలయ్య గురించి చాలామందికి తెలియని విషయాలు మీకోసం..
బాలయ్య గురించి చాలామందికి తెలియని విషయాలు మీకోసం..
రూ.1.10 లక్షల కోట్ల భూములకు రక్షణ.. ప్రభుత్వ స్థలాలకు హైడ్రా అండ
రూ.1.10 లక్షల కోట్ల భూములకు రక్షణ.. ప్రభుత్వ స్థలాలకు హైడ్రా అండ
లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా కన్నుమూత.. శోకసంద్రంలో సినీ పరిశ్రమ
లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా కన్నుమూత.. శోకసంద్రంలో సినీ పరిశ్రమ