Watch Video: ధైర్యం అంటే ఇదే.. ఆపదలో ఉన్న తోడేలుతో పోరాడి మరి దాన్ని రక్షించాడు, వీడియో వైరల్
పక్షులు, జంతువులు ఏదైన ప్రమాదంలో పడినప్పుడు వాటిని కొంతమంది రక్షించిన ఘటనలు చూశాం. కానీ క్రూర మృగాలు మాత్రం అనుకోకుండా ప్రమాదంలో పడితే వాటిని రక్షించేందుకు ఎవరూ ముందుకు వచ్చేందుకు సాహసం చేయరు. ఎందుకంటే ఒకవేళ వాటిని రక్షించాలని ప్రయత్నిస్తే మన ప్రాణాలే పోయే అవకాశం ఉంటుంది.

పక్షులు, జంతువులు ఏదైన ప్రమాదంలో పడినప్పుడు వాటిని కొంతమంది రక్షించిన ఘటనలు చూశాం. కానీ క్రూర మృగాలు మాత్రం అనుకోకుండా ప్రమాదంలో పడితే వాటిని రక్షించేందుకు ఎవరూ ముందుకు వచ్చేందుకు సాహసం చేయరు. ఎందుకంటే ఒకవేళ వాటిని రక్షించాలని ప్రయత్నిస్తే మన ప్రాణాలే పోయే అవకాశం ఉంటుంది. అయితే ఓ వ్యక్తి మాత్రం ఇవేమి పట్టించుకోలేదు. ఆపదలో ఉన్న తోడేలును రక్షించేందుకు తన ప్రాణాలు కూడా లెక్కచేయలేదు. వివరాల్లోకి వెళ్తే ఓ చోట ఉన్న తోడేలుకు తన కాలు రాడ్ లాంటి దానిలో ఇరుక్కుపోయింది. దాని నుంచి బయటపడేందుకు ఆ తోడేలు ప్రయత్నిస్తున్నటికీ ఫలితం లేకపోయింది. దీంతో అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి ఓ కర్ర సహాయంతో దీన్ని కంట్రోల్ చేశాడు. మరో పక్క దాన్ని కాపేడుందుకు యత్నించాడు.
చివరికి ఆ తోడేలు కాలుకి ఇరుక్కున్న ఆ రాడ్ నుంచి విడిపించాడు. ఆ తర్వాత దాని నుంచి దూరంగా జరిగాడు. దీంతో వెంటనే ఆ తోడేలు లేచి అడవిలోకి వేగంగా పారిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆ తోడేలుని కాపాడిన వ్యక్తిని ధైర్యవంతుడు అంటూ ప్రశంసిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియో చూసేయండి.




Brave Man Rescues Wolf from Trap with the Help of a Stick pic.twitter.com/ZqSGJqJxXi
— Terrifying Nature (@TerrifyingNatur) May 8, 2023
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..