IPL 2023: సోషల్ మీడియాలో ఆగని వార్.. పోటాపోటీ పోస్టులతో హీట్ పెంచుతోన్న గంభీర్, కోహ్లీ..

Gautam Gambhir vs Virat Kohli: విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్ మధ్య వైరం ముగిసే సూచనలు కనిపించడం లేదు. ఈ వైరం 2013లో మైదానంలో మొదలై.. 2023 వరకు కొనసాగుతూనే ఉంది. ఈసారి విరాట్ కోహ్లీ ఆటగాడు కాగా, గౌతమ్ గంభీర్ మెంటార్‌గా ఉన్నాడు. అయితే వీరిద్దరి మధ్య గొడవలు మాత్రం తగ్గకపోవడం విశేషం.

IPL 2023: సోషల్ మీడియాలో ఆగని వార్.. పోటాపోటీ పోస్టులతో హీట్ పెంచుతోన్న గంభీర్, కోహ్లీ..
Gambhir Vs Kohli
Follow us
Venkata Chari

|

Updated on: May 10, 2023 | 9:37 PM

IPL 2023: విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్ మధ్య వైరం ముగిసే సూచనలు కనిపించడం లేదు. ఈ వైరం 2013లో మైదానంలో మొదలై.. 2023 వరకు కొనసాగుతూనే ఉంది. ఈసారి విరాట్ కోహ్లీ ఆటగాడు కాగా, గౌతమ్ గంభీర్ మెంటార్‌గా ఉన్నాడు. అయితే వీరిద్దరి మధ్య గొడవలు మాత్రం తగ్గకపోవడం విశేషం. ఏప్రిల్ 10న బెంగళూరులో RCBతో జరిగిన మ్యాచ్ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతమ్ గంభీర్ ఆవేశంగా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఈ సంబురాల్లో ఆర్సీబీ అభిమానులు నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు.

ఆ తర్వాత లక్నోలో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లి భారీ సెలబ్రేషన్‌తో కౌంటర్ ఇచ్చాడు. కోహ్లి సెలబ్రేషన్‌తో ఆగ్రహించిన గంభీర్ మ్యాచ్ తర్వాత గొడవకు దిగాడు. దీని తర్వాత, బీసీసీఐ వారిద్దరికీ మ్యాచ్ ఫీజులో 100% జరిమానా విధించింది.

ఈ పెనాల్టీ తర్వాత అంతా ముగిసినట్లు అనిపించింది. కానీ, లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మంచి ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లను విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో ప్రశంసించాడు.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు ఈ సోషల్ మీడియా పోస్ట్‌పై గౌతం గంభీర్ కూడా స్పందించాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అవుట్ కావడంతో, గంభీర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌తో సంబరాలు చేసుకున్నాడు. ఇది కూడా థియేట్ కింగ్ కోహ్లి చేసిన పోస్ట్ లానే ఉంది.

ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లి జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ వేసిన తొలి ఓవర్‌లో వికెట్ కీపర్‌కి క్యాచ్ ఇచ్చాడు. కోహ్లి ఔట్ కాగానే గంభీర్ జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.

ఈ కౌంటర్ ఎటాక్ పోస్ట్ వైరల్ కావడంతో, గంభీర్ ఆ పోస్ట్‌ను తొలగించాడు. అయితే గౌతీ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ స్క్రీన్‌షాట్‌లు సోషల్ మీడియాలో హల్‌చల్ చేయడం ప్రారంభించాయి.

విశేషమేమిటంటే.. ఇంతకుముందు లక్నోతో జరిగిన మ్యాచ్‌లో అద్భుత బ్యాటింగ్‌ను ప్రదర్శించిన వృద్ధిమాన్ సాహాపై విరాట్ కోహ్లీ ప్రశంసలు కురిపించి,వాట్ ఏ ప్లేయర్ అంటూ పోస్ట్ చేశాడు. ఇప్పుడు గౌతమ్ గంభీర్ అందుకు కౌంటర్‌గా పోస్ట్ చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..