IPL 2023: ‘నీ పోరాటం నీ మనస్సుతోనే’.. ఆఫ్ఘన్ బౌలర్‌కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన కోహ్లీ..

Virat kohli vs Naveen-ul-Haq: మంగళవారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ముంబై ఇండియన్స్ ఓడించింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ 21 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో RCBని ఓడించింది.

IPL 2023: 'నీ పోరాటం నీ మనస్సుతోనే'.. ఆఫ్ఘన్ బౌలర్‌కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన కోహ్లీ..
Virat Vs Naveen Ul Haq
Follow us
Venkata Chari

|

Updated on: May 10, 2023 | 9:29 PM

మంగళవారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ముంబై ఇండియన్స్ ఓడించింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ 21 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో RCBని ఓడించింది. ఆ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ ఫాస్ట్ బౌలర్ నవీన్-ఉల్-హక్ మామిడి పండ్లు, టెలివిజన్ స్క్రీన్‌ల చిత్రాలను పంచుకోవడం ద్వారా విరాట్ కోహ్లీని ట్రోల్ చేశాడు. ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మెన్ సూర్య కుమార్ యాదవ్, నెహాల్ వధేరా టెలివిజన్ స్క్రీన్‌పై కనిపించారు. ఈ క్రమంలో నవీన్ ఉల్ హక్ పై విరాట్ కోహ్లి ఎదురుదాడి చేశాడు.

‘నీ పోరాటం నీ మనస్సుతోనే, వాస్తవంలో నీతో నీకే పోటీ’

ఈమేరకు విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్‌లో తన ఫొటోను పంచుకున్నాడు. ఫోటోలో విరాట్ కోహ్లి కుర్చీపై కూర్చొని ఉన్నాడు. దీనితో పాటు, ‘నీ పోరాటం నీ మనస్సుతోనే, వాస్తవంలో నీతో నీకే పోటీ’ అంటూ రాసుకొచ్చాడు. ఇది నవీన్-ఉల్-హక్‌కి విరాట్ కోహ్లీ ఇచ్చిన స్ట్రాంగ్ రిప్లై అంటూ సోషల్ మీడియాలో అభిమానులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

విరాట్ కోహ్లీని ట్రోల్ చేసిన నవీన్ ఉల్ హక్..

గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లి, నవీన్ ఉల్ హక్ మధ్య ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. దీని తర్వాత ఈ పోరులో లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతమ్ గంభీర్ ప్రవేశించాడు. ఆ తర్వాత ఇద్దరు ఆటగాళ్లు సోషల్ మీడియా ద్వారా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఒకరినొకరు నిరంతరం లక్ష్యంగా చేసుకుంటూ.. మాటలతో కాకుండా, పోస్టులతో దాడులు చేసుకుంటున్నారు. మంగళవారం రాత్రి ముంబై ఇండియన్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమి తర్వాత, నవీన్-ఉల్-హక్ విరాట్ కోహ్లీతోపాటు RCBని ఎగతాళి చేశాడు. ఆఫ్ఘన్‌ ఫాస్ట్‌ బౌలర్‌ నవీన్‌ ఉల్‌ హక్‌ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ క్రమంలోనే కోహ్లీ ఇలా స్పందించాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..