IPL Rewind: ఊచకోత అంటే ఇదే.. 102 బంతుల్లో 215 పరుగులు.. ఐపీఎల్ చరిత్రలో అరుదైన రికార్డు!
సరిగ్గా ఎనిమిదేళ్ల కిందట మే 10వ తేదీన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు అరుదైన రికార్డు సృష్టించారు. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్..
సరిగ్గా ఎనిమిదేళ్ల కిందట మే 10వ తేదీన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు అరుదైన రికార్డు సృష్టించారు. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ ఐపీఎల్ హిస్టరీలోనే రెండో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యాన్ని(215) నెలకొల్పారు. ముంబైతో జరిగిన ఈ మ్యాచ్‌లో ఏబీ డివిలియర్స్ ౫౯ బంతుల్లో 4 సిక్సర్లు, 19 ఫోర్లతో 133 పరుగులు చేయగా.. విరాట్ కోహ్లీ 50 బంతుల్లో 4 సిక్సర్లు, 6 ఫోర్లతో 82 పరుగులతో మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో ఆర్సీబీ 235/1 రన్స్ చేసింది.
ఆ మ్యాచ్‌లో వీరిద్దరూ కూడా ముంబై బౌలర్లను ఊచకోత కోశారు. వీరి దెబ్బకు ఆ జట్టుకు చెందిన 5గురు బౌలర్లు 10 కంటే ఎక్కువ ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నారు. ఇక ఈ భీకర లక్ష్యాన్ని చేధించే క్రమంలో ముంబై 196/7 రన్స్ మాత్రమే చేయగలిగింది. ముంబై ఇండియన్స్ బ్యాటర్లలో సిమ్మన్స్(68) అర్ధ సెంచరీ చేయగా.. పొలార్డ్ 49 పరుగులతో రాణించాడు. వీరిద్దరూ మినహా మిగిలిన ఏ బ్యాట్స్‌మెన్ కూడా చెప్పుకోదగ్గ పరుగులు చేయలేదు. ఆర్సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్, చాహల్ చెరో రెండు వికెట్లు తీశారు.
ABD ? Virat Runs: 2️⃣1️⃣5️⃣ ? Balls: 1️⃣0️⃣2️⃣ ?? SR: 2️⃣1️⃣0️⃣.7️⃣8️⃣ ?#OnThisDay in 2015, an unbeaten unforgettable partnership between De Villiers (1️⃣3️⃣3️⃣) & Kohli (8️⃣2️⃣) catalysed a 3️⃣9️⃣-run win at the Wankhede! ❤️?#PlayBold #ನಮ್ಮRCB #IPL pic.twitter.com/LLN3BjOII8
— Royal Challengers Bangalore (@RCBTweets) May 10, 2023