CSK vs DC: సొంత మైదానంలో అదరగొట్టిన ధోని సేన.. ఢిల్లీపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువగా..
Chennai Super Kings vs Delhi Capitals: చెన్నై సూపర్ కింగ్స్ మళ్లీ అదరగొట్టింది. సొంత మైదానంలో ప్రత్యర్థిపై జూలు విదిల్చింది. చెపాక్ వేదికగా బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్‌లో ధోని సేన 27 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
Chennai Super Kings vs Delhi Capitals: చెన్నై సూపర్ కింగ్స్ మళ్లీ అదరగొట్టింది. సొంత మైదానంలో ప్రత్యర్థిపై జూలు విదిల్చింది. చెపాక్ వేదికగా బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్‌లో ధోని సేన 27 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. చెన్నై విధించిన 168 పరుగుల లక్ష్యాన్ని బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్లు కోల్పోయి కేవలం 140 పరుగులు మాత్రమే చేసింది. రిలీ రొసోవ్(35), మనీష్ పాండే(27), అక్షర్ పటేల్ (21) మినిహా మరెవరూ పెద్దగా ఆడలేదు. కెప్టెన్ వార్నర్ (0), ఫిలిప్ సాల్ట్ (17), మిషెల్ మార్ష్ (5), రిపాల్ పటేల్ (10) పూర్తిగా నిరాశపరచారు. చెన్నై బౌలర్లలో జూనియర్ మలింగ పతిరణ 3 వికెట్లు తీసి ఢిల్లీని దెబ్బకొట్టాడు. దీపక్ చాహర్ 2, జడేజా ఒక వికెట్ తీశారు. 21 పరుగులు చేయడంతో పాటు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించిన ఆల్‌రౌండర్ రవీంద్రజడేజాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది.
ఢిల్లీకి సన్నగిల్లిన ప్లే ఆఫ్ ఛాన్స్
ఈ విజయంతో చెన్నై ప్లేఆఫ్స్‌కు మరింత చేరువకాగా, ఢిల్లీ అవకాశాలు మరింత సన్నగిల్లాయి. అంతకుముందు బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. శివమ్ దూబే(25) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఓపెనర్ రితురాజ్ గైక్వాడ్ 24 పరుగులు చేశాడు. ఆఖరులో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 9 బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్సర్లతో 20 పరుగులతో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఢిల్లీ తరపున మిచెల్ మార్ష్ మూడు వికెట్లు తీయగా, అక్షర్ పటేల్ రెండు వికెట్లు తీశాడు.
Quick and how ⚡#CSKvDC #WhistlePodu #Yellove ??pic.twitter.com/fm1MchPDop
— Chennai Super Kings (@ChennaiIPL) May 10, 2023
Team spirit and process. ??#CSKvDC #WhistlePodu #Yellove ?? pic.twitter.com/McIl54OnQ3
— Chennai Super Kings (@ChennaiIPL) May 10, 2023
ఇరుజట్లు (ప్లేయింగ్ XI)
చెన్నై సూపర్ కింగ్స్ : రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, అంబటి రాయుడు, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, MS ధోని(కీపర్/కెప్టెన్), దీపక్ చాహర్, మతీషా పతిరణ, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ.
ఢిల్లీ క్యాపిటల్స్ : డేవిడ్ వార్నర్ (కెప్టెన్), ఫిలిప్ సాల్ట్ (కీపర్), మిచెల్ మార్ష్, రిలీ రోసోవ్, అక్షర్ పటేల్, అమన్ హకీమ్ ఖాన్, లలిత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..