ముగ్గురు డీఎన్‌ఏలతో జన్మించిన శిశువు.. ఫలించిన బ్రిటన్ పరిశోధకుల కృషి.. చరిత్రలో తొలిసారిగా..
వంశపార్యపరంగా వచ్చే కొన్ని అరుదైన జన్యువ్యాధులను వల్ల కొంతమంది చిన్నారులు పుట్టుకతోనే పలు రకాల సమస్యలతో జన్మిస్తున్నారు. మరికొందరు పుట్టగానే చనిపోతున్నారు. అయితే ఇటువంటి సమస్యకు బ్రిటన్ పరిశోధకులు చెక్ పెట్టారు. జన్యుపరమైన వ్యాధులను నివారించి ఆరోగ్యవంతమైన చిన్నారుల జననానికి దోహదపడే విధానాన్ని ప్రయోగించి బ్రిటన్ పరిశోధకులు విజయం సాధించారు.

వంశపార్యపరంగా వచ్చే కొన్ని అరుదైన జన్యువ్యాధులను వల్ల కొంతమంది చిన్నారులు పుట్టుకతోనే పలు రకాల సమస్యలతో జన్మిస్తున్నారు. మరికొందరు పుట్టగానే చనిపోతున్నారు. అయితే ఇటువంటి సమస్యకు బ్రిటన్ పరిశోధకులు చెక్ పెట్టారు. జన్యుపరమైన వ్యాధులను నివారించి ఆరోగ్యవంతమైన చిన్నారుల జననానికి దోహదపడే విధానాన్ని ప్రయోగించి బ్రిటన్ పరిశోధకులు విజయం సాధించారు. తమ దేశ చరిత్రలో తొలిసారిగా ముగ్గురు వ్యక్తుల డీఎన్‌ఏను పంచుకుంటూ శిశువుని జన్మించేలా చేసి మరో నూతన పద్దతికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం మైటోకాండ్రియా దానం అనే వినూత్న విధానాన్ని ఉపయోగించారు. అయితే మైటోకాండ్రియల్ వ్యాధి వల్ల కొంతమంది తల్లులు తమ పిల్లలను కోల్పోతున్నారు.
ఈ వ్యాధి తల్లి పిండం వల్ల శిశువులకు సోకుతుంది. దీన్ని నివారించేందుకు వైద్యులు మైటోకాండ్రియల్ డొనేషన్ ట్రీట్‌మెంట్‌పై పరిశోధనలు చేశారు. దాత నుంచి ఆరోగ్యకరమైన పిండం కణాలను సేకరించారు. వాటిని ఐవీఎఫ్ పిండంగా ఫలదీకరణం చేసి, తల్లి గర్భంలో ప్రవేశపెట్టారు. చివరికి బిడ్డ ఆరోగ్యకరంగా పుట్టింది. శిశువుకు తండ్రి లక్షణాలు వచ్చాయని, ఇద్దరి కండ్లు ఒకేలా ఉన్నాయని వైద్యులు తెలిపారు. అయితే తాము చేపట్టిన ఈ విధానంలో ఎంతమంది శిశువులు పుట్టారన్న సంగతిని స్పష్టంగా వెల్లడించలేదు. వారి సంఖ్య 5 కంటే తక్కువ అని మాత్రమేనని పేర్కొన్నారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం