Telangana: అయ్యో దేవుడా.. ఏంటయ్యా ఈ ఘోరం.. యెల్లుండే పెళ్లి.. పాపం అంతలోనే..
యెల్లుండే పెళ్లి.. ఆ యువకుడి కళ్లల్లో ఆనందం అంతా ఇంత కాదు.. ఆమెతో ఏడడుగులు వేసి.. జీవితాన్ని ఎంతో ఆనందంగా గడుపుదామని కలలు కన్నాడు.. కానీ.. అంతలోనే ఆ యువకుడిని విధి రాత కబళించింది..
యెల్లుండే పెళ్లి.. ఆ యువకుడి కళ్లల్లో ఆనందం అంతా ఇంత కాదు.. ఆమెతో ఏడడుగులు వేసి.. జీవితాన్ని ఎంతో ఆనందంగా గడుపుదామని కలలు కన్నాడు.. కానీ.. అంతలోనే ఆ యువకుడిని విధి కబళించింది.. గుర్తు తెలియని వాహనం ఢీకొని రెండు రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడు దుర్మరణం చెందాడు. ఈ విషాద ఘటన వరంగల్జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ నగరంలోని రామన్నపేటకు చెందిన దేవరకొండ సాగర్చారి (28) తన పెళ్లి పనుల నిమిత్తం బుధవారం బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో నిర్మల మాల్ వద్ద బైక్పై రోడ్డు క్రాస్చేస్తుండగా, వేగంగా వచ్చిన మరో బైక్అతడిని ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన సాగర్చారి అక్కడికక్కడే మరణించాడు. దీంతో పెళ్లితో కళకళలాడాల్సిన ఇంట్లో సాగర్ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. చేతికంది వచ్చిన కుమారుడు దూరం కావడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.
12వ తేదీ ఉదయం 9.27 నిమిషాలకు పెళ్లి ముహూర్తం ఉందని.. ఈ క్రమంలోనే ఇలా చేశావేంటి దేవుడా అంటూ రోదిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..