National Education Policy: ఠాగూర్ తత్వశాస్త్రం ప్రేరణతోనే జాతీయ విద్యా విధానం రూపొందించాం: అమిత్ షా
నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానం (ఎన్‌ఇపి) గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఆలోచనలు, తత్వశాస్త్రం నుండి ప్రేరణ పొందిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. “జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టేటప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ..
నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానం (ఎన్‌ఇపి) గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఆలోచనలు, తత్వశాస్త్రం నుండి ప్రేరణ పొందిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. “జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టేటప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ.. ఠాగూర్ జీవితం నుండి ప్రేరణ పొందారు. పాలసీలో, మాతృభాషలో విద్యను అందించడంపై దృష్టి పెట్టడం జరిగింది.”అని మంగళవారం ఇక్కడ ఠాగూర్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో ప్రసంగించారు అమిత్ షా.
జాతీయ విద్యా విధానం అమలుపై తృణమూల్ కాంగ్రెస్ నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిరంతరం వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో హోంమంత్రి చేసిన కామెంట్స్ ఇంట్రస్టింగ్‌గా మారింది.
“దేశ విద్యా వ్యవస్థ లక్ష్యం కేవలం విదేశీ విశ్వవిద్యాలయాలు, విదేశీ విద్యల గురించి ప్రచారం చేయడానికే పరిమితం కాకూడదని ఎప్పుడూ చెప్పే ఠాగూర్ ఆలోచనలు, తత్వాల ఆధారంగా జాతీయ విద్యా విధానం రూపొందించడం జరిగింది’’ అమిత్ షా పేర్కొన్నారు.
ఠాగూర్ స్థాపించిన శాంతినికేతన్‌లోని విశ్వభారతి విశ్వవిద్యాలయాన్ని ప్రస్తావిస్తూ..“నేను శాంతినికేతన్‌కి రెండుసార్లు వెళ్ళాను. దానిపై చాలా అధ్యయనం చేసాను. శాంతినికేతన్‌లోని విద్యా ప్రయోగాలు మొత్తం ప్రపంచానికి కొత్త మార్గాన్ని చూపగలవు. భారతీయ విద్యా వ్యవస్థ యావత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుంది.’’ అని చెప్పారు అమిత్ షా.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..