Viral Video: మెట్రోలోనే బరితెగించిన జంట.. అందరి ముందే పాడు పని.. చూసి అంతా షాక్..
కొందరు రెచ్చిపోతున్నారు.. చాటు.. మాటు అనిలేదు.. బహిరంగంగానే రెచ్చిపోతున్నారు. ఇటీవల మెట్రోలో కొందరు రోమాన్స్ చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా, ఎక్కడ ఉన్నాం.. ఏం చేస్తున్నామన్న సోయిని కూడా మరిచిపోయి.. ఓ ప్రేమ జంట బరితెగించి మెట్రో రైలులో రొమాన్స్ చేసింది.
కొందరు రెచ్చిపోతున్నారు.. చాటు.. మాటు అనిలేదు.. బహిరంగంగానే రెచ్చిపోతున్నారు. ఇటీవల మెట్రోలో కొందరు రోమాన్స్ చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా, ఎక్కడ ఉన్నాం.. ఏం చేస్తున్నామన్న సోయిని కూడా మరిచిపోయి.. ఓ ప్రేమ జంట బరితెగించి మెట్రో రైలులో రొమాన్స్ చేసింది. ఏంచక్కా.. మంచిగా మెట్రోలో పడుకోని మరి ముద్దులు పెట్టుకుంటూ మునిగి తేలారు.. వైరల్ అవుతున్న వీడియోను చూసి జనం ఫైర్ అవుతున్నారు. జనం ఉండే ప్రదేశంలో ఏంటా వెకిలి పనులు అంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
రోమాన్స్ కు సంబంధించిన షాకింగ్ ఘటన ఢిల్లీ మెట్రో రైల్‌లో చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన దృశ్యాలను మెట్రో రైలు బోగీలోని కెమెరాలో రికార్డయ్యాయి. 31 సెకన్‌ల నిడివిగల ఈ వీడియోలో.. ఓ యువకుడు మెట్రో బోగీలో కూర్చుని ఉన్నాడు.. అతని ఒడిలో యువతి తలవాల్చి పడుకుని ఉంది. ఈ క్రమంలో ఇద్దరూ రొమాన్స్ లో మునిగి తేలారు. చుట్టూ కూర్చున్న ప్రయాణికులు చూస్తున్నప్పటికీ.. అవన్నీ పట్టించుకోకుండా ఆ యువకుడు యువతి మీదకు వంగి లిప్ టు లిప్ కిస్ ఇస్తూ రెచ్చిపోయాడు.
వీడియో చూడండి..
Why don’t you change the name of Delhi Metro to P0rnHub. “OMG WHAT” is this ?? #Delhimetro #viralvideo pic.twitter.com/hiRiAzGyjR
— Avnendra Singh (@avnendra_s) May 10, 2023
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్‌లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను అవనేంద్ర సింగ్ అనే యూజర్ ట్విట్టర్ లో పోస్ట్ చేసి.. ఢిల్లీ మెట్రో తన పేరును పోర్న్ హబ్‌గా ఎందుకు మార్చుకోకూడదంటూ సవాల్ చేశాడు.
ఈ వీడియోపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. యువకుడు ఆ అమ్మాయికి సీపీఆర్ చేస్తున్నాడంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ప్రాణాలు కాపాడటం కూడా నేరమేనా అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు.
అయితే.. వైరల్ అవుతున్న ఈ వీడియో ఢిల్లీ మెట్రోకి సంబంధించినదని పలు వార్తా కథనాలు వెలువడ్డాయి.. కానీ, టీవీ9 మాత్రం దీనిని ధృవీకరించడం లేదు..
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..