Electric Scooter: నాలుగు గంటల చార్జింగ్ టైం.. 75 కిలోమీటర్ల రేంజ్.. ధర అందుబాటులోనే..

మన దేశంలో మరో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులోకి వచ్చింది. దాని పేరు బిర్లా క్వాంటో. మోడర్న్ ఫీచర్లతో ఇది వినియోగదారులను ఆకర్షిస్తోంది. అంతేకాక అత్యధిక రేంజ్ కూడా ఇది ఇస్తుందని కంపెనీ ప్రకటించుకుంది.

Electric Scooter: నాలుగు గంటల చార్జింగ్ టైం.. 75 కిలోమీటర్ల రేంజ్.. ధర అందుబాటులోనే..
Birla Quanto Ev
Follow us
Madhu

|

Updated on: May 08, 2023 | 1:24 PM

భారతీయ ఆటో మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి డిమాండ్ ఉంది. మరి ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. అందుకే కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ స్కూటర్లనే ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ క్రమంలో మన దేశంలో మరో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులోకి వచ్చింది. దాని పేరు బిర్లా క్వాంటో. మోడర్న్ ఫీచర్లతో ఇది వినియోగదారులను ఆకర్షిస్తోంది. అంతేకాక అత్యధిక రేంజ్ కూడా ఇది ఇస్తుందని కంపెనీ ప్రకటించుకుంది. ఈ నేపథ్యంలో ఈ బిర్లా క్వాంటో ఎలక్ట్రిక్ స్కూటర్ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుకుందాం..

బ్యాటరీ, మోటార్ వివరాలు..

బిర్లా క్వాంటా ఎలక్ట్రిక్ స్కూటర్ లో 35Ah సామర్థ్యంతో కూడిన బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాటరీ ఫుల్ చార్జ్ అవడానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. ఇది సింగిల్ చార్జ్ పై 75 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. అలాగే దీనిలో బీఎల్డీసీ మోటార్ ఉంటుంది. డబుల్ డిస్క్ బ్రేకులు ఉంటాయి. ట్యూబ్ లైస్ టైర్లు ఉంటాయి.

ఫీచర్లు ఇలా..

ఈ బిర్లా క్వాటో ఎలక్ట్రిక్ స్కూటర్లో స్టార్ట్ బటన్, ఎల్ఈడీ లైట్, ఓడో మీటర్, ట్రిప్ మీటర్, డిజిటల్ స్పీడో మీటర్ వంటి ఫీచర్లు ఉంటాయి. అలాగే ముందు వెనుక డిస్క్ బ్రేకులు ఉంటాయి. వినియోగదారులకు సుఖవంతమైన రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

ఇవి కూడా చదవండి

ధర, లభ్యత..

బిర్లా క్వాంటా ఎలక్ట్రిక్ స్కూటర్ ఆరు వేరియేషన్లలో మన దేశంలో లభ్యమవుతోంది. దీని ధర రూ. 69,182 నుంచి రూ. 1,01,451 ఎక్స్ షోరూమ్ వరకూ ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..