National Pension Scheme: మారిన ఎన్‌పీఎస్ నిబంధనలు.. లాభమా, నష్టమా? వివరాలు..
కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో తప్ప పదవీ విరమణ వరకూ నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్) నుంచి నగదు ఉపసంహరణలకు అనుమతి ఉండదు. అయితే ఇటీవల ఎన్‌పీఎస్ నిబంధనలు సరళించింది. పాక్షిక ఉపసంహరణలకు అనుమతి ఇస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం..
పదవీ విరమణ తర్వాత సుఖవంతమైన జీవాన్ని కోరుకునేవారికి బెస్ట్ స్కీమ్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్). చాలా మంది తమ వృద్ధాప్యంలో ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండేందుకు దీనిలో ముందు నుంచే పెట్టుబడులు పెడతారు. దీనిలో అధిక మొత్తంతో పాటు పదవీవిరమణ తర్వాత పెన్షన్ ప్రయోజనాలు కూడా అందిస్తుంది. అయితే ఇటీవల నేషనల్ పెన్షన్ సిస్టమ్ లో కొత్త నిబంధనలను ప్రవేశపెట్టారు. అయితే వీటిపై సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది ఖాతాదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొంతమంది గందరగోళానికి గురవుతున్నారు. వాస్తవానికి ఈ స్కీమ్ లో ముందస్తు ఉపసంహరణలకు అనుమతి ఉండదు. కానీ కొన్ని అసామాన్య పరిస్థితుల్లో మాత్రం ప్రీ మెచ్యూర్ విత్ డ్రాకు అవకాశం ఉంటుంది. అసలు కొత్తగా ప్రవేశపెట్టిన రూల్స్ ఏంటి? దాని వల్ల కలిగే ఖాతాదారులకు కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం..
నిబంధనలు ఇలా..
ఈ ఏడాది ఎన్‌పీఎస్ లో ఉపసంహరణలకు సంబంధించి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ) కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. అయితే అది పాక్షిక ఉపసంహరణకు మాత్రమే అనుమతి ఇస్తుంది. ఈ కొత్త నిబంధనల ప్రకారం, కేంద్రం, రాష్ట్ర, కేంద్ర అటానమస్ బాడీలలో ఉద్యోగులుగా ఉన్న ఎన్‌పీఎస్ ఖాతాదారులు తమ సంబంధిత నోడల్ అధికారి ద్వారా పాక్షిక ఉపసంహరణకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది జనవరి 1, 2023 నుంచి అమలులోకి వచ్చింది. అలాగే ప్రైవేట్ రంగ సభ్యులు పాక్షిక ఉపసంహరణకు ఆన్‌లైన్ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ఎన్‌పీఎస్ ఉపసంహరణ కాల పరిమితి కూడా టీ4 నుంచి టీ2కి తగ్గించారు. T4 నుండి T2కి తగ్గించబడింది. ఉపసంహరణ ప్రక్రియ ఇప్పుడు కేవలం రెండు రోజుల్లో పూర్తవుతుంది.
కేవలం మూడు సార్లు మాత్రమే..
మీరు మీ ఎన్‌పీఎస్ ఖాతా నుండి డబ్బును విత్‌డ్రా చేయాలనుకుంటున్నట్లయితే, మీరు కేవలం మూడు సార్లు మాత్రమే విత్‌డ్రా చేయగలరని గుర్తుంచుకోవాలి. అలాగే మీ మొత్తం పెట్టుబడిలో 25 శాతం మాత్రమే విత్‌డ్రా చేసుకోవచ్చు. పిల్లల ఉన్నత విద్య, పిల్లల వివాహం, ఫ్లాట్ కొనుగోలు, నిర్మాణం, తీవ్రమైన అనారోగ్యం, ఇతర ప్రయోజనాల కోసం ఎన్‌పీఎస్ నుంచి పాక్షిక ఉపసంహరణలు చేసుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..