AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Card: క్రెడిట్ కార్డు వినియోగదారులకు అలర్ట్.. ఇకపై మీ కార్డును అలా వాడలేరు.. వివరాలు

కొందరూ లోన్ల రీ పేమెంట్లకు కూడా ఈ క్రెడిట్ కార్డులు వినియోగిస్తుంటారు. అయితే అలాంటి వారికి ఓ షాకింగ్ విషయం. ఇకపై మీరు లోన్ల రీపేమెంట్ చేయలేరు. ముఖ్యంగా బీమా పాలసీలపై తీసుకొనే లోన్లకు క్రెడిట్ కార్డులతో చెల్లింపు చేయడానికి వీల్లేకుండా కొత్త నిబంధనలు విధించారు.

Credit Card: క్రెడిట్ కార్డు వినియోగదారులకు అలర్ట్.. ఇకపై మీ కార్డును అలా వాడలేరు.. వివరాలు
Credit Card
Madhu
|

Updated on: May 08, 2023 | 3:33 PM

Share

ఇటీవల కాలంలో క్రెడిట్ కార్డుల వినియోగం గణనీయంగా పెరిగింది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక బ్యాంకుకు సంబంధించిన క్రెడిట్ కార్డును కలిగి ఉంటున్నారు. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్, ఐసీఐసీఐ వంటి బ్యాంకులు అధిక ప్రయోజనాలను అందిస్తుంటాయి. వీటితో షాపింగ్ చేస్తే వచ్చే రివార్డ్స్, క్యాష్ బ్యాక్ లతో అందరూ వీటిపై ఆసక్తి చూపుతున్నారు. అలాగే కొందరూ లోన్ల రీ పేమెంట్లకు కూడా ఈ క్రెడిట్ కార్డులు వినియోగిస్తుంటారు. అయితే అలాంటి వారికి ఓ షాకింగ్ విషయం. ఇకపై మీరు లోన్ల రీపేమెంట్ చేయలేరు. ముఖ్యంగా బీమా పాలసీలపై తీసుకొనే లోన్లకు క్రెడిట్ కార్డులతో చెల్లింపు చేయడానికి వీల్లేకుండా కొత్త నిబంధనలు విధించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఐఆర్డీఏఐ కొత్త రూల్స్ ఇవి..

ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. బీమా పాలసీల (ఇన్సూరెన్స్ పాలసీలు)పై తీసుకున్న రుణాలను క్రెడిట్ కార్డ్‌లతో తిరిగి చెల్లించడాన్ని తక్షణమే నిలిపివేయాలని బీమా కంపెనీలను ఆదేశించింది. ఇది మే 4, 2023 నుంచి అమలులోకి వచ్చింది. అంటే ఇకపై పాలసీదారులు తమ క్రెడిట్ కార్డులను ఉపయోగించి బీమా పాలసీలపై తీసుకున్న రుణాల చెల్లింపులు చేయలేరు. దానికి బదులుగా వారు డెబిట్ కార్డు, ఆన్‌లైన్ బ్యాంకింగ్, క్యాష్ వంటి పేమెంట్ విధానాల ద్వారా లోన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. గతేడాది పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ కూడా నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) టైర్-II ఖాతాలకు సబ్‌స్క్రిప్షన్లు, విరాళాల కోసం క్రెడిట్ కార్డ్‌లతో చెల్లించడం కుదరదని స్పష్టం చేసింది. ఇప్పుడు ఐఆర్‌డీఏఐ కూడా ఆ దారిలోనే పయనించింది.

బీమా పాలసీలపై రుణాలు..

జీవిత బీమా పాలసీ ఉన్నవారు ఆర్థిక ఇబ్బందుల సమయంలో దాన్ని తనఖా పెట్టి డబ్బు తీసుకోవచ్చు. మనీ బ్యాక్, ఎండోమెంట్ పాలసీల వంటి కొన్ని రకాల పాలసీలపై రుణం పొందొచ్చు. ప్రతికూల అత్యవసర పరిస్థితుల్లో పాలసీపై లోన్ తీసుకోవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి అనేక ఇతర బ్యాంకులు బీమా పాలసీలపై వినియోగదారులకు రుణాలను మంజూరు చేస్తాయి. రుణం కోసం దరఖాస్తు చేయడానికి, రుణగ్రహీతలు తప్పనిసరిగా రుణ దరఖాస్తు ఫారమ్, బీమా పాలసీ కాపీ, సంతకం చేసిన ఒప్పందాన్ని రుణదాతకు సమర్పించాలి. జీవిత బీమా పాలసీపై తీసుకునే రుణాల వడ్డీ రేట్లు వ్యక్తిగత రుణాలతో పోలిస్తే తక్కువగా ఉంటాయి. అలానే వీటికి ఇతర రుణాల కంటే వేగంగా అప్రూవల్ లభిస్తుంది. సాధారణంగా బీమా సంస్థలు మంజూరు చేసే మొత్తం సరెండర్ వాల్యూలో 85 శాతం నుంచి 90 శాతం వరకు ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
టమాటో రసం ఇలా పెడితే మూడు రోజులు ఫ్రెష్
టమాటో రసం ఇలా పెడితే మూడు రోజులు ఫ్రెష్
ఆలయాలను పదే పదే సందర్శిస్తున్నారా? నిజమైన దైవ దర్శనం అర్థం ఇదేనట!
ఆలయాలను పదే పదే సందర్శిస్తున్నారా? నిజమైన దైవ దర్శనం అర్థం ఇదేనట!
దసరా, దీపావళి సెలవుల్లో ఊరెళ్తున్నారా? ఈ తప్పు అస్సలు చేయొద్దు
దసరా, దీపావళి సెలవుల్లో ఊరెళ్తున్నారా? ఈ తప్పు అస్సలు చేయొద్దు
9 కాదు.. 16 రోజుల నవరాత్రులు! 500 ఏళ్ల నాటి పుస్తకంతో పూజలు..
9 కాదు.. 16 రోజుల నవరాత్రులు! 500 ఏళ్ల నాటి పుస్తకంతో పూజలు..
డాబాపై తులసి మొక్కను పెంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తెలుసుకోండి!
డాబాపై తులసి మొక్కను పెంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తెలుసుకోండి!
నరాల బలహీనత తగ్గి.. శరీరం ఉక్కులా మారుతుంది..
నరాల బలహీనత తగ్గి.. శరీరం ఉక్కులా మారుతుంది..
కళ్లముందే కాఫీ.. ఐనా ఆన్సర్ ‘టీ’ చెప్పాడు.. UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
కళ్లముందే కాఫీ.. ఐనా ఆన్సర్ ‘టీ’ చెప్పాడు.. UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
పంజాగుట్ట-జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ఫ్లైఓవర్‌పై బిగ్ అప్డేట్
పంజాగుట్ట-జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ఫ్లైఓవర్‌పై బిగ్ అప్డేట్
అబ్బబ్బా.. మూడు మహా యాగాలు.. వీరికి పట్టిందల్లా బంగారమే..!
అబ్బబ్బా.. మూడు మహా యాగాలు.. వీరికి పట్టిందల్లా బంగారమే..!
చిన్నప్పటి నుంచి వస్తున్నా.. ఇలా ఎప్పుడూ జరగలేదు
చిన్నప్పటి నుంచి వస్తున్నా.. ఇలా ఎప్పుడూ జరగలేదు