AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Education Loan: విద్యా రుణం తీసుకుంటున్నారా? అయితే మీ పిల్లలకు వీటిపై అవగాహన ఉండాల్సిందే..

తల్లిదండ్రులు ఈ విద్యా రుణం తీసుకొనే ముందే పిల్లలకు మానసికంగా కొన్ని అంశాలపై వారికి తర్ఫీదునివ్వాలి. కొన్ని విషయాలపై వారికి అవగాహన ఉండాలి. ఎడ్యూకేషన్ లోన్ తీసుకున్నాం కదా.. కాలేజీలో చేర్పించేశాం కదా.. వారే చదువుతారులే అని వదిలేయకూడదు.

Education Loan: విద్యా రుణం తీసుకుంటున్నారా? అయితే మీ పిల్లలకు వీటిపై అవగాహన ఉండాల్సిందే..
Education Loan
Madhu
|

Updated on: May 08, 2023 | 4:00 PM

Share

ప్రస్తుత రోజుల్లో ఉన్నత విద్య అంటే అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. సాధారణ విద్యార్థులు మంచి యూనివర్సిటీ లేదా కళాశాలలో చదవాలంటే కుదరని పరిస్థితి కనిపిస్తోంది. తల్లి తండ్రులకు తమ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ఎలాగైనా పెద్ద పెద్ద సంస్థల్లో చదివించాలని భావిస్తుంటారు. అటువంటి వారికి ఓ వరం విద్యారుణం. దీని సాయంతో ఇష్టమైన కోర్సు, ఇష్టమైన కాలేజీలో పిల్లలను చేర్పించవచ్చు. విద్యా రుణంలోని కొన్ని వెసులుబాటులు, అవసరాలకు బాగా ఉపకరిస్తాయి. అయితే తల్లిదండ్రులు ఈ విద్యా రుణం తీసుకొనే ముందే పిల్లలకు మానసికంగా కొన్ని అంశాలపై వారికి తర్ఫీదునివ్వాలి. కొన్ని విషయాలపై వారికి అవగాహన ఉండాలి. ఎడ్యూకేషన్ లోన్ తీసుకున్నాం కదా.. కాలేజీలో చేర్పించేశాం కదా.. వారే చదువుతారులే అని వదిలేయకూడదు. మీ పిల్లల ఉన్నత చదువుల కోసం విద్యా రుణం తీసుకుంటున్నట్లయితే ముందుకు కొన్ని విషయాలను మీ పిల్లలకు అర్థం అయ్యే తెలియజేయాలి అవేంటో చూద్దాం..

విద్య.. దాని ప్రాముఖ్యత.. విద్య విలువ, పిల్లల భవిష్యత్తుపై అది చూపే ప్రభావం గురించి వివరించాలి. వారి వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలను తీర్చిదిద్దడంలో అది పోషిస్తున్న పాత్ర గురించి తల్లిదండ్రులు తమ పిల్లలకు నేర్పించాలి.

ఆర్థిక బాధ్యత.. బడ్జెటింగ్, పొదుపు, రుణ నిర్వహణతో సహా ఆర్థిక బాధ్యత ప్రాముఖ్యత గురించి తల్లిదండ్రులు తమ పిల్లలకు అవగాహన కల్పించాలి.

ఇవి కూడా చదవండి

రుణ ప్రాథమిక అంశాలు.. వడ్డీ రేటు, తిరిగి చెల్లించే నిబంధనలు.. సకాలంలో తిరిగి చెల్లించకపోతే వచ్చే ఇబ్బందులను పిల్లలకు అర్థం అయ్యేలా చెప్పాలి. చక్కగా చదువుకోవడం, మంచి ఉద్యోగాన్ని సాధించడంపై దృష్టి పెట్టేలా పిల్లలకు ప్రోత్సహించాలి.

అప్పు, ఆదాయ నిష్పత్తి.. మన ఆదాయాన్ని బట్టి రుణం ఎంత ఉండాలి. రుణం, ఆదాయం నిష్పత్తి గురించి పిల్లలకు వివరించాలి. ఎంత రుణం తీసుకోవచ్చు, తిరగి చెల్లించే సామర్థ్యం ఎంత అనే అంశాలపై అవగాహన అవసరం.

క్రెడిట్ స్కోర్.. తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి క్రెడిట్ స్కోర్‌ను నిర్వహించాల్సిన ప్రాముఖ్యత గురించి బోధించాలి. ఇది రుణాల వడ్డీ రేట్లను ఎలా ప్రభావితం చేస్తుందో చెప్పాలి.

లోన్ ఆప్షన్లు.. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఫెడరల్ ప్రైవేట్ లోన్‌లతో సహా అందుబాటులో ఉన్న వివిధ రకాల విద్యా రుణాలు, ప్రతి దాని లాభాలు, నష్టాల గురించి పిల్లలకు అవగాహన కల్పించాలి.

అర్హతలు.. పిల్లలు విద్యాపరమైన అవసరాలు, ఆదాయ పరిమితులతో సహా విద్యా రుణాల కోసం అర్హత ప్రమాణాల గురించి తెలుసుకోవాలి. పాఠశాల విద్య పూర్తికాకముందే తల్లిదండ్రులు తమ పిల్లలకు వాటి గురించి అవగాహన కల్పించాలి. ఇది వారి పరీక్షలలో బాగా రాణించటానికి ,పెద్ద లక్ష్యాలను సాధించడానికి వారిని ప్రేరేపిస్తుంది.

లోన్ రీ పేమెంట్.. అందుబాటులో ఉన్న వివిధ రీపేమెంట్ ఆప్షన్‌ల గురించి తల్లిదండ్రులు తమ పిల్లలకు నేర్పించాలి. దాదాపు అన్ని రుణదాతలు రుణం తిరిగి చెల్లించడం ప్రారంభమయ్యే ముందు మారటోరియం వ్యవధిని అందిస్తారు. వారు ఇప్పటికే ఉద్యోగం ప్రారంభించి, తిరిగి చెల్లింపు కోసం డబ్బును ఉపయోగించినట్లయితే, ఈ వ్యవధి నగదును ఆదా చేయడానికి అవకాశంగా ఉంటుంది. మీ లోన్‌ను ముందుగానే తిరిగి చెల్లించడం కోసం, రుణదాతలు ఎటువంటి పెనాల్టీని వసూలు చేయరు.

బాగా వెతకాలి.. ఎడ్యుకేషన్ లోన్ తీసుకునే ముందు రుణదాతలు, వడ్డీ రేట్లు, రీపేమెంట్ ఆప్షన్‌లను పరిశోధించడం ముఖ్యం. దీని అవసరతను పిల్లలు అర్థం చేసుకోవాలి. అందుకే ఈ ప్రక్రియలో మీ పిల్లల ప్రమేయం ఉండేలా చూసుకోండి.

తెలివిగా రుణాలు తీసుకోవాలి.. తల్లిదండ్రులు తమ పిల్లలకు తెలివిగా రుణాలు తీసుకోవడం నేర్పించాలి. వారు తిరిగి చెల్లించగలిగే రుణాలను మాత్రమే తీసుకోవడం, అనవసరమైన అప్పులను నివారించడం గురించి చెప్పాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..