ఎఫ్‌డీ కన్నా అధిక వడ్డీ ఇచ్చే ఈ పోస్ట్ ఆఫీస్ పథకం గురించి తెలుసా? రూ. 1.5లక్షల వరకూ పన్ను మినహాయింపు కూడా..

NSC Interest Calculation:ప్రస్తుతం నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్‌పై 7.7 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. మీరు రూ.1000 డిపాజిట్ చేస్తే ఐదేళ్ల తర్వాత మీకు రూ.1403 వస్తాయి. అలాగే రూ.లక్ష పెడితే మెచ్యూరిటీలో రూ.లక్షా 40 వేలు పొందొచ్చు.

ఎఫ్‌డీ కన్నా అధిక వడ్డీ ఇచ్చే ఈ పోస్ట్ ఆఫీస్ పథకం గురించి తెలుసా? రూ. 1.5లక్షల వరకూ పన్ను మినహాయింపు కూడా..
Post Office NSC
Follow us
Madhu

|

Updated on: May 08, 2023 | 5:00 PM

మీరు సురక్షితమైన పెట్టుబడి పథకాల్లో పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నారా? అధిక రాబడితో పాటు పన్ను ప్రయోజనాలు కూడా కోరుకుంటున్నారా? అయితే ఈ పోస్ట్ ఆఫీస్ పథకం మీకు బెస్ట్ ఆప్షన్ కాగలదు. దీనిలో పెట్టుబడి పెడితే మీకు ఎలాంటి రిస్క్ ఉండదు. ఆ పథకం పేరు నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్(ఎన్ఎస్‌సీ). ఇటీవల ఈ పథకంలో వడ్డీ రేటును ప్రభుత్వం పెంచింది. దీంతో పెట్టుబడి దారులకు అధిక రాబడిని అందిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

వడ్డీ ఎంతంటే..

ప్రస్తుతం నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్‌పై 7.7 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. మీరు రూ.1000 డిపాజిట్ చేస్తే ఐదేళ్ల తర్వాత మీకు రూ.1403 వస్తాయి. అలాగే రూ.లక్ష పెడితే మెచ్యూరిటీలో రూ.లక్షా 40 వేలు పొందొచ్చు. ఈ పథకంలో మీరు కనీసం వెయ్యి రూపాయల నుంచి రూ.100 గుణిజాలలో ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చు. ఈ ఎన్ఎస్‌సీ పథకంలో గరిష్ట పరిమితి లేదు. సింగిల్ అకౌంట్ లేదా జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ముగ్గురు కలిసి జాయింట్ ఖాతా తెరిచే అవకాశం ఉంది. మైనర్ పేరుపై కూడా ఎన్ఎస్‌సీ అకౌంట్ తెరవొచ్చు. అయితే గార్డియన్ ఉండాలి.

ఇది గుర్తుంచుకోవాలి..

అయితే కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌పై వడ్డీ రేట్లను సమీక్షిస్తూ వస్తుంది. అంటే త్రైమాసికానికి ఒకసారి వడ్డీ రేట్ల సమీక్ష జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగించొచ్చు. లేదంటే వడ్డీ రేట్లను పెంచొచ్చు. ఇదీ కాకపోతే వడ్డీ రేట్లలో కోత కూడా విధించొచ్చు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

పన్ను ప్రయోజనాలు ఇలా..

ఇకపోనే ఎస్ఎస్‌సీ స్కీమ్‌లో డబ్బులు పెట్టిన వారు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ప్రయోజనాలు పొందొచ్చు. ఏడాదికి రూ. 1.5లక్షల వరకూ మినహాయింపు పొందొచ్చు. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్ మెచ్యూరిటీ కాలం ఐదేళ్లు. మీరు డబ్బులు పెట్టిన దగ్గరి నుంచి ఐదేళ్లు ఇన్వెస్ట్‌మెంట్లను కొనసాగించాల్సి ఉంటుంది. అవసరం అయితే మెచ్యూరిటీ కన్నా ముందే స్కీమ్ నుంచి బయటకు రావొచ్చు.

ఫిక్స్ డ్ డిపాజిట్ కన్నా మంచిదా..

ప్రస్తుతం ఎన్ఎస్సీ పథకంలో 7.7శాతం వడ్డీ ఉంది. ఇది ఐదేళ్ల కాలపరిమితితో తీసుకొనే ఫిక్స్ డ్ డిపాజిట్ కన్నా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ నేషనల్ సేవింగ్స్ పథకంలో మీరు ఎంత పెట్టుబడి పెట్టినా కచ్చితమైన రాబడి ఉంటుంది. మీ పెట్టుబడికి కేంద్ర ప్రభుత్వ భద్రత, భరోసా లభిస్తోంది. అయితే ఎఫ్ డీ ల్లో కేవలం రూ. 5లక్షల వరకూ మాత్రమే ఆర్బీఐ భద్రత ఇస్తుంది. ఆపై పెట్టే పెట్టుబడికి గ్యారంటీ ఉండదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..