AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కారు ప్రియులకు సూపర్‌ గుడ్‌న్యూస్‌.. సరికొత్త స్టైల్లో రోల్స్‌ రాయిస్‌.. ధర, ఫీచర్స్‌ తెలిస్తే గాల్లో తేలిపోతారు..

సరికొత్త రోల్స్ రాయిస్ లా రోజ్ నోయిర్ కారు పరిమిత ఎడిషన్ కారు. అంటే నాలుగు కార్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ముందుగా బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ కారు లభిస్తుంది. రోల్స్ రాయిస్ కొత్త కారును విడుదల చేసింది. మీరు దాని ధర విన్న తర్వాత కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంటే, మీరు వెంటనే బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది లిమిటెడ్ ఎడిషన్ కారు. దాని పేరు

కారు ప్రియులకు సూపర్‌ గుడ్‌న్యూస్‌.. సరికొత్త స్టైల్లో రోల్స్‌ రాయిస్‌.. ధర, ఫీచర్స్‌ తెలిస్తే గాల్లో తేలిపోతారు..
La Rose Noire
Jyothi Gadda
|

Updated on: Aug 22, 2023 | 9:54 PM

Share

ఒకప్పుడు ఇంటి ముందు కారున్న వ్యక్తులు బాగా ధనవంతులని అనుకునే వారు. అప్పట్లో కారు కేవలం లగ్జరీ వస్తువు మాత్రమే. కానీ, ప్రస్తుతం ప్రజల జీవన శైలి, అవసరాలు మారిపోయాయి. ప్రతి ఇంటికి కారు అవసరంగా మారిపోయింది. ఇప్పుడు కేవలం ధనవంతులు మాత్రమే కాదు.. సామాన్యులు సైతం కారు వాడుతున్నారు. కొన్ని కంపెనీలు లక్ష రూపాయలకే కారును అందుబాటులోకి తేవడంతో సామాన్యులకు కారు పెద్ద భారం కాకుండా పోయింది. ఇంకా భారత్‌లో వందల కొద్ది కార్ల కంపెనీలు పుట్టుకోచ్చాయి. లక్షల నుంచి కొన్ని కోట్ల రూపాయల విలువైన కార్లు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. భారతదేశంలో ఖరీదైన కార్లకు కొదవలేదు. రోజూ కోట్ల రూపాయల కార్లలో తిరిగే ధనవంతులు ఎందరో ఉన్నారు. రోడ్లపై రూ.10 కోట్ల కార్లు, మోడిఫైడ్ రూ.15 కోట్ల కార్లు కనిపించడం మామూలే. ఇక భారతదేశంలోని అత్యంత ఖరీదైన కార్లలో బ్రిటిష్ కారు రోల్స్ రాయిస్ కల్లినన్ కూడా ఒకటి. దీని ధర దాదాపు 10 కోట్ల రూపాయలు. అయితే ఇప్పుడు అన్ని రికార్డులు బద్దలు కొట్టిన కారు విడుదలైంది.

ఇది రోల్స్ రాయిస్ లా రోజ్ నోయిర్. సరికొత్త రోల్స్ రాయిస్ లా రోజ్ నోయిర్ కారు పరిమిత ఎడిషన్ కారు. అంటే నాలుగు కార్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ముందుగా బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ కారు లభిస్తుంది. రోల్స్ రాయిస్ కొత్త కారును విడుదల చేసింది. మీరు దాని ధర విన్న తర్వాత కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంటే, మీరు వెంటనే బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది లిమిటెడ్ ఎడిషన్ కారు. దాని పేరు రోల్స్ రాయిస్ లా రోజ్ నోయిర్. ఇప్పుడు దీని ధర 211 కోట్ల రూపాయలు. ఈ కారులో ఫిచర్స్‌ఎలా ఉంటాయో తెలిస్తే గాల్లో తేలిపోవాల్సిందే.

ఇదొక మాస్టర్‌పీస్ బిల్ట్ కార్. అంటే దీని ధర 211 కోట్ల రూపాయలు. ఈ కారు బుక్ చేసుకున్న వారికి కారు డమ్మీ తాళం తీసి ఫోస్ ఇచ్చి డెలివరీ చేయడమే కాదు. రోల్స్ రాయిస్ యాజమాన్యం కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ కారును బాకరట్ రోజ్ ఫ్లవర్ స్ఫూర్తితో ఫ్రాన్స్ డిజైన్ చేసింది. ఈ కారు అనేక రంగుల్లో లభ్యం కానుంది. ముందు నుంచి చూస్తే ఒక రంగు, వెనుక నుంచి చూస్తే మరో రంగులో కనిపిస్తుంది. ఈ కారు వెనుక దాదాపు 2 సంవత్సరాల కృషి ఉంది. కారు ప్రతి నిర్మాణం ఎంతో చర్చించదగిన అంశం. సమీక్షించబడింది, పరీక్షించబడింది. ఉత్పత్తి చేయబడుతుంది. ఇందులో ట్విన్ టర్బో ఛార్జ్డ్ 6.75 లీటర్ ఇంజన్ కలదు.

ఇవి కూడా చదవండి

ఈ కారు 601 హెచ్‌పి పవర్, 840 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. లా రోజ్ నోయిర్ కారు గరిష్ట వేగం గంటకు 250 కి.మీ. ఈ కారులో రివర్సిబుల్ రూఫ్, ఎలక్ట్రోక్రోమిక్ గ్రాస్ వంటి అనేక ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. అధునాతన సాంకేతికత, అనేక ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
త్రివర్ణ జెండా ఎగురవేస్తున్నారా..? ఈ తప్పులు చేస్తే జైలుకే!
త్రివర్ణ జెండా ఎగురవేస్తున్నారా..? ఈ తప్పులు చేస్తే జైలుకే!
కొరడా చేతపట్టి వీధుల్లోకి ప్రభుత్వ బడి టీచర్‌.. అసలు సంగతి ఏమంటే?
కొరడా చేతపట్టి వీధుల్లోకి ప్రభుత్వ బడి టీచర్‌.. అసలు సంగతి ఏమంటే?
ఒకే ఓవర్‌లో 7 సిక్సర్లు.. క్రికెట్ చరిత్రలోనే తొలిసారి ఇలా..
ఒకే ఓవర్‌లో 7 సిక్సర్లు.. క్రికెట్ చరిత్రలోనే తొలిసారి ఇలా..
ఆఫ్ఘాన్ డైరెక్ట్‌గా క్వాలిఫై అయింది.. వెస్టిండీస్ కాలేదు! ఎందుకు?
ఆఫ్ఘాన్ డైరెక్ట్‌గా క్వాలిఫై అయింది.. వెస్టిండీస్ కాలేదు! ఎందుకు?
ఆ సినిమాకు ఫస్ట్ ఛాన్స్ నేనే.. కానీ రిజెక్ట్ చేయడానికి కారణం ఇదే.
ఆ సినిమాకు ఫస్ట్ ఛాన్స్ నేనే.. కానీ రిజెక్ట్ చేయడానికి కారణం ఇదే.
వరుణ యాగం.. నీటిలో కూర్చొని 11 మంది వేద పండితుల పూజలు!
వరుణ యాగం.. నీటిలో కూర్చొని 11 మంది వేద పండితుల పూజలు!
ఈ చిట్కా తో బెండకాయ వేపుడు జిగురు లేకుండా పొడిపొడిగా చేసేయండి
ఈ చిట్కా తో బెండకాయ వేపుడు జిగురు లేకుండా పొడిపొడిగా చేసేయండి
పాక్షిక సూర్య గ్రహణం తర్వాత వారి జీవితాల్లో శుభాలు..!
పాక్షిక సూర్య గ్రహణం తర్వాత వారి జీవితాల్లో శుభాలు..!
పచ్చిమిర్చి పచ్చడి ఇలా చేసి.. వేడి అన్నంలో నెయ్యితో అదిరిపోద్ది!
పచ్చిమిర్చి పచ్చడి ఇలా చేసి.. వేడి అన్నంలో నెయ్యితో అదిరిపోద్ది!
విగతజీవులుగా దంపతులు.. సెల్ఫీ వీడియోతో షాకింగ్ ట్విస్ట్!
విగతజీవులుగా దంపతులు.. సెల్ఫీ వీడియోతో షాకింగ్ ట్విస్ట్!