AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch viral video: మేకపోతునే పరాచకాలా… సరదా తీర్చిందిగా…! ఎగిరి తంతే ఎక్కడో పడ్డాడు గురుడు..!

ఇంటర్‌నెట్‌లో వైరల్‌ అవుతున్న ఈ వీడియోకు 15 వేలకు పైగా వీక్షణలు, 200కి పైగా లైక్‌లు వచ్చాయి. వినియోగదారులందరూ కూడా వ్యాఖ్యానించారు. దాడికి ముందు, మేక అద్భుతమైన రన్అప్ తీసుకుంది అంటూ కొందరు నెటిజన్లు కామెంట్‌ చేశారు. అదే సమయంలో కొంతమంది వినియోగదారులు మేక తెలివైనది అంటున్నారు. 13 అడుగులు వెనక్కి వెళ్లి, 4 అడుగులు ముందుకు వెళ్లి సూపర్‌ డ్యాష్‌ ఇచ్చింది అంటున్నారు. . కొంతమంది వినియోగదారులు అది మేక కాదు, మల్లయోధుడు అంటున్నారు..

Watch viral video: మేకపోతునే పరాచకాలా... సరదా తీర్చిందిగా...! ఎగిరి తంతే ఎక్కడో పడ్డాడు గురుడు..!
Angry Goat
Jyothi Gadda
|

Updated on: Aug 22, 2023 | 8:16 PM

Share

మేకల శక్తిని తక్కువగా అంచనా వేయకూడదు. అవును, మేక తన కొమ్ములతో ఒక్కసారి ఢీకొడితే ఎంతటి మనిషినైనా సరే నేలకరుచుకోవాల్సిందే. అంత శక్తి ఉంటుంది మేకకు. ఎవరినైనా అనవసరంగా వేధించడం ఎంత ప్రాణాంతకమో నేర్పించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతడు చేసిన దానికి సరైన ఫలితం దక్కిందంటున్నారు వీడియో చూసిన నెటిజన్లు. ఏం జరిగిందంటే ఓ వ్యక్తి మేకను అనవసరంగా ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు హెచ్చరికగా మేక అతడిపై ఒకసారి లైట్‌గా దాడి చేసింది. కానీ ఆ వ్యక్తికి బుద్ది రాలేదు. ఇక దాంతో మరింత కోపంతో ఊగిపోయిన ఆ మేకపోతు..లాంగ్ రన్అప్ తీసుకుని పరుగున వచ్చి అతడిని నేరుగా నేలమీద పడే విధంగా ఢీ కొట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారుతుండగా, జనాలు తెగ నవ్వుకుంటున్నారు.

కేవలం 44 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో ఒక యువకుడు కోరి కష్టాలు తెచ్చుకున్నాడని అర్థం అవుతుంది. అవును, అతను చేతిలో ఎర్రటి కుర్చీని పట్టుకుని మేకపోతును బెదిరిస్తూ ఆటపట్టిస్తున్నాడు. దాంతో ఆ మేక అతనిపై కోపం తెచ్చుకుని దాడి చేస్తుంది. రెండు టూవీలర్ల మధ్యలో నిలబడి పదే పదే ఎర్రటి కూర్చీతో మేకపోతును బెదిరించసాగాడు. యువడి పిచ్చి చేష్టలతో విసుగెత్తిపోయిన మేకపోతు.. కాసేపు ప్రశాంతంగా ఉండిపోయింది.. తుఫాను ముందు ప్రశాంతతలా మేకపోతు.. సైలెంట్‌ వెనక్కి అడుగులు వేస్తూ వెళ్లిపోయింది.. అక్కడ నుంచి మేక పరుగెత్తుకుంటూ వచ్చి ఒక్కసారిగా ఆ వ్యక్తిని నేలకేసి కొట్టింది. ఓ సారి ముందు నుంచి మరోసారి వెనక నుంచి అతని బలంగా ఢీకొట్టింది. వైరల్‌ అవుతున్న వీడియోలో … షూట్ చేసిన వ్యక్తి కూడా నవ్వుతాడు.

ఇవి కూడా చదవండి

ట్విట్టర్ హ్యాండిల్ @RetardedHurt ద్వారా ఆగస్టు 21న వీడియో పోస్ట్ చేశారు. దీనికి అతను క్యాప్షన్‌లో ఇలా రాశాడు -ఇదే మీ కర్మ! అని..ఇక ఇంటర్‌నెట్‌లో వైరల్‌ అవుతున్న ఈ వీడియోకు 15 వేలకు పైగా వీక్షణలు, 200కి పైగా లైక్‌లు వచ్చాయి. వినియోగదారులందరూ కూడా వ్యాఖ్యానించారు. దాడికి ముందు, మేక అద్భుతమైన రన్అప్ తీసుకుంది అంటూ కొందరు నెటిజన్లు కామెంట్‌ చేశారు. అదే సమయంలో కొంతమంది వినియోగదారులు మేక తెలివైనది అంటున్నారు. 13 అడుగులు వెనక్కి వెళ్లి, 4 అడుగులు ముందుకు వెళ్లి సూపర్‌ డ్యాష్‌ ఇచ్చింది అంటున్నారు. . కొంతమంది వినియోగదారులు అది మేక కాదు, మల్లయోధుడు అంటున్నారు..

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్