జూలో కనిపించిన అరుదైన జీరాఫీ.. ఈ వింత జంతువును చూసేందుకు క్యూ కట్టిన సందర్శకులు

ఈ జీరాఫీ పిల్ల చూసేందుకు చాలా ముద్దుగా కనిపించింది. ఇలాంటి పిల్లని ఎప్పుడూ చూడలేదు, వీలైనంత త్వరగా మా పిల్లలను ఈ జూకి తీసుకెళ్లాలని కొందరు దీనిపై స్పందించారు. ఒక నెల కూడా కాలేదు.. ఇప్పటికే 6 అడుగుల పొడవున్న ఈ జీరాఫీ.. ఆకర్షణీయంగా కనిపిస్తోందని మరొకరు చెప్పారు. తల్లితో ఎంత ప్రశాంతంగా ఆడుకుంటుందోనని ఇంకొకరు వ్యాఖ్యనించారు. మొత్తానికి ఈ అరుదైన జీరాఫీ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.

జూలో కనిపించిన అరుదైన జీరాఫీ.. ఈ వింత జంతువును చూసేందుకు క్యూ కట్టిన సందర్శకులు
Rare Spotless Giraffe
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 22, 2023 | 5:15 PM

తెల్ల నెమళ్లు, పులులు, సింహాలను చూశాం. అలాంటి వాటిని చూసినప్పుడు జంతు ప్రేమికులు ఎంతగానో ముచ్చటపడుతుంటారు. కానీ, మీరు ఎప్పుడైనా మచ్చలేని తెల్ల జిరాఫీని చూశారా..? ఈ అరుదైన జిరాఫీ జంతు ప్రేమికులను ఆకట్టుకుంటోంది. అమెరికాలోని బ్రైట్స్ జూలో ఇటీవల ఓ అరుదైన జిరాఫీ జన్మించింది. ఈ జిరాఫీ ఒంటిపై ఎలాంటి గీతలు లేకుండా పుట్టింది. ప్రస్తుతం తన తల్లి సంరక్షణలో ఉన్న ఈ జిరాఫీ జు. 31న జన్మించింది. ప్రస్తుతం ఇది 6 అడుగుల ఎత్తు ఉంది. ఇది పుట్టిన రోజు నుండి వివిధ దేశాలలోని జంతుప్రదర్శనశాలలలో జిరాఫీ నిపుణులతో చర్చిస్తున్నామని చెరప్పారు. వారి మార్గదర్శకత్వంలో జిరాఫీకి వైద్య పరీక్షలు, ఆహారం, అందించటం జరుగుతోందని జూ సిబ్బంది తెలిపారు. నెట్‌లో ఈ జీరాఫీ వీడియో, ఫోటోలు చూసిన జనాలు ఇలాంటి జీరాఫీని తొలిసారిగా చూస్తున్నామంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Rare Spotless Giraffe F

ఈ జీరాఫీ తెల్లగా కాకుండా పూర్తిగా గోధుమ రంగులో ఉందని పోస్ట్‌లో పేర్కోన్నారు.. ఈ జాతికి చెందిన ఆడజీరాఫీ 17 అడుగుల ఎత్తు, 2,600 పౌండ్ల (1,179 కిలోలు) వరకు బరువు కలిగి ఉంటయని చెప్పారు. జిరాఫీ కన్జర్వేషన్ ఫౌండేషన్ (GCF) ప్రకారం, ఈ జిరాఫీ నాలుగు ప్రత్యేకమైన జాతులలో ఒకటి. దీన్ని పరిరక్షించడమే ఈ సంస్థ లక్ష్యం. 2018లో ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఈ జీరాఫీని అంతరించిపోతున్న జాతిగా గుర్తించింది. గత మూడు దశాబ్దాలలో 40% జిరాఫీలు అడవి నుండి అదృశ్యమయ్యాయి. కాబట్టి జిరాఫీలను రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జూ వ్యవస్థాపకుడు టోనీ బ్రైట్ అన్నారు. 1970లలో జపాన్‌లో మచ్చలు లేని మరో జిరాఫీ పుట్టిన దాఖలాలు ఉన్నాయని జూ అధికారులు, సిబ్బంది చెబుతున్నారు.

బ్రైట్స్ జూ జిరాఫీకి అందమైన పేరు కోసం వెతుకుతోంది. తన ఫేస్‌బుక్ పేజీలో పేర్లను సూచించాలని ప్రజలను అభ్యర్థించింది. ఇప్పటివరకు షార్ట్‌లిస్ట్ చేసిన పేర్లలో కిపెకీ, ఫిర్యాలీ, షాకిరి, జమెల్లా వంటి పేర్లను సెలక్ట్‌ చేసినట్టుగా చెప్పారు.

ఇవి కూడా చదవండి

ఈ జీరాఫీ పిల్ల చూసేందుకు చాలా ముద్దుగా కనిపించింది. ఇలాంటి పిల్లని ఎప్పుడూ చూడలేదు, వీలైనంత త్వరగా మా పిల్లలను ఈ జూకి తీసుకెళ్లాలని కొందరు దీనిపై స్పందించారు. ఒక నెల కూడా కాలేదు.. ఇప్పటికే 6 అడుగుల పొడవున్న ఈ జీరాఫీ.. ఆకర్షణీయంగా కనిపిస్తోందని మరొకరు చెప్పారు. తల్లితో ఎంత ప్రశాంతంగా ఆడుకుంటుందోనని ఇంకొకరు వ్యాఖ్యనించారు. మొత్తానికి ఈ అరుదైన జీరాఫీ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..