AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మంచానికి కిరాయి…అద్దె ఇంటికి యజమాని వింత కండీషన్‌.. వారానికి ఎంతో తెలుసా..? ఇక ఆ గది చూస్తే షాక్‌ అవ్వాల్సిందే..

సోషల్ మీడియాలో షేర్‌ చేసిన ఫోటోలో రెండు బెడ్లు పక్కపక్కనే ఏర్పాటు చేశారు. దానితో పాటుగా కొన్ని షరతులు కూడా రాసి ఉంచారు. చాలా మంది ఈ పోస్ట్‌ చూసి ఆందోళన వ్యక్తం చేశారు. ఇళ్లు అద్దె పేరుతో వారానికి 23,000 రూపాయలకు ఇక్కడ మంచం మాత్రమే ఇస్తున్నారని నెటిజన్లు వాపోతున్నారు. కొంతమంది ఈ యాడ్ చూసి షాక్ అయ్యామంటున్నారు.

మంచానికి కిరాయి...అద్దె ఇంటికి యజమాని వింత కండీషన్‌.. వారానికి ఎంతో తెలుసా..? ఇక ఆ గది చూస్తే షాక్‌ అవ్వాల్సిందే..
Rental House
Jyothi Gadda
|

Updated on: Aug 22, 2023 | 6:37 PM

Share

ప్రస్తుతం మెట్రో నగరాల్లో ఇళ్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. చాలా మంది ప్రజలు ఉద్యోగాలు, బతుకు దెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్తుంటారు. అలా ఒక వ్యక్తి తన దేశం లేదా నగరాన్ని విడిచిపెట్టి మరొక ప్రదేశానికి వెళ్లినప్పుడు, అక్కడ నివసించడానికి ఒక స్థలాన్ని, ఇంటిని సమకూర్చుకోవడం అతిపెద్ద సవాలు. ఎందుకంటే ఇంట్లో సకల సౌకర్యాలతో జీవించిన తర్వాత బయట జీవించడం అంత తేలిక కాదు. బట్జ్‌లో మంచం, ఫ్యాన్, కొన్ని నిత్యావసర వస్తువులు ఉన్న పెద్ద గది దొరికితే హాయిగా ఉండొచ్చని అనుకుంటారు. కానీ నేటి కాలంలో ఇతర నగరాలకు వలస వెళ్ళిన ప్రజల కోరికలన్నీ కల్లలుగానే మిగిలిపోతున్నాయి. ఎందుకంటే ఇంటి యజమానులు అద్దె గురించి మాత్రమే పట్టించుకుంటారు. వారు ఇచ్చిన గదిలో ఎవరైనా సౌకర్యంగా ఉన్నారా లేదా అనేది వారికి పట్టింపు ఉండదు. భారతదేశంలోనే కాదు విదేశాల్లోనూ ఇదే పరిస్థితి. మీరు నమ్మకపోతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలో నిజం ఏమిటో తెలుసుకోండి.

ఇక్కడ ఇళ్లు అద్దెకు ఇవ్వబడును అనే ప్రకటన చూసిన తర్వాత ప్రజలు ఆగ్రహానికి గురయ్యే విధంగా కనిపించింది. ఇంటిని అద్దెకు ఇచ్చేందుకు ఆ ఇంటి యజమానులు ఒకటి కంటే ఎక్కువ షరతులు పెట్టారు. ఈ యజమాని పెట్టిన ప్రకటన చూసిన నెటిజన్లకు కళ్లు బైర్లు కమ్మేసినంత పనైంది. ఇళ్లు అద్దెకు ఇవ్వబడును అనే ప్రకటన మెల్బోర్న్ నుండి వచ్చింది. ఇక్కడ భారతీయ కరెన్సీలో రూ. 24,438. అద్దెగా ప్రకటించారు. ఈ ఇల్లు రైలు కనెక్టివిటీకి దగ్గరగా ఉంది. అంతేకాదు.. ఉచిత ఇంటర్నెట్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. ఇక ఈ ఇంటి అద్దె ప్రకటన Facebook హౌస్‌మేట్ గ్రూప్‌లో పోస్ట్ చేశారు. అందులో ఇలా రాసి ఉంది. – ఒకే రూమ్‌లో ఇద్దరు అద్దెకు ఉండాల్సి ఉంటుంది. ఇలాగే ప్రతి గదిలోనూ ఇద్దరు వ్యక్తులు ఉంటారని చెప్పారు. మొత్తం ముగ్గురు వ్యక్తులు రూ. 22,438 వారానికి చెల్లించాల్సి ఉంటుంది.

సోషల్ మీడియాలో షేర్‌ చేసిన ఫోటోలో రెండు బెడ్లు పక్కపక్కనే ఏర్పాటు చేశారు. దానితో పాటుగా కొన్ని షరతులు కూడా రాసి ఉంచారు. ఈ గదిలోకి అతిథులు రాకూడదు. స్మోకింగ్ చేయకూడదు. చాలా మంది ఈ పోస్ట్‌ చూసి ఆందోళన వ్యక్తం చేశారు. ఇళ్లు అద్దె పేరుతో వారానికి 23,000 రూపాయలకు ఇక్కడ మంచం మాత్రమే ఇస్తున్నారని నెటిజన్లు వాపోతున్నారు. కొంతమంది ఈ యాడ్ చూసి షాక్ అయ్యామంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..