AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

West Bengal Student : విశాఖలో విద్యార్దిని అనుమానాస్పద మృతి.. కలకత్తా లో కేసు నమోదు.. బెంగాల్ సీఎం సీరియస్‌

రితీ సాహా మృతి పై అనుమానస్పద మృతిగా సెక్షన్ 174 ఐపీసీ కింద కేసు నమోదు చేశాం. ఫోరెన్సిక్ నివేదిక అందాల్సి ఉంది. ఆ నివేదిక ను బట్టి తదుపరి విచారణ ఉంటుందన్నారు విశాఖ డీసీపీ విద్యాసాగర్ నాయుడు. సాధారణంగా ఒక రాష్ట్రంలో జరిగిన ఘటనలపై వేరే రాష్ట్రంలో కేసులు నమోదు కావడం అరుదు..అలాంటిది కలకత్తా లో కేసు నమోదు కావడం, ఇక్కడ స్థానిక పోలీసుల పై ఆరోపణలు రావడం లాంటి పరిణామాల పై విస్తృత చర్చే సాగుతోంది. ఈ వ్యవహారంలో పోలీస్ ఉన్నతాధికారుల పాత్రపైనా ఆరోపణలు రావడం గమనార్హం.

West Bengal Student : విశాఖలో విద్యార్దిని అనుమానాస్పద మృతి.. కలకత్తా లో కేసు నమోదు.. బెంగాల్ సీఎం సీరియస్‌
Vizag Death
Eswar Chennupalli
| Edited By: Jyothi Gadda|

Updated on: Aug 22, 2023 | 5:56 PM

Share

విశాఖ నరసింహ నగర్ లోని సాధనా హాస్టల్ లో గత నెల 14 వ తేదీన బెంగాల్ కు చెందిన ఇంటర్ విద్యార్దిని రితీ సాహా అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే అది హత్య గా విద్యార్దిని తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు. స్థానిక పోలీసులు డబ్బులు తీసుకుని ఆత్మహత్యగా చిత్రీకరించారంటూ తల్లితండ్రులు ఏకంగా బెంగాల్ సీఎం కు ఫిర్యాదు చేశారు..దీంతో బెంగాల్ లోని నేతాజీ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయించిన బెంగాల్ ముఖ్యమంత్రి విచారణ కోసం ఒక టీమ్ ను విశాఖ పంపిస్తున్నారు. అయితే దీనిపై పూర్తి వివరాలు ఇవ్వాల్సిన సంబంధిత విశాఖ నాల్గవ పట్టణ పోలీసులు అక్కడకు వెళ్లిన మీడియా ను నియంత్రించే ప్రయత్నం చేస్తుండడం మరింత అనుమానాలకు తావిస్తోంది.

వైద్య విద్య కోసం వచ్చి విగత జీవిగా..

బెంగాల్ కు చెందిన రితీ సాహా ఆకాష్ బైజూస్ లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆకాష్ బైజూస్ కు అనుసంధానంగా ఉన్న సాధనా హాస్టల్ లో రితీ సాహా ఉంటోంది. బైజూస్ యాజమాన్యం ఆ హాస్టల్ ను ఔట్ సోర్సింగ్ చేసి నిర్వహిస్తోంది. గత నెల 14న హాస్టల్ 4 వ అంతస్తు పై నుంచి దూకి చనిపోయిందని తల్లితండ్రులకు హాస్టల్ యాజమాన్యం తెలిపింది. హుటాహుటిన బెంగాల్ నుంచి వచ్చిన తల్లి తండ్రులకు హాస్టల్ సిబ్బంది, పోలీసులు చెప్తున్న దానిపై అనేక అనుమానాలు వచ్చాయి. నాలుగో అంతస్తు పైకి వెళ్ళే సమయంలో ఒక డ్రెస్ లో ఉన్నట్టు హాస్టల్ సీ సీ పుటేజ్ లో కనిపించింది. కానీ, కింద పడి ఉన్న మృత దేహం పై మరో కలర్ డ్రెస్ ఉన్నట్టు ఆ భవనానికి ఎదురుగా ఉన్న బిల్డింగ్ సీ సీ ఫోటేజ్ లో ఉన్నట్టు మృతు రాలి తల్లి తండ్రులు చెప్తున్నారు. ఆ విషయాన్ని పోలీసులకు చెబితే పట్టించుకోవడం లేదనీ ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక పోలీస్ ల పై నమ్మకం లేదంటూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కి ఫిర్యాదు చేశారు తల్లితండ్రులు. కలకత్తా లో ఈ హత్య కేసుపై మమతా బెనర్జీ మాట్లాడారు. బెంగాల్ మంత్రి అనూప్ ను ఏకంగా రితీ సాహా ఇంటికి పంపించారు.

ఇవి కూడా చదవండి

విశాఖ లో జరిగిన వ్యవహారం పై కోల్ కత్తా లో కేసు నమోదు.. పోలీసులపై అనుమానాలు..

కోల్ కత్తా నేతాజీ నగర్ పీ ఎస్ లో రితీ సాహా అనుమానస్పద మృతిపై కేసు నమోదు కావడం పై విశాఖ పోలీస్ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. స్థానిక పోలీస్ అధికారుల వ్యవహార శైలి పై మృతురాలి తల్లితండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. మేము అక్కడ ఉన్నప్పుడు ఒక నల్లటి కార్ లో వచ్చిన వ్యక్తులకు బ్యాగ్‌లలో డబ్బులు పంపారని, వాళ్ళు పోలీస్ అధికారులకు చెందిన మనుషులు అని తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు. సాధారణంగా ఒక రాష్ట్రంలో జరిగిన ఘటనలపై వేరే రాష్ట్రంలో కేసులు నమోదు కావడం అరుదు..అలాంటిది కలకత్తా లో కేసు నమోదు కావడం, ఇక్కడ స్థానిక పోలీసుల పై ఆరోపణలు రావడం లాంటి పరిణామాల పై విస్తృత చర్చే సాగుతోంది. ఈ వ్యవహారంలో పోలీస్ ఉన్నతాధికారుల పాత్రపైనా ఆరోపణలు రావడం గమనార్హం.

విచారణ సాగుతోంది: డీసీపీ విద్యాసాగర్

రితీ సాహా మృతి పై అనుమానస్పద మృతిగా సెక్షన్ 174 ఐపీసీ కింద కేసు నమోదు చేశాం. ఫోరెన్సిక్ నివేదిక అందాల్సి ఉంది. ఆ నివేదిక ను బట్టి తదుపరి విచారణ ఉంటుందన్నారు విశాఖ డీసీపీ విద్యాసాగర్ నాయుడు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..