Watch Viral Video: వామ్మో ఇదేం భయంకర ఫోటో షూట్‌ తల్లి.. పాపం ఆ వరుడి పరిస్థితి ఎలా ఉందో ఏమో..!

తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియో వీటన్నింటికీ భిన్నంగా ఉంది. ఇందులో పెళ్లికూతురు అందరి సామర్థ్యానికి మించిన పని చేసింది. పెళ్లికూతురు ఈ వింత ఫోటోషూట్ చూసి జనాలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఒక వినియోగదారు స్పందిస్తూ కామెంట్‌ బాక్సులో ఇలా రాశారు. వధువు ఇలాంటి ఫోటోషూట్ చూసి నెటిజన్లు షాక్‌ తింటున్నారు. ఈ రకమైన ఫోటోషూట్ ట్రెండ్‌గా మారిందంటూ పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Watch Viral Video: వామ్మో ఇదేం భయంకర ఫోటో షూట్‌ తల్లి.. పాపం ఆ వరుడి పరిస్థితి ఎలా ఉందో ఏమో..!
Bride Perform Stunt
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 22, 2023 | 7:14 PM

పెళ్లి చేసుకోబోతున్న యువతి యువకులు.. ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్, పోస్ట్ వెడ్డింగ్ ఫోటో షూట్ అంటూ నానా హంగామా చేస్తున్నారు. కొత్త కొత్త ప్రదేశాల్లో వింత వింత ఫోజులతో ఫోటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. అలా తీసిన వీడియోలను కొందరు తమ సోషల్ మీడియాలో కూడా పోస్ట్‌ చేసుకుని లైకులు, కామెంట్ల కోసం చూస్తుంటారు..ఇలాగే, పెళ్లికి సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిలో వధువరుల మెహిందీ ఫక్షన్‌ మొదలు.. పెళ్లి తర్వాత రిస్పెషన్‌ వరకు అనే ఫన్నీ ఇన్సిడెంట్లు, భావోద్వేగ సంఘటనలు అనేకం చూస్తుంటాం. వివాహ వేడుక సందర్భంగా కొందరు తమ విన్యాసాలు చూపించి నెట్టింట హల్‌చల్‌ చేస్తుంటారు. మరికొందరు చేసే వింత చేష్టలు ప్రజలన్ని కడుపుబ్బ నవ్వించేలా చేస్తాయి. ఇది కాకుండా వధువు తండ్రితో లేదా వరుడు వధువుకు సర్ ప్రైజ్ ఇస్తూ డ్యాన్స్ చేయడం చూసి అందరూ ఎమోషనల్ అవుతారు. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియో వీటన్నింటికీ భిన్నంగా ఉంది. ఇందులో పెళ్లికూతురు అందరి సామర్థ్యానికి మించిన పని చేసింది. వెడ్డింగ్ లెహంగా వేసుకున్న వధువు సరిగ్గా నడవలేక కష్టపడుతోంది. అయితే ఈ వధువు అద్భుతం చేసింది. ఆమె హనీ సింగ్ పాటలో లెహంగా ధరించి స్టంట్ చేసింది. ఈ స్టైల్‌లో పెళ్లికూతురును చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఇంటర్‌ నెట్‌లో ఈ వీడియో వైరల్ అవుతోంది.

ఈ క్లిప్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో (@zevarbride) అనే ఖాతా ద్వారా పోస్ట్ చేశారు. ఇది ఏ భంగిమ తల్లి అనే క్యాప్షన్‌తో వీడియో షేర్‌ చేశారు. ఆగస్టు 8న షేర్ చేసిన వైరల్ వీడియోకు ఇప్పటికే 27 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. ఎర్రటి లెహంగా ధరించిన ఒక అమ్మాయి అబ్బాయితో నిలబడి ఉండటం మనం వీడియోలో చూడవచ్చు. ఆ మరుసటి క్షణం ఆ వరుడు బ్యాలెన్స్ చేస్తూ లేచి నిలబడతాడు. వధువు వెంటనే తన ఒక కాలును అతని తొడపై, మరొకటి అతని మెడపై పెట్టి పైకెక్కింది. పైగా ఆమె నవ్వుతూ ఫోటోలకు పోజులిచ్చింది. హనీ సింగ్ పాడిన ‘పార్టీ విత్ భూత్‌నాథ్’ పాట బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతోంది. ఈ స్టంట్‌బాజ్ పెళ్లికూతురు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లెహంగాలో ఇంత రచ్చ చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. జనాలు కూడా ఆ వీడియోను బాగా ఎంజాయ్ చేశారు. ఒక్కొక్కరుగా వ్యాఖ్యానిస్తూ ఎగతాళి చేశారు. ఈ వధువు వరుడి ఛాతీపై ఎక్కి ఫోటోషూట్ చేయడాన్ని మీరు కూడా చూడండి.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Zevar bride (@zevarbride)

పెళ్లికూతురు ఈ వింత ఫోటోషూట్ చూసి జనాలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఒక వినియోగదారు స్పందిస్తూ కామెంట్‌ బాక్సులో ఇలా రాశారు. వధువు ఇలాంటి ఫోటోషూట్ చూసి నెటిజన్లు షాక్‌ తింటున్నారు. ఈ రకమైన ఫోటోషూట్ ట్రెండ్‌గా మారిందంటూ పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల