Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Viral Video: రెండు కింగ్‌కోబ్రాల డ్యాన్స్‌ ఎప్పుడైనా చూశారా…? అద్భుతమైన వీడియో వైరల్‌.. తప్పక చూడాల్సిందే..!

డ్యాన్స్ చేస్తూనే ఈ రెండు నాగుపాములు ఒకదానిపై ఒకటి దాడి చేసుకుంటున్నాయి. అయితే వీడియో చూడగానే ఓ గ్రామం చుట్టు పక్కల సీన్ అని తెలిసింది. పొలం దగ్గర కింగ్ కోబ్రా స్నేక్‌ను చూసిన స్థానిక వ్యక్తి తన మొబైల్ కెమెరాలో వీడియో రికార్డ్ చేశాడు. ఈ దృశ్యం చాలా ఆశ్చర్యంగా ఉం

Watch Viral Video: రెండు కింగ్‌కోబ్రాల డ్యాన్స్‌ ఎప్పుడైనా చూశారా...? అద్భుతమైన వీడియో వైరల్‌.. తప్పక చూడాల్సిందే..!
King Cobra Danc
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 22, 2023 | 8:38 PM

ప్రకృతి అందమైన జీవులతో నిండి ఉంది. అనేక జంతువులు, మొక్కలు చిత్ర విచిత్ర ప్రదేశాలు మానవులను ఎంతగానో ఆకర్షిస్తాయి. ప్రకృతి రమణీయతకు సంబంధించిన పలు రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. ఇప్పుడు రెండు పాములు డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. దానిని చూసిన తర్వాత, ఇంటర్నెట్‌లో సంతోషకరమైన వాతావరణం నెలకొంది. కింగ్ కోబ్రా అత్యంత విషపూరితమైన పాము. ఈ భయంకర పాము.. ఒక నిమిషంలో మనిషిని చంపే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇలాంటి కింగ్‌ కోబ్రాలు భారతదేశంతో సహా పొరుగు దేశాలలో సాధారణంగా కనిపిస్తారు. ఇలాంటి నాగరాజులు సాధారణంగా దట్టమైన అడవులలో మాత్రమే కనిపిస్తుంటాయి. కానీ వర్షాకాలంలో నాగుపాములు ఆహారం వెతుక్కుంటూ అడవికి సమీపంలోని గ్రామాలు, ఇళ్లలోకి చేరుతుంటాయి. అయితే, మీరు ఎప్పుడైనా కింగ్ కోబ్రా డ్యాన్స్ చేయటం చూశారా..?

ఈ వైరల్ వీడియోలో మీరు రెండు కింగ్‌ కోబ్రాలు అద్భుతంగా డ్యాన్స్‌ చేస్తున్న వీడియో కనిపించింది. రెండు కింగ్ కోబ్రాలు ఒకదానికొకటి పదగ విప్పి, బీన్ ట్యూన్‌కు అనుగుణంగా డ్యాన్స్ చేస్తూ కనిపిస్తాయి. డ్యాన్స్ చేస్తూనే ఈ రెండు నాగుపాములు ఒకదానిపై ఒకటి దాడి చేసుకుంటున్నాయి. అయితే వీడియో చూడగానే ఓ గ్రామం చుట్టు పక్కల సీన్ అని తెలిసింది. పొలం దగ్గర కింగ్ కోబ్రా స్నేక్‌ను చూసిన స్థానిక వ్యక్తి తన మొబైల్ కెమెరాలో వీడియో రికార్డ్ చేశాడు. ఈ దృశ్యం చాలా ఆశ్చర్యంగా ఉందంటూ నెటిజన్లు భిన్నమైన కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ వీడియోపై చాలా మంది స్పందించారు.

ఇవి కూడా చదవండి

ఇంతకుముందు, పొదలకు సమీపంలో రెండు పాములు సంచరిస్తూ కనిపించిన ఇలాంటి వీడియో ఇంటర్నెట్‌లో కనిపించింది. ఈ క్లిప్‌ను @jungle Beats.wildlife ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. వీడియోతో షేర్ చేసిన క్యాప్షన్, “స్నేక్ కంబాట్!” కొన్ని రోజుల క్రితం పోస్ట్ చేసినప్పటి నుండి, వీడియో వందల కొద్దీ లైక్‌లు, అనేక వ్యాఖ్యలను పొందింది. చాలా మంది ఈ వీడియోను చూసిన తర్వాత చాలా ఆశ్చర్యకరమైన కామెంట్స్‌ ఇచ్చారు. ఇది చాలా అరుదుగా కనిపిస్తుంది. ఆ వీడియో చూసి చాలా మంది థ్రిల్ అయ్యారు. ఒక Instagram వినియోగదారు అందమైన డ్యాన్స్‌ అంటూ కామెంట్‌ చేశారు. మరొక వినియోగదారు ఇలా వ్రాశారు.. ఇది ఖచ్చితంగా అద్భుతమైనది అంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..