భర్త కోసం బంగ్లాదేశ్‌ నుంచి వచ్చిన మహిళకు షాక్‌.. సరిహద్దులు దాటిన ప్రేమకథలో కొత్త ట్విస్ట్‌..!

సౌరభ్ కాంత్ తివారీకి ఫోన్ చేస్తే లిఫ్ట్‌ చేయటం లేదు..అట్టా బంగ్లాలో ఉన్న సన్యా అక్తర్ ఎదురు చూస్తూ ఉండిపోయింది.  కానీ, ఎట్టకేలకు ఓ సారి ఆమె కాల్‌ లిఫ్ట్‌ చేశాడు. అతను బంగ్లాదేశ్‌కు తిరిగి రావడం కష్టమని చెప్పాడు..నువ్వే నోయిడాకి రావాలని, ఇక్కడే కలిసి జీవిద్దామని అన్నాడు. సన్యా అక్తర్ వద్ద పాస్‌పోర్ట్ లేదు. అందువల్ల సన్యా భారత్ కు వచ్చే అవకాశం లేదని సౌరభ్ తివారీ తెలిపాడు.

భర్త కోసం బంగ్లాదేశ్‌ నుంచి వచ్చిన మహిళకు షాక్‌.. సరిహద్దులు దాటిన ప్రేమకథలో కొత్త ట్విస్ట్‌..!
Women Travel India
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 22, 2023 | 9:14 PM

సరిహద్దులు దాటిన ప్రేమకథలు ఇటీవల ట్రెండింగ్‌లో ఉంటున్నాయి. సీమా హైదర్, అంజుతో పాటు చాలా మంది ప్రేమికులు భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, దక్షిణ కొరియాతో సహా అనేక దేశాల సరిహద్దులను దాటి తమ ప్రేమను గెలిపించుకుంటున్నారు. ఇప్పుడు అందుకు భిన్నంగా జరిగింది ఓ ప్రేమ కథ. బంగ్లాదేశ్‌లో ఉద్యోగం చేస్తున్న భారతదేశంలోని నోయిడాకు చెందిన వ్యక్తి బంగ్లాదేశ్ అమ్మాయిని ప్రేమించాడు. తర్వాత పెళ్లి చేసుకున్నాడు. భర్త పని ముగించుకుని భారత్‌కు తిరిగి వచ్చాడు. కానీ, మళ్లీ అతడు బంగ్లాదేశ్‌ వెళ్లలేదు. అలా రోజులు, నెలల తరబడి ఎదురుచూసిన భార్య ఎట్టకేలకు ఓ నిర్ణయం తీసుకుంది. తన బిడ్డతో కలిసి ఇండియా వచ్చేసింది. భర్తతో కలిసి ఇండియాలో కొత్త జీవితం ప్రారంభించేందుకు వచ్చిన భార్యకు ఊహించని షాక్ ఎదురైంది. ఆమె భర్తకు భారత్‌లో మరో కుటుంబం ఉందన్న సంగతి తెలిసింది.

నోయిడాకు చెందిన సౌరభ్ కాంత్ తివారీ 2017 నుంచి 2021 వరకు బంగ్లాదేశ్‌లో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్‌కు చెందిన సన్యా అక్తర్‌తో స్నేహం ఏర్పడింది. వీరి స్నేహం కాస్త తర్వాత ప్రేమగా మారింది. తాను ఒంటరి వ్యక్తినంటూ, ఇంకా తనకు పెళ్లి కాలేదని చెప్పి సన్యాను బుట్టలో వేసుకున్నాడు. కొంతకాలం ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహరంతో..సౌరభ్ కాంత్ తివారీ సన్యాకు పెళ్లి ప్రపోజ్ చేశాడు. దానికి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఒప్పుకుంది ఆ యువతి. సన్యా అక్తర్ కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి తొలుత నిరాకరించారు. కానీ, ఎట్టకేలకు అందరి అంగీకారంతో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహ వేడుక కూడా సాదాసీదాగా జరిగిపోయింది. నోయిడాకు చెందిన సౌరభ్ కాంత్ తివారీ కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. వీరి కాపురం కూడా సాఫీగానే సాగింది.

అయితే, సౌరభ్ కాంత్ తివారీ 2022లో భారతదేశానికి తిరిగి వచ్చాడు. సౌరభ్ కాంత్ తివారీ నోయిడాలోని తన ఇంటికి వచ్చిన తర్వాత, అతను తన బంగ్లాదేశ్ భార్యను మరచిపోయాడు. కాల్ చేయడం మానేశాడు.. బిడ్డ పుట్టి 1సంవత్సరం అయినా భర్త ఆచూకీ లేదు.  సౌరభ్ కాంత్ తివారీకి ఫోన్ చేస్తే లిఫ్ట్‌ చేయటం లేదు..అట్టా బంగ్లాలో ఉన్న సన్యా అక్తర్ ఎదురు చూస్తూ ఉండిపోయింది.  కానీ, ఎట్టకేలకు ఓ సారి ఆమె కాల్‌ లిఫ్ట్‌ చేశాడు. అతను బంగ్లాదేశ్‌కు తిరిగి రావడం కష్టమని చెప్పాడు..నువ్వే నోయిడాకి రావాలని, ఇక్కడే కలిసి జీవిద్దామని అన్నాడు. సన్యా అక్తర్ వద్ద పాస్‌పోర్ట్ లేదు. అందువల్ల సన్యా భారత్ కు వచ్చే అవకాశం లేదని సౌరభ్ తివారీ తెలిపాడు.

ఇవి కూడా చదవండి

దీంతో, సన్యా అక్తర్ తన ఏడాది పాపతో నోయిడాకు వచ్చింది. సౌరభ్ కాంత్ తివారీ ఇంటికి వచ్చిన సన్యా షాక్ అయ్యింది. సౌరభ్ కాంత్ తివారీకి పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. బంగ్లాదేశ్‌లో పెళ్లి చేసుకునే ముందు భారత్‌లో ఓ కుటుంబం ఉందని చెప్పాలేదు. బిడ్డను ఎత్తుకుని ఇండియా వస్తే ఇక్కడ భర్తకు మరో కుటుంబం ఉంది. భారత్‌లో ఉండలేక బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లలేని దుస్థితిని ఎదుర్కొంది ఆ ఇల్లాలు. దీంతో సన్యా స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..